ఉద్యోగులకు ప్రజలకు మధ్య పీఆర్సీ చిచ్చు..ఇదేనా జగన్నాటకం ?

Publish Date:Dec 14, 2021

Advertisement

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కంటే, ప్రభుత్వ ఉద్యోగులజీత భత్యాలు. పెన్షన్ల  వ్యయం ఎక్కువగా ఉందంటే, ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. కానీ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, తాను నమ్మడమే కాదు మనందరినీ నమ్మ మంటున్నారు. నిజానికి పీఆర్సీ పేరిట సాగుతున్న ప్రహసనంలో ఇలాంటి చిత్ర విచిత్రాలు చాలానే వినిపిస్తున్నాయి.అయితే,ఇది వ్యూహాత్మకంగా పేల్చిన బాంబుగానే చూడ వలసి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. 

రాష్ట్ర  ప్రభుత్వం సొంత ఆదాయంలో 111 శాతం, అంటే ఆదాయం కంటే, 11 శాతం అధికంగా, ప్రభుత్వ ఉద్యోగుల్ జీతాలు. పెన్షన్లకే పోతోందని, చీఫ్ సెక్రటరీ ప్రకటించడాన్ని రాజకీయ పార్టీలు తప్పు పడుతున్నాయి.  ఇటు ప్రభుత్వ ఉద్యోగులను, అటు ప్రజలను తప్పు దోవ పట్టించేందుకే చీఫ్ సెక్రటరీ తప్పుడు సమాచారాన్ని, ప్రజల ముందు ఉంచారని జనసేన ఆరోపించింది. నిజంగా,రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయం కంటే, జీతాలు, పెన్షన్లు ఎక్కువగా ఉంటే, ఆ విషయాన్ని బడ్జెట్’లో ఎందుకు ప్రస్తావించలేదని, జన సేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్, నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులకు  సామాన్య ప్రజలకు మధ్య చిచ్చు పెట్టి ఉద్యోగుల గొంతు నొక్కేందుకు చీఫ్ సెక్రటరీ ద్వారా, ఒక అసత్యాని ప్రచారం చేస్తోందని మనోహర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నిజమే, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సమాన్య ప్రజల్లో ఒక విధమైన ఏహ్య భావం, వ్యతిరేకత ఉన్న మాట నిజం. అది లంచాల కోసం ప్రజలను వేదిపులకు గురి చేసిన ప్రభుత్వ ఉద్యోగుల స్వయం కృతం కావచ్చును, లేక ఇతర కరణాలు ఏవైనా ఉన్నా, ఉద్యోగుల పట్ల ప్రజల్లో సద్భావన లేదు.అయితే  జగన్ రెడ్డి ప్రభుత్వం దాన్ని ఈ విధంగా ఉపయోగించుకోవడం మాత్రం సరి కాదు. 

ప్రభుత్వ ఉద్యోగుల నెల జీతాలు,పెన్షన్లకు నెలకు రూ.4600 కోట్లు మాత్రమే ఖర్చవుతాయని, ఉద్యోగ సంఘాలు పదే పదే చెపుతున్నా, ప్రభుత్వం ఇంతవరకు ఎందుకు మౌనంగా ఉంది? ఇప్పుడు ఎందుకు, రూ. 67,000 కోట్లు ఖర్చవుతోందని ఏ లెక్కన చెపుతున్నారని, మనోహర్ ప్రశ్నించారు. ఆలాగే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది తప్ప ఇతర నియమకాలు ఏమీ జరగలేదు. గ్రామ వాలంటీర్లు, గ్రామ సచివాలయ సిబ్బంది జీతాలు కేంద్ర నిధుల నుంచే ఇస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క డీఎస్సీ లేదు గ్రూప్ 1,2,3,4 నియామకాలు జరగలేదు. అలాంతప్పుడు, అదనపు భారం ఎక్కడ నుంచి పడుతుందని, జనసేన ప్రశ్నించింది. 

అయితే, ఈ లెక్కలు పద్దులు ఎలా ఉన్నా, రాష్ట్ర ప్రభుత్వం వ్యూహత్మకంగానే పీఆర్సీ ప్రహసనం నడిపిస్తోందని, ప్రజల్లో సహజంగా ప్రభుత్వ ఉద్యోగుల పట్ల ఉండే వ్యతిరేకతను మరింతగా పెంచి, ఉద్యోగుల నోరు  మూయించడమే కాకుండా, రాజకీయంగాను ప్రయోజనం పొందే విధంగా ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య గోప్యంగా జరిగిపోయే పీఆర్సీ తంతును నెలల తరబడి సాగించి ప్రజల్లో ఉద్యోగుల పట్ల వ్యతిరేకతను పెంచేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది, అందుకే ఉద్యోగులకు ఇస్తున్న జీతాలే ఎక్కువని, పీఆర్సీఇప్పుడు ఒకే చేసినా వచ్చే సంవత్సరం చివరిలో ఎప్పుడో అమలు చేస్తామని చెప్పడం, ఆ విధంగా ఉద్యోగులను రెచ్చగొట్టి, జనం ముందు వారిని పాపాల భైరవులుగా చిత్రించే ప్రయత్నం చేస్తోందని, పరిశీలకులు భావిస్తున్నారు.
 

By
en-us Political News

  
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.