జనాలకు కనిపించరు సరే.. ఎమ్మెల్యేలకూ మొహం చాటేస్తారా?

Publish Date:Jun 9, 2022

Advertisement

వైసీపీ నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలకు కూడా ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్ దర్శనం గగనమేనా?  తమ నియోజకవర్గాల సమస్యలు చెప్పుకోవాలనుకున్నా, ఇతర సమస్యల గురించి చర్చించాలనుకున్నా జగన్ అప్పాయింట్ మెంట్ దొరకడం దుర్లభమా?  అంటే తాజా మాజీ మంత్రి పేర్ని నాని మాటలు వింటే నిజమేనన పించక మానదు.   బుధవారం సీఎం జగన్ నిర్వహించిన వర్క్ షాప్ లో పలువురు ఎమ్మెల్యేలు నోరు విప్పి, తమ గోడు వినిపించడం విశేషం. ఇప్పటి వరకు కేవలం పార్టీ అధినేత జగన్ చెప్పిన మాటలకు జీ హుజూర్ అంటూ తలొగ్గిన ఒక్కొక్కరూ ఇప్పుడు నోరు మెదిపేందుకు సాహసిస్తున్నారనడానికి బుధవారం జరిగిన వర్క్ షాపే నిదర్శనం.
మాజీ మంత్రి పేర్ని నాని మాటల ప్రకారం చూస్తే.. వైసీపీ నేతలు ఎవర్నీ కూడా జగన్ దరికి రానివ్వడం లేదనేది స్పష్టం అవుతోంది. ప్రతి అంశానికీ సలహాదారుల్నే నమ్మడం, వారు చెప్పిందే వినడం, చేయడం తప్పిస్తే.. వాస్తవ పరిస్థితులను ప్రజా ప్రతినిధుల నోటి నుంచి వినేందుకు ఏమాత్రం జగన్ ఇష్టపడడం లేదని చెబుతున్నారు. తమ గోడు వినిపించుకునేందుకు ఒక్కొక్కరికీ ప్రత్యేకంగా సమయం కేటాయించకపోయినా.. కనీసం ద్వారం వద్దకు వచ్చి అయినా దర్శనం ఇస్తే.. ఒక్కోసారి కనీసం 20 మంది ఎమ్మెల్యేలు సీఎంను కలుసుకునే అవకాశం ఉంటుందని పేర్ని నాని చెప్పడంలోని వాస్తవాన్ని జనం అర్థం చేసుకుంటున్నారు. గతంలో జగన్ రెడ్డి తండ్రి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఇలాగే ద్వార దర్శనం ద్వారా ఎమ్మెల్యేలను పలకరించేవారని, ఆ విధానం అయినా కొనసాగిస్తే మంచిదని పేర్ని నాని జగన్ కు సూచించారు.

జగన్ నిర్వహించిన వర్క్ షాప్ లో పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు గొంతు విప్పి మాట్లాడారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లినప్పుడు జనం తమను ముఖం మీదే మంచినీరు, రోడ్లు, డ్రైనేజీ , పొలాలకు దారుల గురించి ఎక్కడికక్కడ నిలదీస్తున్నారని, వారి ఆగ్రహాన్ని చల్లార్చడం తమ వల్ల కావడం లేదని కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు.

ఇక వర్క్ షాప్ లో పలువురు ఎమ్మెల్యేలు వ్యక్తం చేసిన నియోజకవర్గాల సమస్యల విషయానికి వస్తే..  రాష్ట్రంలో విద్యుత్ కోతలు ఉన్నాయి. బోర్లు వేయించుకుంటామంటే విద్యుత్ శాఖ నుంచి మెటీరియల్ సకాలంలో ఇవ్వడం లేదని రైతులు చెబుతున్నారని, ఇసుక సమస్య కూడా ఉందని, ఇసుక డిపోల సంఖ్య పెంచాలని కందుకూరు ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకొచ్చారు. గడప గడపకు కార్యక్రంలో మంచినీళ్ల కోసం ప్రజలు, పొలాలకు వెళ్లేందుకు దారులు నిర్మించాలని రైతులు అడుగుతున్నారని మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో గిరిజనేతరులు కొనుక్కున్న ఇళ్ల స్థలాలకు పట్టాలివ్వడం లేదని, ఈ సమస్యకు పరిష్కారం చూపాలని పోలవరం ఎమ్మెల్యే బాలరాజు వాపోయారు. ఇలా తమ నియోజకవర్గం సమస్యలు చెప్పుకునేందుకు కూడా సీఎం జగన్ అవకాశం ఇవ్వడం లేదనే అసంతృప్తి వైసీపీ ప్రజాప్రతినిధుల్లో నివురుగప్పిన నిప్పులా మారిందంటున్నారు.

అయితే.. ఎమ్మెల్యేలకు సమయం ఇస్తుంటే.. ఒక్కొక్కరూ అరగంటకు పైగా మాట్లాతున్నారని, అలా అయితే.. ఎక్కువ మందితో మాట్లాడడం సాధ్యమయ్యే పనేనా? అని జగన్ అన్నారట. అందుకే కనీసం మీ తండ్రి మాదిరిగా ఒక్కోసారి 20 మంది ఎమ్మెల్యేలకైనా ద్వార దర్శనం కల్పించండి మహప్రభో అని పేర్ని నాని వాపోయారని సమాచారం. జనంలోకి ఎలాగూ రాని జగన్ కనీసం తన పార్టీ ప్రజాప్రతినిధులకు, ఎమ్మెల్యేలకైనా ముఖం చూపిస్తారో లేదో వేచిచూడాలి మరి?!

By
en-us Political News

  
అసలాయన రాజకీయ పార్టీ ఏర్పాటు ఉద్దేశమేంటో? లక్ష్యమేంటో ఆయనకైనా స్పష్టత ఉందా అనిపించేలా ఆయన మీడియా సమావేశం సాగింది.  
ఇటు రాష్ట్రంలోనూ, అటు కేంద్రంలోనూ కూడా తెలుగుదేశం పార్టీ ఎన్డీయేలో కీలకమైన భాగస్వామ్య పక్షంగా ఉన్న నేపథ్యంలో తన పోరాటాలకు ఇండియా కూటమి అండ అవసరమని భావిస్తున్నారని చెబుతున్నారు
తన రాజకీయ విజయానికి మహిళలే ప్రధాన కారణమని ఉద్ఘాటించిన  విజయ్, మహిళలకు తగిన గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.  మన ఇంట్లోనూ తల్లులు, చెల్లెళ్లు ఉంటారు. మహిళలను ఎవరైనా అవమానిస్తే చట్టం చూస్తూ ఊరుకోదని విజయ్ హెచ్చరించారు.
తెలంగాణ వ్యవహారాల ఇన్ చార్జ్ ఆబ్సెన్స్ లో రేవంత్  తన కేబినెట్ పునర్వ్యవస్థాకరణ విషయంలో మరింత స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలుంటాయని పరిశీలకులు అంటున్నారు.  పార్టీలో, ప్రభుత్వంలో అసంతృప్తికి చెక్ పెట్టి, తన నిర్ణయాలను అమలు చేయడానికి రేవంత్ కు ఇది అనువైన సమయంగా రాజకీయవర్గాలు చెబుతున్నాయి.
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ  రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి. 
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు.  తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో  కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది.  కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు.   గతంలో ఏపీలో బీజేపీ  మద్దతు  వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ  వాస్తవాన్ని సీఎం  చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్   బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు. 
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు. 
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం,  హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు. 
 కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు.  రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్‌ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.  
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.