Publish Date:Mar 19, 2025
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఇక భవిష్యత్తు లేదనే సంగతి ఆ పార్టీలోని నాయకులు అందరికీ అర్థం అవుతోంది. భవిష్యత్ లేని పార్టీలో ఉండడం కంటే.. రాజకీయాలు మానుకోవడమే బెటర్ అని కొందరు రాజీనామా చేస్తున్నారు. వెళ్లిపోయిన వారు పార్టీ మీద నిందలు వేయడం.. వెళ్లిపోయిన వారు ద్రోహులని పార్టీ నింద వేయడం చాలా మామూలు సంగతి. వైసీపీ నుంచి వెళ్లిపోయిన వారందరి గురించి జగన్ కూడా ఇలాగే మాట్లాడుతూ వచ్చారు. అయితే ఇప్పుడు చిలకలూరిపేట నాయకుడు, ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసేసిన నేపథ్యంలో, ఆయనను నిందించడానికి గానీ, పార్టీకి ద్రోహం చేశాడని అనడానికి గానీ జగన్ కి నైతిక హక్కు లేదని.. పార్టీ కార్యకర్తల్లోనే చర్చ జరుగుతోంది.
వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విధేయుడిగా ఉంటూ.. ఆయన వెంట నడిచినందుకు.. ఆయన వంచనకు గురైన వారిలో మర్రి రాజశేఖర్ ముందు వరుసలో ఉంటారు. ఆయనకు జగన్ చేసిన అన్యాయానికి ఆయన ఇన్నాళ్లూ పార్టీని అంటిపెట్టుకుని ఉండడమే చాలా పెద్ద విషయం అని ఆ పార్టీలో ఉన్న వారే వ్యాఖ్యానిస్తున్నారు.
వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్ ను అంటిపెట్టుకుని ఉన్న మర్రి రాజశేఖర్ కు.. 2014 ఎన్నికల్లో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి జగన్ టికెట్ ఇచ్చారు. ఆయన ఓడిపోయారు. అప్పటినుంచి పార్టీ కోసం పనిచేస్తున్నప్పటికీ.. 2019 ఎన్నికల్లో మర్రికి టికెట్ నిరాకరించారు జగన్! అప్పుడే పార్టీలో చేరిన విడదల రజనికి జగన్ టికెట్ ఇచ్చారు. ఆ ఎన్నికల ప్రచార సమయంలో మాత్రం.. మర్రి అభిమానులను ప్రలోభ పెట్టే మాటలు చెప్పారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత.. మర్రి రాజశేఖర్ ను ఎమ్మెల్సీని చేసి, మంత్రిగా చేస్తానని బహిరంగ సభల్లోనే ప్రకటించారు. ఆయనకూడా విడదల రజని విజయం కోసం కష్టపడి పనిచేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత.. పదవి రజనికి దక్కింది తప్ప మర్రి రాజశేఖర్ ఊసు వినపడలేదు. ఎమ్మెల్సీగా మాత్రం చేశారు.
మధ్యలో మంత్రివర్గాన్ని పునర్ వ్యవస్థీకరించినప్పుడు.. మర్రికి పదవి గ్యారంటీ అని పార్టీలో అంతా అనుకున్నారు. కానీ.. అప్పుడు కూడా జగన్ మాట నిలబెట్టుకోలేదు. రాజశేఖర్ ఎంత సహనంతో ఉన్నప్పటికీ.. 2024 ఎన్నికల సమయానికి సర్వేల్లో విడదల రజనికి ప్రతికూల వాతావరణం ఉన్నట్టు తేలడంతో ఆమెను నియోజకవర్గం మార్చి గుంటూరు వెస్ట్ నుంచి పోటీచేయించారు. అప్పుడు మర్రి రాజశేఖర్ టికెట్ ఆశించినా ఇవ్వలేదు. చివరికి ఆ ఎన్నికల్లో పరాజయం తర్వాత.. మళ్లీ విడదల రజినిని వెనక్కు తీసుకువచ్చి పార్టీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించారు. ఇవన్నీ ఆయనకు మనస్తాపం కలిగించాయి. చాలా కాలంగా ఆయన పార్టీని వీడదలచుకున్నట్టుగా ప్రచారం జరిగింది. వైవీ సుబ్బారెడ్డి, అయోధ్య రామిరెడ్డి లాంటి వాళ్లు ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నించారు. బుధవారం మండలి ఛైర్మన్ కు రాజీనామా సమర్పించే ముందు బొత్స సత్యనారాయణ, ఇతర ఎమ్మెల్సీలు కొందరు కూడా రాజీనామా ఆలోచన మానుకోవాలని సూచించారు. అయితే మర్రి వారి మాటలను ఖాతరు చేయలేదు. ఏ రకంగా చూసినా సరే.. మర్రికి జగన్ చేసిన అన్యాయాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి గనుక.. ఆయన నిష్క్రమణ.. రాజీనామా గురించి నింద వేయగల నైతిక హక్కు జగన్ కు లేదని.. పార్టీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-has-no-moral-right-to-blame-marri-rajasekhar-39-194689.html
2024 అసెంబ్లీ ఎన్నికలలో ఆముదాలవలస నియోజకవర్గం నుంచి ఓటమి పాలైనప్పటి నుంచీ తమ్మినేని రాజకీయంగా ఒకింత ఇన్ యాక్టివ్ గానే ఉంటూ వస్తున్నారు. వైసీపీ అధినేత జగన్ కూడా తమ్మినేనిని ఆముదాలవలస నియోజకవర్గ బాధ్యతల నుంచి తప్పించి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలక బాధ్యతలను అప్పగించారు. ఈ నిర్ణయం తమ్మినేనిలో తీవ్ర అసంతృప్తికి కారణమైందని ఆయన అనుచరులు చెబుతున్నారు.
వైఎస్ జగన్ ఆదేశిస్తే ఏమైనా చేస్తానంటూ సంచలన ప్రకటనలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచారు. అలాగే బోరుగడ్డ అనిల్ తన నోటి దురుసు, అనుచిత వ్యాఖ్యల కారణంగా తొమ్మిది నెలలపాటు జైలు జీవితం కూడా గడపాల్సి వచ్చింది.
తంజావూరు వేదికగా కావేరీ జలాల వివాదంపై మాట్లాడుతున్న సమయంలో ఉదయనిధి స్టాలిన్ సీఎం విజయ్, నటి త్రిషను ఉద్దేశించి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. తమ అధినేత విజయ్‌ను అవమానించారంటూ టీవీకే శ్రేణులు తంజావూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడమే కాకుండా, జాతీయ మహిళా కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందిన వెంటనే చెన్నైలోని ఉదయనిధి నివాసానికి వెళ్లిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు.
రాష్ట్రం వెనుకబాటుతనం నుంచి బయటపడాలంటే.. క్షేత్రస్థాయిలో ఉద్యోగాల కల్పనకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. దశాబ్దాలుగా బీహార్ యువత ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి నెలకొందనీ, ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం సంక్షేమ పథకాలు, రాజకీయ పొత్తులతో కాలక్షేపం చేస్తే రాష్ట్ర భవిష్యత్ అంధకారం అవుతుందన్నారు.
రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లు, నిధుల కొరత నడుమ ఈ బడ్జెట్‌ను రూపకల్పన చేయడం ప్రభుత్వానికి సవాలుగా మారింది. ఒకవైపు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, మరొకవైపు అభివృద్ధి లక్ష్యాలను సమర్థవంతంగా సాధించడం మధ్య సమతుల్యత పాటించాల్సి ఉంది. పరిమితమైన ఆర్థిక వనరులను దృష్టిలో ఉంచుకుని, ఏ రంగాలకు ఎంత మేరకు నిధుల కేటాయింపులు చేయనున్నారనేది రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
దేశంలో ఇటీవల వెలువడిన ఉప ఎన్నికల ఫలితాలు భారత రాజకీయ యవనికపై కొత్త సమీకరణాలకు నాంది పలుకుతున్నాయి.
వైసీపీలో నెలకొన్న నిస్తేజాన్నీ, నిరుత్సాహాన్నీ ఆసరాగా చేసుకుని, ఆ పార్టీకి పట్టు ఉన్న ప్రాంతాలలో కూడా తెలుగుదేశం కూటమి పాగా వేస్తోంది. ప్రధానంగా వైసీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో వైసీపీ బలాన్ని ఛేదిస్తూ, అభివృద్ధి మంత్రంతో క్షేత్రస్థాయిలో బలం పెంచుకుంటోంది.
తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఇకపై టీ-ఫైబర్ ద్వారానే ఇంటర్నెట్ సేవలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ ఫలితాలు మోదీ బ్రాండ్ ను మసకబార్చాయి. మోడీ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకతకు నిదర్శనంగా నిలిచాయి. ఈ ఫలితాలు కేవలం ఉప ఎన్నికలో తగిలిన ఎదురుదెబ్బగా కంటే బీజేపీపై ప్రజా వ్యతిరేకత పెచ్చరిల్లుతుందన్న భావననే ఎక్కువగా ఆవిష్కరించాయి.
అమెరికాలోని బోస్టన్ విశ్వవిద్యాలయంలో అభిజీత్ విద్య ఎలా అభ్యసించాడనే అంశంపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ సూరత్‌కు చెందిన ఆర్‌టీఐ కార్యకర్త అమిత్ తివారీ కేంద్ర ఎన్నికల సంఘం, పన్నుల శాఖతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. అలాగే.. సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సమకూర్చిన 1 కోటి రూపాయ నిధులపై అనుమానాలు వ్యక్తం చేశారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా, కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇటువంటి అసత్య, అవమానకర, ద్వంద్వార్థ వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ పోలీసులు కేసు నమోదు చేశారు. సామాజిక మాధ్యమాల్లో సైతం ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా సినిమా, రాజకీయ రంగాల నుంచి ఉదయనిధి శైలిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
నీళ్లు ఎక్కడికి చేరినా చేరకపోయినా.. అక్కడికి మాత్రం తప్పకుండా చేరాలంటూ వ్యాఖ్యానించారు. ఆ వెంటనే తాను మాట్లాడింది కావేరీ జలాల గురించేనని చెప్పినా, ఉదయనిథి స్టాలిన్ వ్యాఖ్యలు నటి త్రిషను ఉద్దేశించి చేసినవేనంటూ విమర్శలు వెల్లువెత్తాయి.
పీకే తన సమీప ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి నీరజ్ కుమార్ సిన్హాపై 20 వేలకుపైగా ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుంచి 1995 నుంచీ వరుసగా బీజేపీయే విజయం సాధిస్తూ వస్తోంది. నవీన్ కిషోర్ ప్రసాద్ సిన్హా వరుసగా నాలుగు సార్లు విజయం సాధించగా, ఆ తరువాత ఇదే నియోజకవర్గం నుంచి ఆయన కుమారుడు, ప్రస్తుతం బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ వరుసగా విజయం సాధిస్తూ వచ్చారు.