దినదిన ప్రవర్ధమానంగా దిగజారుతున్న జగన్ గ్రాఫ్

Publish Date:Sep 22, 2022

Advertisement

రాజకీయాలు మారిపోయాయి. రంగు రుచి వాసన మార్చుకున్నాయి. ఇపుడు సర్వం సర్వేలే, అన్న విధంగా అన్ని పార్టీలు, సర్వేల  మీదనే  ఆధార పడుతున్నాయి. సర్వే ఏది చెపితే అదే వేదం. అదే మంత్రం అన్నట్లుగా రాజకీయ పార్టీలు, నాయకులు వ్యవహరిస్తున్నారు. ఒక విధంగా కళ్ళకు గంతలు కట్టుకుని, ముందుకు సాగుతున్నాయి, సాగుతున్నారు.  ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అయితే సర్వేలే సర్వస్వంగా రాజకీయ ‘వ్యూహ’ రచన చేస్తున్నారు. ఎన్నికలకు ఎప్పుడు వెళ్ళాలి, ఎవరికి టికెట్ ఇవ్వాలి మొదలు ప్రభుత్వం వేసే ప్రతి అడుగుకూ సర్వేలే  ఆధారం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.   

అయితే, ఇప్పడు ఏపీలో ఆ సర్వేలే అధికార వైసేపీలో చిచ్చు తెచ్చాయని, అంటున్నారు.  సర్వేకి అటు సర్వేకి ఇటు అన్నట్లుగా పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రికి పార్టీకి ,పార్టీకి ప్రజాప్రతినిదులకు,ప్రజా ప్రతినిధులకు, పార్టీ క్యాడర్ కు మధ్య సర్వేలు అడ్డు గోడలు కడుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా నియోజక వర్గాల స్థాయిలో సర్వేలు సమస్యలు సృష్టిస్తున్నాయని అంటున్నారు. 

రాష్ట్రంలో వైసీపీ ‘సుందర’ పాలన మొదలై మూడేళ్ళు నిండిన సందర్బంగా, గడప గడపకు ప్రభుత్వం పేరిట అన్ని గ్రామాలకు వెళ్లి ప్రతి ఇంటి తలుపు తట్టాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలను ఆదేశించారు. అయితే, ప్రజలలోకి వెళ్ళే దైర్యం లేకనో ఏమో, చాలా వరకు ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి ఆదేశాలను పక్కన పెట్టేశారు. అంత సీరియస్ గా తీసుకోలేదు. అయితే, అదే గెలుపు మంత్రంగా  తీసుకున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, గడపగడపకు కార్యక్రమంపై కూడా సర్వే. కాదు ఏకంగా మూడు సర్వేలు చేయించి నివేదికలు తెప్పించుకున్నారు. ఇప్పుడా సర్వే నివేదికలు ముందు పెట్టుకుని  ముఖ్యమంత్రి తన దగ్గర రెండు సర్వేలు ఉన్నాయని, ఎవరి పర్‌ఫామెన్స్‌ ఏంటో ఈ నివేదికల్లో ఉందని, ఎమ్మెల్యేలకు హెచ్చరికలు చేస్తునట్లు తెలుస్తోంది. నిజానికి సర్వే నివేదికల్లో ఏముందో ఏమో, కానీ, కొంతమంది ఎమ్మెల్యేలను, నియోజక వర్గంలో అప్పుడే మాజీలుగా చూస్తున్నారని  అంటున్నారు.  

ముఖ్యమంత్రి జగన్‌ రెడ్డి దగ్గర ఉన్నాయని చెపుతున్న మూడు సర్వే రిపోర్టులో ఒకటి, ఐప్యాక్‌ (పీకే) బృందం ఇచ్చింది. మరొకటి క్రాస్‌ చెక్‌ చేసుకునేందుకు మరో ఏజెన్సీ ద్వారా చేయించారు. అలాగే మరో సర్వే  సర్కార్ వారి నిఘా వర్గాలు నిర్వహించిన సీక్రెట్ సర్వే.  అయితే, చిత్రంగా, సర్వేలు, సర్వే చేసిన సంస్థలు వేరైనా సత్యం ఒకటే, అన్నట్లుగా, అన్నీ కూడా జగన్  ప్రభుత్వ గ్రాఫ్ దినదిన ప్రవర్థమానంగా దిగజారిపోతోందన్న ఒకే ఒక నిజాన్ని బయట పెట్టాయి. 

“అయ్యా .. ముఖ్యమంత్రిగారు. ప్రభుత్వ గ్రాఫ్ రోజు రోజుకు దిగజారుతోంది. ఎమ్మెల్యేల గ్రాఫ్ మాత్రమే కాదు. మీ  గ్రాఫ్ కూడా పతనం వైపు పరుగులు తీస్తోంది.. తస్మాత్ జాగ్రత్త” అని అన్ని సర్వేలూ ఒకే ఒక్క వాస్తవాన్ని వెల్లడించాయని పార్టీ శ్రేణులే అంటున్నాయి. అలాగే, ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా, అన్ని వర్గాలలోనూ  ప్రభుత్వ వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతోందనీ,   గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వైసీపీ నాయకులు, కార్యకర్తలు అందరిలోనూ ఏ అసంతృప్తి రగులుతోందని,  మూడు సర్వేలన్నీ తేల్చి చెప్పాయని అంటున్నాయి. ఇసుక, మద్యం, అధ్వాన రహదారులు, కాంట్రాక్టర్‌లకు బిల్లులు ఇవ్వకపోవడంతో కిందిస్థాయి వరకూ వ్యతిరేకత ఉందని సర్వేలు వెల్లడించాయి.

ఎమ్మెల్యేల పని తీరుపైనా సర్వేలన్నీ ఒకే రకంగా ఉన్నాయి. దాదాపుగా 60 శాతం మంది ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం ఆశాజనకంగా లేదని, సంక్షేమ కార్యక్రమాల అమల్లో వారి పాత్ర లేకపోవడం, అభివృద్ది కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోవడం కూడా వైసీపీకి మైనస్‌గా మారిందని  చెప్పాయి.  ఎమ్మెల్యేలే కాదు మంత్రుల పనితీరు విషయంలోనూ ప్రజాలు పెదవి విరుస్తున్నారు.  అయినా, ఏకంగా ముఖ్యమంత్రి పనితీరే బాగాలేదని, మీటలు నొక్కడమే పరిపాలన అనుకుంటే ఎలా అని ప్రజలు నేరుగా ప్రశ్నిస్తున్నప్పుడు, ఒకరి తీరు బాగుంది, ఒకరి తీరు బాగాలేదని  అనుకోవడం ఎందుకు, యథా జగన్ తథా పార్టీ.

By
en-us Political News

  
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
బినెట్ నుంచి ఉద్వాసనకు గురైన కొండా సురేఖకు కేబినెట్ హోదాతో కీలక పదవిని అప్పగించే అవకాశాలున్నాయన్న ప్రచారం జరుగుతోంది.  ఈ విషయమై కొండా సురేఖకు పార్టీ హైకమాండ్ నుంచి స్పష్టమైన హామీ లభించినట్లు చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.