పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా.. పార్టీపై జగన్ పట్టు సడలిందా?

Publish Date:Apr 3, 2023

Advertisement

వైసీపీ బండారం బయటపడిపోయింది.   పార్టీలో అసమ్మతి, అసంతృప్తి తారస్థాయిలో ఉన్నాయన్న విషయాన్ని ఇంత కాలం వైసీపీ జగన్ గుప్పెట్లో మూసి కప్పి పెట్టినా ఇప్పుడా బండారం బయటపడిపోయింది. ఏపీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ రెడ్డి సోమవారం (ఏప్రిల్ 3) నిర్వహించిన ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ చార్జిలు, ప్రాంతీయ సమన్వయ కర్తల సమావేశాలని పలువురు ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడమే ఇందుకు తార్కానంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

ఇలా డుమ్మా కొట్టిన వారిలో జగన్ కు గట్టి మద్దతుదారులుగా ముద్ర పడిన కొడాలి నాని, ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా కూడా గైర్హాజరయ్యారు. అలాగే మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ధర్మాన ప్రసాదరావు, విడదల రజని తదితరులు సైతం డుమ్మా కొట్టారు.  అదే విధంగా  సకల శాఖల మంత్రిగా గుర్తింపు పొందిన సజ్జల రామకృష్ణారెడ్డి సైతం ఈ భేటీలో కనిపించలేదు.  ధర్మాన ప్రసాదరావు ఆసరా కార్యక్రమం చెక్కుల పంపిణీ ఉన్నందున రాలేకపోయారని ఆయన వర్గీయులు చెబుతున్నా ఆ మాటలు పెద్దగా నమ్మదగ్గవిగా లేవని పార్టీ శ్రేణులే అంటున్నారు.

ఇక మంత్రి బుగ్గన అయితే కోవిడ్ బారిన పడటం వల్ల సమావేశానికి రాలేకపోయారని అంటున్నారు. విడదల రజని త్వరలో తన నియోజకవర్గంలో సీఎం పర్యటన ఉన్నందున అందుకు సంబంధించిన ఏర్పాట్లలో బిజీగా ఉండి రాలేదని చెబుతున్నారు. వీరే కాక మరి కొందరు కూడా ఈ కీలక సమావేశానికి డుమ్మా కొట్టారు. ఎవరికి వారు ఏవేవో కారణాలు చెబుతున్నా, ఒక్క బుగ్గనకు తప్ప మరెవరికీ ఈ సమావేశానికి గైర్హాజరవ్వడానికి క్రెడిబుల్ కారణాలు లేవనే పరిశీలకులు అంటున్నారు.   మొత్తం మీద ఎమ్మెల్యేలు, మంత్రులలో విస్పష్టంగా బయటపడుతున్న అసమ్మతి దెబ్బకు జగన్ దిగి వచ్చారు. అందుకే పార్టీ ఎమ్మెల్యేలూ, సమన్వయ కర్తలూ, నియోజకవర్గ ఇన్ చార్జిల సమావేశంలో ఆయన స్వరం పూర్తిగా మారిపోయింది.

గతంలో నిర్వహించిన గడపగడపకూ మన ప్రభుత్వం సమీక్షలలోలా ఈ సారి ఆయన నోటి వెంట హెచ్చరికలు రాలేదు. మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరుపై విమర్శలు లేవు. రుసరుసలు లేవు. వచ్చే ఎన్నికలలో పార్టీ టికెట్లివ్వను జాగ్రత్త అన్న బెదరింపులు లేవు. అన్నిటికీ మించి టోన్ మారింది. హెచ్చరికల నుంచి బుజ్జగింపులకు దిగి వచ్చారు. ఎమ్మెల్యేలలో అసంతృప్తి, ధిక్కారం ఇవన్నీ విపక్షాల దుష్ప్రచారమన్నారు. ఎన్నికల సంవత్సరం కనుక మరింత కష్టపడి చేయాలని ఒక విధంగా బతిమలాడుతున్న స్వరంతె చెప్పారు. విపక్షాల ఉచ్చులో, వ్యూహంలో పడొద్దన్నారు. 60 మంది ఎమ్మెల్యేలలో అసంతృప్తి రగులుతోందన్నది పూర్తిగా దుష్ప్రచారం అని చెప్పుకున్నారు.

గడపగడపకూ బ్రహ్మాండంగా సాగుతోందనీ, అంతా చక్కగా పాల్గొంటున్నారనీ కితాబిచ్చారు.  ముందస్తు ఎన్నికలనీ, మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనీ ఈ సమావేశానికి ముందు పార్టీ శ్రేణుల నుంచి పెద్ద ఎత్తున వచ్చిన సమాచారం అంతా ఉత్తుత్తిదేనని జగన్ ఈ సమావేశం ద్వారా తేల్చేశారు. ఎన్నికలకు ఇంకా 14 నెలల సమయం ఉందనీ, ఈ కాలంలో కష్టించి పని చేసి ప్రభుత్వ, పార్టీ గ్రాఫ్ పడిపోకుండా చూడాలని ఎమ్మెల్యేలను కోరారు.  ఎమ్మెల్సీ ఎన్నికలలో అసలు పార్టీకీ, ప్రభుత్వానికీ ఎలాంటి ఎదురు దెబ్బే తగలలేదని, బ్రహ్మాండంగా 17 స్థానాలలో గెలిచామనీ, ఓడింది కేవలం నాలుగు స్థానాలలో మాత్రమేనని చెప్పుకొచ్చారు. ఈ సమావేశంలో జగన్ ప్రసంగం, ఆయన తీరు పార్టీ నాయకులు, శ్రేణులనే కాదు, పరిశీలకులను సైతం నివ్వెరపరిచింది.

ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు పార్టీకి దూరం అయ్యారు. అత్యంత కీలకం అని చెబుతూ జగన్ సోమవారం (ఏప్రిల్ 3) నిర్వహించిన సమావేశానికి పలువురు డుమ్మా కొట్టారు. డమ్మా కొట్టిన వారిలో ఎక్కువ మంది పార్టీకి కానీ, అధినేతకు కానీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే గైర్హాజరయ్యారు. దీంతో జగన్ ప్రదర్శిస్తున్నది మేకపోతు గాంభీర్యమేననీ, ఆయనకు పార్టీపై పట్టు పూర్తిగా సడలిపోయిందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ సమావేశం అనంతరం పార్టీలో అసమ్మతి మరింత పెచ్చరిల్లినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.  

By
en-us Political News

  
శంషాబాద్ వద్ద హైదరాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై ఊహించని ఘటన చోటుచేసుకుంది.
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.