పంద్రాగస్టున జెండా ఆవిష్కరణకు దూరంగా జగన్?

Publish Date:Aug 16, 2025

Advertisement

అధికారంలో ఉన్నామా? లేదా? ఈ  పార్టీయా? ఆ పార్టీయా? అన్న విషయాలతో సంబంధం లేకుండా రాజకీయ నాయకులంతా పంద్రాగస్టు రోజున జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. దేశ  స్వాతంత్ర్య వేడుకలలో పాల్గొని దేశ భక్తిని చాటుకుంటారు. పార్టీలు, అధికారం వంటి విషయాలను స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలతో ముడి  పెట్టరు. అయితే వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ రూటే సెపరేటు. ఆయన ఈ సారి  స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు దూరంగా ఉన్నారు. కనీసం తన నివాసంలో జెండా ఆవిష్కరించడానికి కూడా ఆయన ముందుకు రాలేదు. తాడేపల్లి ప్యాలెస్ లో ఆయన లేరు సరే.. కనీసం బెంగళూరులోని తన నివాసంలో కూడా ఆయన జెండా ఎగురవేసిన దాఖలాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన జెండా ఆవిష్కరిస్తున్న ఫొటో మీడియాలో కానీ, వైసీపీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా కనిపించలేదు.

ఒక వైపు దేశ వ్యాప్తంగా అన్ని రాజకీయపార్టీలు, నాయకులు, సామాన్య ప్రజలూ కూడా ఘనంగా పంద్రాగస్టు వేడుకలలో పాల్గొన్నారు. అయితే విచిత్రంగా జగన్ మాత్రం పంద్రాగస్టునాడు కనీసం జెండా ఆవిష్కరణ కూడా చేయలేదు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తాను ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అంటే 2019- 2024 మధ్య కాలంలో ప్రతి సంవత్సరం పంద్రాగస్టు నాడు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎన్నడూ పార్టీ కార్యాలయంలో, తన నివాసంలో జెండాను ఆవిష్కరించారు. ఆనవాయితీని భగ్నం చేయలేదు.

అయితే మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే జగన్ మాత్రం జెండా ఆవిష్కరణ చేయలేదు. పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నిక ఓటమి బాధనుంచి తేరుకోలేదా? అంటూ నెటిజనులు సెటైర్లు వేస్తున్నారు. అధికారంలో ఉంటే మాత్రమే పంద్రాగస్టుకు జెండా ఆవిష్కరిస్తారా? అధికారం కోల్పోతే దేశంపై భక్తి ఉండదా? అంటూ నిలదీస్తున్నారు.  

By
en-us Political News

  
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.