Publish Date:Jul 24, 2024
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా తీర్పును లెక్క చేయడం లేదు. విపక్ష హోదాకు వైసీపీ తగదని విస్పష్టంగా ప్రజలు తీర్పు ఇచ్చారు. అలాగే జగన్ కు విపక్ష నేతగా ఉండే అర్హత లేదని తేల్చేశారు. అయినా జగన్ మాత్రం విపక్ష హోదా కోసం తహతహలాడుతున్నారు. ఆ హోదా ద్వారా తనకు కేబినెట్ ర్యాంక్, తద్వారా దక్కే గౌరవం కోసం వెంపర్లాడుతున్నారు. ఇందు కోసం హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే తన తీరు ద్వారా తనకు విపక్ష నేత హోదా అర్హత లేదని తనకు తానే రుజువు చేసుకుంటున్నారు.
జగన్ ప్రభుత్వ హయాంలో తీసుకువచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేస్తూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన బిల్లుపై చర్చకు గైర్హాజర్ అవ్వడం ద్వారా రాజకీయనాయకుడిగా తన బాధ్యతా రాహిత్యాన్ని జగన్ చాటుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కూడా ఒక కారణం. ఎన్నికల ప్రచారంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామని విస్పష్టంగా చెప్పింది. ప్రజలు కూడా ఈ చట్టంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ మాత్రం తన ఎన్నికల ప్రచారంలో ఈ చట్టాన్ని గట్టిగా సమర్ధించుకున్నారు. సరే ఎన్నికలలో జగన్ పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. అది వేరే సంగతి.
ఇప్పుడు ఈ చట్టం రద్దు బిల్లుపై అసెంబ్లీలో చర్చకు జగన్ గైర్హాజరు అయ్యారు. అసలు సభలో వైసీపీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా లేరు. అంటే తాను తీసుకువచ్చిన చట్టాల విషయంలో తనకు ఇసుమంతైనా బాధ్యత లేదని భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అంటే తన ప్రభుత్వం తీసుకువచ్చిన చట్టాన్ని సమర్ధిస్తూ అసెంబ్లీలో తన గళాన్ని బలంగా వినిపించే ఒక మంచి అవకాశాన్ని జగన్ సభకు గైర్హాజర్ కావడం ద్వారా చేజార్చుకున్నారు. అలా చేజార్చుకోవడమే కాదు.. తాను తీసుకువచ్చిన చట్టం వల్ల ప్రయోజనం లేదనీ, ఇది ప్రజా వ్యతిరేక చట్టమనీ పరోక్షంగా అంగీకరించేసినట్లైంది. ఇలా తన బాధ్యతారాహిత్యాన్ని చాటుకుని జగన్ తనకు విపక్ష నేత హోదా అర్హత లేదని తానే రుజువు చేసుకున్నట్లైందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-not-eligible-for-opposition-status-39-181426.html
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది.
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్, విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు. గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్లో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు.
2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్ ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది.
ఏపీలో జరుగుతున్న పురపాలక సంఘం ఎన్నికల ఫలితాల్లో అధికార కూటమి పక్షాలు తమ జోరును ప్రదర్శిస్తున్నాయి.
రాష్ట్రంలోని పలు ముఖ్యమైన మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లో కూటమి అభ్యర్థులు ఘన విజయాలు నమోదు చేస్తున్నారు. ముఖ్యంగా కడప జిల్లాలోని బద్వేల్ మున్సిపల్ చైర్పర్సన్ పీఠాన్ని కూటమి దక్కించుకుంది.
పులివెందుల మున్సిసిపల్ ఎన్నికల పోలింగ్ రోజున వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్లాన్ చేసిన డ్రామాలు, ఎన్నికల వాతావరణాన్ని దెబ్బతీసేందుకు చేసిన ప్రయత్నాలను ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. ఓటర్లను భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు ప్రవర్తించాయని, రాజ్యాంగబద్ధంగా జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను అడ్డుకోవడానికి ప్రయత్నించారని ఆరోపించారు.