జగన్ అప్పుడే మొదలెట్టేశారు!.. ఫ్యాన్ స్పీడ్ తగ్గిందనా?

Publish Date:Apr 24, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వ్యూహరచన, కార్యాచరణ అప్పుడే మొదలెట్టేశారు. పార్టీలో నాయకులు, కార్యకర్తలు ఇంకా రెడీ కాకపోయినా ఆయన తనపని ఆరంభించేశారు. ఇటీవలి వరుస సంఘటనల నేపథ్యంలో రాష్ట్రంలో ఫ్యాన్ గాలి స్పీడ్ తగ్గిందన్న అభిప్రాయానికి వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ఆయన ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉండగానే ఇప్పటి నుంచే పని ప్రారంభించేయాలని నిర్ణయించుకున్నారు. గత ఎన్నికలలో తన విజయానికి తాను నిత్యం ప్రజల మధ్యలో తిరగడమే కారణమని నమ్ముతున్న ఇఫ్పుడు మరో సారి అదే చేయాలని వ్యూహ రచన చేస్తున్నట్లు అభిజ్ణ వర్గాల భోగట్టా. అయితే విపక్ష నేతగా నిత్యం ప్రజల మధ్యలో ఉండటానికీ, ముఖ్యమంత్రి హోదాలో పర్యటనలు చేయడానికి చాలా తేడా ఉందన్న విషయం ఆయన గ్రహింపునకు రాలేదని అంటున్నారు. ఇప్పుడు జగన్ ప్రజాక్షేత్రంలోకి వెళితే మూడేళ్ల పాలనా వైఫల్యాలపై సమాధానం చెప్పుకోవలసి ఉంటుంది. అది చేయకుండా విపక్షాలపై విమర్శల దాడులు చేయడం వల్ల ప్రయోజనం చేకూరదు.  
 ఇంతకీ ఎన్నికలు ఎదుర్కొనేందుకు జగన్ రచిస్తున్న వ్యూహాలేమిటంటే...ఈ మూడేళ్ల వైఫల్యాలూ పాత మంత్రుల ఖాతాలో వేసి తాను పులు కడిగిన ముత్యమన్నట్లుగా జనంలోకి వెళ్లాలన్నదేనని విశ్లేషకుల అభిప్రాయం. అందుకే అసంతృప్తులకూ, అసమ్మతీయులకూ వెరవకుండా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ చేశారన్నది వారి విశ్లేషణ.
ఇక ఇప్పుడు తన జిల్లాల పర్యటనలకు ముందు పార్టీ కమిటీలతో, కార్యకర్తలతో, రిజనల్ కోఆర్డినేటర్లు, మంత్రులు, జిల్లా అద్యక్షులు..ఇలా ఒకరనేమిటి అందరితో సమావేశం ఏర్పాటు చేసి...ఆ సమావేశంలో తన జిల్లాల పర్యటన సందర్భంగా అనుసరించాల్సిన విధానంపై వారికి దిశా నిర్దేశం చేయనున్నారు. విపక్షాలపై విమర్శలతో పాటు....ఈ మూడేళ్ల పాలనలో ఏవైనా వైఫల్యాలుంటే...అవి ఉద్వాసనకు గురైన మంత్రుల ఖాతాలో వేసేలా ఈ భేటీలో ఆయన స్పష్టమైన ఆదేశాలిచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇప్పుడు కొత్త టీమ్ తో సరికొత్తగా వచ్చే ఎన్నికలకు సమాయత్తం కావాలన్నది ఆయన వ్యూహంగా చెబుతున్నారు. వచ్చే నెల రెండో తేదీ నుంచి ఆరంభం కానున్న గడపగడపకూ వైసీపీలో కూడా ఇదే అగ్రపీఠిన నిలవాలన్నది ఆయన ఉద్దేశం.
ఇక పీకే, కాంగ్రెస్ ములాఖత్ నేపథ్యంలో రాష్ట్రంలో వైసీపీ వైఖరిపై పార్టీ శ్రేణులు ఎవరికి తోచినట్లు వారు వ్యాఖ్యలు చేస్తున్న నేపథ్యంలో ఆ విషయంలో వారికి క్లారిటీ ఇచ్చేందుకు కూడా ఈ సమావేశంలో ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఏది ఏమైనా ఎన్నికలు రెండేళ్ల ముందుగానే జగన్ పార్టీలో, పార్టీ శ్రేణుల్లో ఎన్నికల వేడి రగిలించే ప్రయత్నం చేయడం వెనుక  తన ప్రభుత్వంపై ప్రజలలో అంగా సానుకూలత కనిపించడం లేదన్న నివేదికలే కారణమని అంటున్నారు. పీకే సర్వేలు కూడా ఇదే చెప్పడంతో ఆయన ఇప్పటి నుంచే పని మొదలెట్టేశారన్నది పరిశీలకుల విశ్లేషణ.

By
en-us Political News

  
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో  అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.  అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ   అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది. 
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ..  తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ  తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి. 
ఈ ప్రాజెక్టుల నిర్మాణంలో తమ పాత్రే కీలకమని పేర్కొంటూ వైసీపీ క్రెడిట్ వార్ కు తెరతీసింది.  సోషల్ మీడియా వేదికగా వైసీపీ వారు పోలవరం ప్రాజెక్టును  దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి  కలల ప్రాజెక్ట్‌గా అభివర్ణిస్తూ పోస్టులు షేర్ చేస్తోంది.
కోమటిరెడ్డి కుటుంబానికి నల్గొండ జిల్లాలో గట్టి పట్టు ఉంది.  ఈ నేపథ్యంలో తాను కేవలం  మంత్రి పదవిని  మాత్రమే ఆశించే నాయకుడిని కాననీ.. వైఎస్ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లే నాయకుడిననీ ఆయన అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికార కూటమి భాగస్వామ్య పక్షాలైన తెలుగుదేశం, జనసేన మధ్య సంబంధాలు పైకి కనిపించేంత సజావుగా లేవనే సంకేతాలు స్పష్టమవుతున్నాయి.
తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా తీవ్ర కలకలం రేగింది
దివంగత సీఎం  వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా బుధవారం (సెప్టెంబర్ 2) నిర్వహించిన ఒక  ర్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..   తాము ఏనాడు కూడా పదవుల కోసం సిద్ధాంతాలను తాకట్టు పెట్టలేదంటూ..  వైఎస్ రాజశేఖరరెడ్డి ఆశయాల బాటలో నడిచేందుకు రాజకీయాల్లోకి ప్రవేశించామన్నారు.  
 ఆమె మాటలను బట్టి పరిశీలకులు కొండా సురేఖ పార్టీకీ, ఎమ్మెల్యే పదవికీ కూడా రాజీనామే చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని విశ్లేషిస్తున్నారు. అదే జరిగితే.. ఆమె ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్ తూర్పు నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమౌతుంది.
నా కూతురికి పెళ్లైంది.. తనకు తాను స్వతంత్రంగా మాట్లాడింది..!
ఉన్నది మాట్లాడితే చర్యలా.. సురేఖ సంచలన వ్యాఖ్యలు..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.