జగన్ దీక్షకు మద్దతుగా వేలాదిగావస్తున్నజనం

Publish Date:Jan 11, 2012

Advertisement

ఆర్మూరు (నిజామాబాద్ జిల్లా): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపి జగన్మోహన రెడ్డి చేపట్టిన రైతుదీక్షకు మద్దతుగా తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ప్రజలు వేలాదిగా తరలి వస్తున్నారు. రైతులతోపాటు మహిళలు, వృద్ధులు, విద్యార్థులు, యువకులు, అన్ని వర్గాల ప్రజలు దీక్షాశిబిరం వద్దకు చేరుకున్నారు. జగన్ని దగ్గరగా చూసేందుకు, ఆయనతో మాట్లాడేందుకు, కరచాలనం చేసేందుకు జనం బారులుతీరారు.దీక్షా ప్రాంగణం జనంతో నిండిపోయింది. రైతులు తమ పొలాలలో ఎండిపోయిన పంటలను తీసుకువచ్చి జగన్కు చూపించి, తమ బాధలు చెప్పుకుంటున్నారు. వారు చెప్పే బాధలు జగన్ ఓపికగా వింటున్నారు. వారిని పరామర్శించి, తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చి పంపుతున్నారు.నిజామాబాద్‌ జిల్లా మునిపల్లి నుంచి వేలాది మంది మహిళా రైతులు ఆర్మూర్‌ వచ్చారు. వైఎస్‌ హయాంలో రైతులకు ఎలాంటి సమస్యా లేదని, ఇప్పుడు పట్టెడన్నం తినే పరిస్థితి లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జగన్‌ దీక్ష తమకు మనోధైర్యం కలిగించిందని చెప్పారు.

తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్‌, కరీంనగర్‌, మెదక్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, ఖమ్మం జిల్లాల నుంచే కాకుండా ప్రకాశం, కర్నూలు, గుంటూరు జిల్లా గురజాల తదితర ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేకంగా రైతులు తరలివచ్చి జగన్‌ రైతుదీక్షకు సంఘీభావం తెలిపారు. జగన్‌ చేస్తున్న దీక్షతోనైనా ఈ ప్రభుత్వం కళ్లు తెరవాలని కోరారు. దీక్షలో ప్రకటించిన డిమాండ్లపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రజలకు అన్నం పెడుతోన్న తమగురించి ఇంతగా ఆలోచించే నాయకుడు దొరకడం తమ అదృష్టమని చెబుతున్నారు. మహిళలు కూడా జగన్‌కు సంఘీభావంగా స్వచ్చందంగా తరలివస్తున్నారు.


ఓవైపు దీక్ష కొనసాగిస్తూనే ప్రతిఒక్కరినీ ప్రత్యేకంగా కలిసేందుకు జగన్‌ ఆసక్తి చూపుతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు, కార్యకర్తలు , అభిమానులు, మహిళలు, విద్యార్థులను ఒక్కొక్కరిగా వేదికపై కలుసుకొని వాళ్ల సమస్యలు ఓపిగ్గా వింటున్నారు. ఈనేపథ్యంలో పలువురు ఇంజనీరింగ్‌ కాలేజీల విద్యార్థులు కూడా జగన్‌ను కలిసి, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ గురించి ప్రభుత్వం మీద ఒత్తిడితేవాలని కోరారు.మహానేత చనిపోయాక రాష్ట్రంలోని రైతులకు అలాంటి భరోసా మరోసారి కనిపించిందని రైతులు ఆనందం వ్యక్తం చేశారు. రెండున్నరేళ్లుగా తాము పడుతున్న గోసకు జగన్‌ రూపంలో ఇక ముగింపు దొరికినట్లేనన్నారు.

రెండోరోజు దీక్షలో ఎమ్మెల్యేలు ప్రసాదరాజు, రామకృష్ణారెడ్డి , మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి, కొండా సురేఖతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు. జర్నలిస్టు నేతలు అమర్‌, అమర్‌నాథ్‌ తదితరులు కూడా జగన్‌ను కలిసి రైతు కోసం చేస్తున్న దీక్ష చారిత్రాత్మక మైనదని ప్రశంసించారు.
 

By
en-us Political News

  
భారత రాజకీయాల్లో దేశంలోనే అత్యంత సంపన్నుల ఎదుగుదలపై, ముఖ్యంగా పారిశ్రామిక దిగ్గజం గౌతమ్ అదానీ అసాధారణ ప్రగతిపై లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం మరో భారీ సంక్షేమ కానుకను అందించేందుకు సిద్ధమైంది.
women cricketer Nandini suicide,BCCI Under 19 cricket, Vikarabad crickete, rFemale cricketer suicide
బీసీ రాజ్యాధికార పాదయాత్రలో తన వాహనాన్ని లారీ ఢీకొట్టిన ఘటనపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలంగాణ డీజీపీకి ఫిర్యాదు చేశారు.
అక్రమ రవాణా ముఠాలకు సింహస్వప్నం.. వేలాది మంది బాధితులకు విముక్తి.. 2 వేల మందికి పైగా సివిల్ సర్వెంట్లకు మార్గదర్శకత్వం.
రాష్ట్రంలో ఎప్పుడూ చర్చనీయాంశంగా ఉండే అంశాలపై ప్రముఖులు స్పందిస్తుండడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణ విద్యా వ్యవస్థలో కీలక సంస్కరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది.
ఇటీవలి కాలంలో ఓ ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలో తగిన భద్రతా ప్రమాణాలు పాటించకుండా నిర్వహించిన దాండియా వేడుకలో దురదృష్టవశాత్తు ఒక విద్యార్థి ప్రాణాలు కోల్పోగా, పలువురు గాయపడ్డారు. అలాగే ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా సినిమా ప్రమోషన్ ఈవెంట్  నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.  
కూల్‌డ్రింక్‌లో విషం కలిపి 10వ తరగతి విద్యార్థి హత్య.!
అత్యవసర అవసరాల నిమిత్తం శ్రీను ఒక మొబైల్ లోన్ అప్లికేషన్ ద్వారా  40 వేల రూపాయలు రుణం తీసుకున్నాడు. అయితే అనుకోని ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఆ మొత్తాన్ని సకాలంలో తిరిగి చెల్లించలేకపోయాడు. దీంతో లోన్ యాప్ రికవరీ ఏజెంట్ల నుంచి శ్రీనుకు   వేధింపులు ప్రారంభమయ్యాయి.
275 మంది నిపుణులకు ఉద్యోగ అవకాశాలు...మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్‌లోని చారిత్రాత్మక చార్మినార్ ప్రాంతంలో సోమవారం నాడు అసాధారణ వాతావరణం నెలకొంది.
తెలంగాణలో ధరణి, భూభారతి భూ రికార్డుల అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.