విదేశీ పర్యటనకు జగన్.. ఈ సారి ఎందుకోమరి?

Publish Date:Apr 17, 2026

Advertisement

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మరోసారి విదేశీ పర్యటనకు సిద్ధమయ్యారు. గత కొంతకాలంగా రాష్ట్ర రాజకీయాల్లో నెలకొన్న వేడి, పార్టీ అంతర్గత పరిణామాల మధ్య ఆయన విదేశాలకు వెళ్లాలని నిర్ణయించుకోవడం పార్టీని అయోమయంలో పడేసింది.  జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇవ్వడంతో ఈ నెలలోనే ఆయన విదేశాలకు వెళ్లే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. జగన్ విదేశీ పర్యటన పూర్తిగా వ్యక్తిగతం. ఆయన కుటుంబంతో సహా యూరప్, యూకే పర్యటించనున్నట్లు తెలుస్తోంది. 

అక్రమాస్తుల కేసు విచారణను ఎదుర్కొంటున్న జగన్, బెయిలుపై ఉన్న నేపథ్యంలో ఆయన విదేశీ పర్యటనకు కోర్టు అనుమతి తప్పని సరి.. ఈ నేపథ్యంలోనే ఆయన నాంపల్లిలోని సీబీఐ కోర్టులో అనుమతి కోరతూ పిటిషన్ దాఖలు చేయగా, ఆయన పిటిషన్ విచారించిన కోర్టు జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇచ్చింది. అయితే వేదేశీ పర్యటనలో ఉండగా ఆయన కాంటాక్ట్ నంబర్, ఈ మెయిల్ ఐడీ సీబీఐకి ఇవ్వాలని ఆదేశించింది. 

వాస్తవానికి 2024 ఎన్నికల ఫలితాల తర్వాత నుంచీ  జగన్ ఎక్కువగా బెంగళూరులోని తన నివాసానికే పరిమితమవుతున్నారు. అప్పుడప్పుడు ఏపీకి వచ్చి పార్టీ సమీక్షల్లో పాల్గొంటున్నప్పటికీ, ఎక్కువ సమయం రాష్ట్రం వెలుపలే గడుపుతున్నారు. ఈ పరిస్థితిపై సొంత పార్టీలోనే ఒకింత అసంతృప్తి వ్యక్తం అవుతున్నది. జగన్ ఏపీకి వచ్చిన సమయం వినా, మిగిలిన సమయాల్లో వైసీపీ పరిస్థితి రాష్ట్రంలో ఉండీ లేనట్లుగానే ఉంటోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలో  జగన్ విదేశీ పర్యటనపై  సొంత పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. 

 జగన్ గతంలో విదేశీ పర్యటనకు వెళ్లిన సమయంలో  పార్టీ నుంచి కీలక నేతలు బయటకు వెళ్లిన సంగతిని ఈ సందర్భంగా పార్టీ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయి.  అన్నిటికీ మించి  రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై దృష్టి సారించాల్సిన కీలక సమయంలో జగన్ విదేశీ పర్యటనకు వెళ్లడం ఏమిటని పార్టీ వర్గాలు అంటున్నాయి. గత ఎన్నికలలో   కనీసం విపక్ష హోదా రాని విధంగా ఘోర పరాజయం తరువాత ప్రజాక్షేత్రంలో ఉండి పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సిన జగన్ బెంగళూరులో మకాం వేసి చుట్టపు చూపుగా మాత్రమే ఏపీకి రావడం పట్లే పార్టీ క్యాడర్ లో అసంతృప్తి ఉన్నది. ఇప్పుడు ఏకంగా నెల రోజులకు పైగా విదేశీ పర్యటనకు వెళ్లి  రాష్ట్రానికి ముఖం చాటేయడమేంటని పార్టీ నేతలు కూడా అంతర్గత సంభాషణల్లో అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.  

By
en-us Political News

  
కృష్ణాష్టమి 2026 సందర్భంగా భారతదేశంలో తప్పక సందర్శించాల్సిన మథుర, బృందావనం, ద్వారక, గురువాయూర్ మరియు పూరీ జగన్నాథ ఆలయాల విశేషాలు మరియు ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను ఇక్కడ తెలుసుకోండి.
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 2026 అక్టోబర్ 12 నుండి 21 వరకు జరగనున్నాయి. గరుడ సేవ, రథోత్సవం, చక్రస్నానం మరియు వాహన సేవల సంపూర్ణ షెడ్యూల్ ఇక్కడ తెలుసుకోండి.
అయోధ్య శ్రీ రామ్ జన్మభూమి మందిర్ సీఈఓ ఎంపిక కోసం ప్రతిపాదించిన ముగ్గురి పేర్ల జాబితాను కమిటీ ఈరోజు ట్రస్ట్‌కు సమర్పించనుంది. తిరుమల తరహాలో ఆలయ నిర్వహణ కోసం తీసుకున్న ఈ కీలక నిర్ణయ వివరాలు ఇక్కడ చదవండి.
పాకిస్థాన్‌లోని నారోవాల్‌లో 125 ఏళ్ల నాటి చారిత్రక హిందూ దేవాలయాన్ని రాత్రికి రాత్రే కూల్చివేశారు. ఈ ఘోరంపై స్థానిక హిందూ సంఘాల ఆగ్రహం, ఆందోళనల వివరాలు ఇక్కడ చదవండి.
టీటీడీ వేదపారాయణదారుల ఎంపిక ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. తెలంగాణ అభ్యర్థులకు స్థానికత అడ్డంకిగా మారడం, అర్హత మార్కులను 85 నుండి 40కి తగ్గించడంపై వేదపండితులు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నియామకాల వెనుక ఉన్న పూర్తి వివరాలు, వివాద కారణాలు ఇక్కడ చూడండి.
2026 ఆగస్టు 29 రాశి ఫలాలు, టారో కార్డుల విశ్లేషణ మరియు వాస్తు చిట్కాలు ఇక్కడ తెలుసుకోండి. మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల ఉద్యోగం, ఆరోగ్యం, ఆర్థిక పరిస్థితి మరియు సరైన వాస్తు నివారణల సమగ్ర వివరాలు!
పశ్చిమ బెంగాల్ దుర్గాపూజ పండళ్ల లోపల మాంసాహారం నిషేధించాలని విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేసింది. 5 రోజుల ఉత్సవాల్లో సనాతన సంప్రదాయాలు పాటించాలని 600 పూజా కమిటీలకు వీహెచ్‌పీ చేసిన ప్రతిపాదనల వివరాలు.
రక్షాబంధన్ రోజున రాఖీ దారం తెగిపోవడం అశుభమా కాదా అనే సందేహాలకు వేద పండితుల సమాధానం తెలుసుకోండి. తెగిపోయిన రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు, పాటించాల్సిన నియమాలు మరియు 2026 రాఖీ శుభ ముహూర్తాల వివరాలు.
తిరుమలలో పౌర్ణమి మరియు గరుడ సేవ సందర్భంగా భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుండగా, ఒక్కరోజే 66,437 మంది దర్శించుకోగా రూ. 4.45 కోట్ల హుండీ ఆదాయం లభించింది.
తిరుపతి ఫారెస్ట్ డివిజన్ అధికారులు అత్యంత అరుదైన 3 రోజ్-రింగ్డ్ ప్యారాకీట్స్ (రామచిలుకలను) సమర్థవంతంగా రక్షించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వాటిని తిరిగి అడవిలోకి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలు చదవండి.
శ్రావణ పౌర్ణమి నాడు జరుపుకునే హయగ్రీవ జయంతి విశిష్టత, శ్రీమహావిష్ణువు హయగ్రీవ అవతారం ఎత్తడానికి గల ఆధ్యాత్మిక కథ మరియు విద్యార్థులకు జ్ఞానాన్ని ప్రసాదించే హయగ్రీవ పూజా విధానం గురించి వివరంగా తెలుసుకోండి.
చంద్ర గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక రక్షణ మరియు మానసిక ప్రశాంతత పొందేందుకు పాటించాల్సిన సూతక కాల నియమాలు, మంత్ర జపం, గర్భవతుల జాగ్రత్తలు మరియు గ్రహణానంతర శుద్ధి, దానాల విశిష్టతలను వివరంగా తెలుసుకోండి.
2026 రక్షాబంధన్ సందర్భంగా సోదరుడి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం మరియు దీర్ఘాయువు కోసం సోదరీమణులు చేయాల్సిన పవిత్ర దానాల విశిష్టతలను తెలుసుకోండి. ఆహార ధాన్యాలు, బెల్లం, వస్త్రాలు మరియు నల్ల నువ్వుల దానం వల్ల కలిగే ఆధ్యాత్మిక, జ్యోతిష్య ప్రయోజనాలు ఇవే!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.