Publish Date:Apr 21, 2022
గత ఎన్నికల ముందు జగన్ ఏం చెప్పారో...అధికారంలోకి వచ్చిన తరువాత అందుకు పూర్తి విరుద్ధంగా చేస్తున్నారు. నాడు అసెంబ్లీ సాక్షిగా అమరావతే రాజధాని అన్నారు. నేడు కోర్టులు మొట్టికాయలు వేసినా మూడు రాజధానులే ముద్దు అంటున్నారు. నాడు పాదయాత్రలో గ్రాసిమ్ రసాయనాల పరిశ్రమను విష పరిశ్రమ అంటూ విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఆ పరిశ్రమ అమృత తుల్యమంటూ ప్రారంభోత్సవానికి హాజౌతున్నారు. నాడు తెలుగుదేశంప్రభుత్వం ఔనన్న ప్రతి దానినీ కాదనమే పనిగా పెట్టుకున్న జగన్ నేడు నాడు వేటినైనా కాదన్నారో వాటినే ఔదాలుస్తూ ముందుకు సాగుతున్నారు. మొత్తానికి జగన్మాయను ఓ రేంజ్ లో ప్రదర్శిస్తున్నారు. ఇక ప్రస్తుతం ఆయన గురువారం ప్రారంభోత్సవం చేయనున్న గ్రాసిమ్ కెమికల్ ఫ్యాక్టరీ ఆదిత్య బిర్లా గ్రూపునకు చెందినది. తూర్పుగోదావరి జిల్లా భలభద్రపురంలో దాదాపు 900 కోట్ల రూపాయలతో నిర్మితమైన ఈ ఫ్యాక్టరీ గురువారం జగన్ చేతుల మీదుగా ప్రారంభం.
రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయి, పెట్టుబడులు రావడం లేదు అన్న ఆందోళన వ్యక్తమౌతున్న సమయంలో రూ.900 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ప్రారంభించడం ఎంతైనా ఆహ్వానించదగ్గది. కానీ నలుగేళ్ల నాడు విపక్ష నేత హోదాలో ఇదే పరిశ్రమపై విషంకక్కి, ప్రజలను రెచ్చగొట్టి ఉద్యమాల బాట పట్టించిన జగన్ ఇప్పుడు అదే పరిశ్రమ ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి హోదాలో రావడమే వైచిత్రి. నాడు జగన్ పుణ్యమా అని జనం ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆందోళన బాట పట్టారు. కేసుల్లో ఇరుక్కున్నారు. అలా ఇరుక్కున్న వారు దాదాపు 500 మంది ఉన్నారు. ఇప్పటికీ వారిపై కేసులు నడుస్తున్నాయి. నాడు జగన్ పరిశ్రమ అనుమతులు రద్దు చేయాలని అప్పటి చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మీరు చేయకపోతే మా ప్రభుత్వం వచ్చాకా ఆ పని చేస్తామని హుంకరించారు. అయితే మాట తప్పి మడమతిప్పి ఇప్పడు అదే పరిశ్రమ ప్రారంభోత్సవానికి సీఎం హోదాలో వెళుతున్నారు. దీనికి ఆయన ఏ మాత్రం ఇబ్బంది పడటం లేదు. అదీ జగన్ స్టైల్.
నాడు జనాల ఉసురు తీయాడానికే గ్రాసిమ్ కెమికల్ ఫ్యాక్టరీ అన్న జగన్ ఇప్పుడు తొలి దశలో ఐదు వేల మందికి ఉపాధి కల్పించే కల్పతరువుగా అదే ఫ్యాక్టరీని అభివర్ణిస్తున్నారు. మరి అప్పటి ఉద్యమాలలో కేసుల్లో ఇరుక్కున్న వారి మాటేమిటంటే నోరు విప్పడం లేదు. అధికారం కోసం కనిపించిన ప్రతి దానినీ ఖండించేసిన ఆయన ఇప్పుడు అధికారంలో ఉండి నాడు వద్దన్న ప్రతి అంశాన్ని అక్కున చేర్చుకుని అందలం ఎక్కిస్తున్నారు. నాడు జనంలో ఉద్రేకతలను రెచ్చగొట్టి వారు కేసుల్లో చిక్కుకుని విలవిలలాడిన సంగతిని ఇప్పుడు పూర్తిగా మర్చిపోయి అక్కడికే అదే పరిశ్రమ ప్రారంభోత్సవానికి కించిత్తైనా వెరవకుండా వెడుతున్నారు. ఆయన నాడు- నేడు కార్యక్రమంలో జగన్ తీరును కూడా చేరిస్తే ఇంకా బాగుంటుంది కదా! జగన్ లో నాటికీ- నేటికీ ఎంత మార్పు అని జనం ఆశ్చర్యపోయేలా జగన్ మేకోవర్ ఉందని పరిశీలకులు అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-inagurates-the-same-factory-he-opposed-when-in-opposition-39-134709.html
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.
పిడిక్కీ బియ్యానికీ ఒకే మంత్రం అన్నట్లుగా ఆమె తన బర్త్ రఫ్ కూ తెలుగుదేశం పార్టీకీ ముడి పెట్టారు. సీఎం రేవంత్ రెడ్డిది తెలుగుదేశం రక్తం కనుకనే తనకు కేబినెట్ నుంచి బర్త్ రఫ్ చేశారంటూ మీడియా సమావేశంలో కొండా సురేఖ చేసి కామెంట్స్ రాజకీయవర్గాలలో సంచలనంగా మారాయి.