హైదరాబాద్‌లో దారుణం: భార్య తలపై రోకలిబండతో భర్త దాడి.!

Publish Date:Sep 27, 2026

Advertisement

హైదరాబాద్‌లో కుటుంబ కలహాలు విషాదాంతమయ్యాయి. చిన్నచిన్న గొడవలు చివరకు ఓ మహిళ ప్రాణాలు పోయేంత దారుణానికి దారితీశాయి. చిక్కడపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని బాగ్‌లింగంపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.మాచర్ల జ్యువెలరీ షాప్ సమీపంలో నరేందర్‌ (34), తేజస్వి (29) దంపతులు నివాసం ఉంటున్నారు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం మరోసారి ఇద్దరి మధ్య వివాదం చెలరేగింది.

ఉదయం సుమారు 11:22 గంటల సమయంలో మాటామాటా పెరిగింది. అప్పటికే ఆగ్రహంతో ఉన్న నరేందర్ ఒక్కసారిగా భార్య తేజస్విపై రోకలిబండతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ దాడిలో తేజస్వి తీవ్రంగా గాయపడి, అధిక రక్తస్రావంతో అక్కడికక్కడే స్పృహ కోల్పోయింది.దాడి అనంతరం నరేందర్ అక్కడి నుంచి పరారైనట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న చిక్కడపల్లి పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే తేజస్వి మృతి చెందినట్లు గుర్తించారు.

పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.అసలు భార్యాభర్తల మధ్య గొడవకు కారణమేంటి? తరచూ జరుగుతున్న వివాదాలు ఇంతటి దారుణానికి ఎలా దారితీశాయి? క్షణికావేశంలోనే ఈ హత్య జరిగిందా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది. ఒక్క క్షణం ఆవేశం.. ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. తగాదాలు ఎంత తీవ్రంగా ఉన్నా చర్చలతో పరిష్కరించుకోవాల్సిన సమస్య.. చివరకు ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకోవడం విషాదాన్ని మిగిల్చింది.

 

 

 

[ Hyderabad, Bhaglingampally, Chikkadpally Police, Husband Wife Dispute, Family Dispute, Wife Murder, Husband Kills Wife, Domestic Dispute, Crime News, Telangana Crime ]

By
en-us Political News

  
దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న అర్బన్ ల్యాండ్ సీలింగ్‌ (ULC) దరఖాస్తుల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది.
పంజాబ్‌లోని ప్రసిద్ధ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ క్యాంపస్‌లో శనివారం రాత్రి ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి.
ఆ సమయంలో తాను కేరళ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తుండగా, గ్యానేష్ కుమార్ కేంద్ర హోంమంత్రిత్వ శాఖలో ఉన్నతాధికారిగా సేవలందిస్తున్నారని గుర్తుచేశారు. ప్రయాణ సమయంలో తన రిటైర్మెంట్ అనంతర ప్రణాళికల గురించి  ఆరా తీసిన జ్ణానేష్ కుమార్‌.. ఆ సందర్భంలోనే బీజేపీ తరఫున పతనం తిట్ట లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయాలని సూచించారన్నారు. 
ఈ నియోజకవర్గంలో గత ఎన్నికల ఫలితాలు,  ప్రస్తుత రాజకీయ వాతావరణం దృష్ట్యా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలు విజయంపై ధీమాతో ఉన్నాయి. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ బరిలోకి దిగడంతో సమీకరణాలు ఏ విధంగా మారతాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 
ప్పటి వరకూ మోడీ సర్కార్ ఘనంగా చెప్పుకుంటూ వచ్చిన పారదర్శకత ప్రశ్నార్థకమైంది.  రాజ్యాంగ వ్యవస్థలు బలహీనపడ్డాయన్న వాదనకు బలం చేకూరింది. అంత వరకూ విపక్షాలు చేసే విమర్శలను సునాయాసంగా తిప్పికొట్టి పై చేయి సాధించిన మోడీ సర్కార్ నీటి విషయంలో సమాధానం చెప్పుకోలేక తడబడింది. వెనకడుగు వేసింది. 
ఎంతటి సంక్షోభాన్నైనా సంయమనం కోల్పోకుండా అధిగమించడం, ఆ సంక్షోభాన్నే అవకాశంగా మలచుకుని ముందుకు సాగడం ఆయన నైజం. ఎంతటి క్షిష్టమైన సమస్యనైనా  పరిష్కరించగలిగే నేర్పు, ఎంతటి సంక్షోభాన్నైనా తట్టుకునిముందుకు సాగే సామర్ధ్యం కారణంగానే ఆయనకు పొలిటికల్ సర్కిల్స్ లొ  క్రైసిస్ మ్యాన్ అన్న గుర్తింపు వచ్చింది. 
వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు  35 వేలకోట్ల రూపాయల అంచనాతో  సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా..  దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో  ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు.
ఎన్నికలు రిగ్గింగ్ అవుతున్నాయని తెలిసినా, ప్రతిపక్షాలు మళ్లీ అవే ఎన్నికల్లో పాల్గొంటూ ఆ పద్ధతికి చట్టబద్ధత ఎందుకు కల్పిస్తున్నాయని ప్రశ్నించి సంచలనం సృష్టించారు.  ఓట్లు చోరీకి గురవుతున్నా, ఎమ్మెల్యేలు, ఎంపీలు కొనుగోలుకు గురవుతున్నా, పార్టీలు చీలిపోతున్నా కేవలం ఉనికి కోసమే పోరాడుతున్నారా అని నిలదీశారు.
వైసీపీకి చెందిన పలువురు నాయకులు జనసేన పార్టీలో చేరారు.
ఎండిన నదిలో గంగమ్మ పరవళ్లు.. కరువు నేలపై జలకళ.!
చెన్నైలో బీఎస్ఎఫ్ నూతన భవనాలను ప్రారంభించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి
ప్రస్తుత కాలంలో డిజిటల్ మాధ్యమాలు విద్య, విజ్ఞానాన్ని ప్రజలకు మరింత చేరువ చేస్తున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.