మంగ్లీ, సుబ్బారావు ఫిర్యాదులపై కేసు నమోదు చేసాం : పంజాగుట్ట సీఐ

Publish Date:Apr 17, 2026

Advertisement

 

హైదరాబాద్ నగరంలో ఫోక్ సింగర్ మంగ్లీ వివాదం తీవ్ర సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే... అయితే ఈ ఘటనపై పంజాగుట్ట సీఐ వివరణ ఇచ్చారు. మైక్రో ఫైనాన్స్ పేరుతో మంగ్లీ పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసిందంటూ న్యాయవాది సుబ్బారావు మంగ్లీ మీద పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే అయితే వెనువెంటనే మంగ్లీ కూడా సుబ్బారావు మీద పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఇద్దరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పంజాగుట్ట సీఐ రామకృష్ణ తెలిపారు. 

అయితే ఈ చీటింగ్ కేసులో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనలో ప్రధానంగా బెదిరింపుల ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతున్నది. ఇదిలా ఉండగా న్యాయవాది సుబ్బారావు మద్యం సేవించి పోలీస్ స్టేషన్‌కు వచ్చినట్లుగా అనుమానం రావడంతో న్యాయవాది సుబ్బారావును పోలీసులు తనిఖీ చేశారని చెప్పారు... అంతేకాకుండా న్యాయవాది సుబ్బారావు అదే సమయంలో సరైన ఆధారాలు ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ ఎదుట న్యూసెన్స్ సృష్టించడం సృష్టించినందుకు కూడా అతనిపై కేసు నమోదు చేసినట్లుగా సీఐ వెల్లడించారు. 

ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో పూర్తిస్థాయిలో విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఇదిలా ఉండగా మరోవైపు మైక్రో ఫైనాన్స్ సంస్థ మోసాలు వెలుగులోకి రావడంతో సైబరాబాద్ పోలీసులు నిన్న రమావత్ మధును అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. మరోవైపు పంజాగుట్ట సీఐ తీరుపై న్యాయవాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడ్వకేట్ సుబ్బారావుకు బలవంతంగా బ్రీత్ అనలైజర్ పరీక్షలు నిర్వహించడాన్ని నిరసిస్తూ తెలంగాణ హైకోర్టు వద్ద న్యాయవాదులు నిరసన చేపట్టారు. బాధితుల పక్షాన ఉన్న లాయర్‌ను ఇలా చేయడం కరెక్ట్ కాదని తెలిపారు. సదరు సీఐతో పాటు సిబ్బందిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

By
en-us Political News

  
తెలంగాణ ప్రభుత్వం పరిపాలనా రంగంలో కీలక నిర్ణయాలు తీసుకుంది.
తెలంగాణ ప్రభుత్వం డిజిటల్ పాలనలో మరో కీలక ముందడుగు వేసింది.
కూకట్‌పల్లి పరిధిలో జరిగిన దాడి కేసులో మన్నే క్రిషాంక్ సహా 8మందికి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.
తెలంగాణ ఉద్యమ కాలంలో సంచలనంగా నిలిచిన మిలియన్ మార్చ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
హైదరాబాద్ మెట్రో రైలును ఈ ఏప్రిల్ నెలాఖరుకు తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడం ఖాయమైంది.
అజిత్ దోవల్ రియాద్ పర్యటన, అలాగే విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ యూఏఈ చర్చలు, పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి ఖతార్ పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఈ పర్యటనలన్నీ ఎనర్జీ-సెక్యూరిటీ ప్రణాళికలో భాగమేనని నిపుణులు చెబుతున్నారు.
హైదరాబాద్ బుక్ ఫెయిర్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఎస్. గోపాలరావు(90) గురువారం కన్నుమూశారు.
పశ్చిమ ఆసియాలో యుద్ధ ఉద్రిక్తతలు, హోర్ముజ్ జలసంధి మూసివేత, రెడ్ సీ, పర్షియన్ గల్ఫ్ ప్రాంతాల్లో నౌకారవాణాకు అంతరాలు.. ఇవన్నీ కలిసి గ్లోబల్ ఎనర్జీ మార్కెట్లను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇండియా.. తన చమురు, గ్యాస్ సరఫరా నిరంతరతను పరిరక్షించుకోవడానికి, అలాగే గల్ఫ్ ప్రాంతంలో ఉన్న ప్రవాస భారతీయుల భద్రతకు చర్యలు తీసుకుంటోంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ తన జోరును మరోసారి చాటిచెప్పింది.
బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ 2025 అవార్డును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు అందుకోనున్నారు.
అర్హత కలిగిన డేటా సెంటర్లు తమ ప్రాజెక్టు పరిధిలో సొంత విద్యుత్ నెట్‌వర్క్‌ను నిర్మించుకోవచ్చు. దీనివల్ల అవి నేరుగా విద్యుత్ ఉత్పాదక కేంద్రాల నుండి లేదా నర్జీ ఎక్స్ఛేంజీల నుండి విద్యుత్తును సేకరించుకోవచ్చు. సాధారణంగా డేటా సెంటర్లు నిరంతరం, నిరంతరాయంగా విద్యుత్ సరఫరాను కోరుకుంటాయి. ప్రస్తుత గ్రిడ్ వ్యవస్థలో ఎదురయ్యే సాంకేతిక ఇబ్బందులు ఈ భారీ కేంద్రాలకు ఆటంకం కలగకుండా చూడాలన్న ఉద్దేశంతోనే ఏపీ సర్కార్ డీడీఎల్ విధానాన్ని తీసుకువచ్చింది.
చట్టసభల్లో మహిళ రిజర్వేషన్ బిల్లుపై ఇండియా కూటమి వైఖరిని ప్రజలకు వివరించాలని పార్టీల నేతలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆరుగురు పోలీసు అధికారులకు పదోన్నతి కల్పిస్తే.. వారిలో ఒక్క సజ్జనార్ ప్రమోషన్ పట్ల మాత్రమే సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమౌతుండటం ప్రత్యేకత, ప్రాధాన్యత సంతరించుకుంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.