అప్పుల వేటలో ఏపీ సర్కార్.. జనాలకు గండమేనా? 

Publish Date:Oct 8, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు తీసి ... మరో అడుగు వేసిందంటే  .. అది ఖచ్చితంగా ఒక అప్పులోంచి మరో అప్పులోకే, అందులో ఎవరికీ ఎలాంటి సందేహం అక్కరలేదు. రెండున్నర సంవత్సరాలుగా  వైసీపీ ప్రభుత్వం చేస్తున్నది అదే. కాబట్టి సందేహించవలసిన అవసరమే లేదు.అందుకే,ఏపీ అంటే, ఆర్థిక, రాజకీయ పరిభాషలో అప్పుకు పర్యాయపదంగా ముద్ర పడిపోయింది. ఓ వంక ముఖ్యమంత్రి, అయన ఆదేశాలతో మంత్రులు, కొత్త అప్పుల కోసం అధికారుల వెంట పడుతుంటే, అధికారులు పాత అప్పుల లెక్కల్లో తలమునకలై ,బ్యాకుల నుంచి వస్తున్న ఓవర్ డ్యూ,నిరర్ధక అస్తుల తాకీదులకు సమాధానాలు చెప్పుకోలేక, తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్ర ఆర్థిక శాఖలో, ఇప్పుడు ఇదే విషయంపై చర్చోప చర్చలు సాగుతున్నాయి. 

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి, ఆర్థిక కార్యకలాపాలను, రెండే రెండు విషయాలకు పరిమితం చేసిందనే అభియోగాన్ని మోస్తూనే ఉంది.అందులో,ఒకటి ఓటర్లకు క్రమం తప్పకుండా మేత వేయడం. సంక్షేమ పథకాల లబ్దిదారుల ఖాతాలోకి నగదు బదిలీ చేయడం.ఇక రెండవది, అందుకోసం, అందిన కాడికి అప్పులు చేయడం.బ్యాకులు, నాబార్డ్ వంటి కేంద్ర సంస్థలు,వివిధ పథకాల పేరున విదేశీ బ్యాంకులు..విదేశీ ఆర్థిక సహకార సంస్థలు  ఇవీ అవీ అని కాదు, అప్పు ఎక్కడ పుడుతుందంటే అక్కడికల్లా పరుగులు తీసి,రెక్కలు కట్టుకుని వాలిపోవడం,చేతులు చాచడం, ఏపీ ప్రభుత్వానికి అలవాటుగా మారి పోయిందనే మాట, సర్వత్రా వినిపిపిస్తోంది. 

ఇలా చేసిన అప్పులకు నిర్దిష్ట గడువులో వాయిదాలు, వడ్డీ చెల్లించాలి,లేదంటే పరవు పోవడమే కాదు, ఇక అప్పులు పుట్టే మార్గమే లేకుండా పోతుంది.అయినా, ఏపీ ప్రభుత్వ ఖజానా నిండుకోవడంతో ఈ వాయిదాలను సకాలంలో చెల్లించలేకపోతున్నారు. దీంతో కొన్ని వాయిదాలు ఓవర్‌ డ్యూ అవుతున్నాయి. ఇంతవరకు అయితే రాష్ట్ర ఆర్థిక పతనం ఓవర్‌ డ్యూ వద్దనే ఉంది. ఈ గీత /గడువు కూడా దాటిపోతే అవి ఎన్‌పిఎలుగా మారిపోవడానికి చివరి అంచున ఉంటున్నాయి.అంటే, ఇవే  విధానాలు కొనసాగితే, పరిస్థితి విషమిస్తుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
ఒక  విధంగా చూస్తే, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎప్పుడైనా, బద్దలయ్యే బెలూన్’ లా అప్పులతో నిండి ఉందని ఆర్థిక శాఖ అధికారులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు.ఇక్కడ తెచ్చిన అప్పులు అక్కడ, అక్కడ తెచ్చిన అప్పులు ఇక్కడా సర్డుబాటు చేసి బండిని నెట్టు కొస్తున్నామని అధికారాలు వాపోతున్నారు.అలా సర్దుబాటు కుదరని పక్షంలో, ఒక సంస్థ  ఎన్‌పిఏలోకి చేరితే ఆ సంస్థకు ఆ బ్యాంకు నుంచి మళ్లీ రుణం పుట్టే అవకాశాలు ఉండవు. 

అయితే అనేక సందర్భాల్లో కొన్ని రాష్ట్రాలు ఎన్‌పిఏలోకి చేరిన సంస్థను పక్కనపెట్టి, కొత్తగా ఏర్పాటుచేసిన సంస్థల ద్వారా రుణాలు తీసుకుంటున్న వైనం కనిపిస్తోంది. ఏపీలో ఇప్పటివరకు ఓవర్‌డ్యూలే తప్ప ఎన్‌పిఏ జాబితాలోకి వెళ్లడం జరగలేదు. అయితే దానికి అతి దగ్గరగా మాత్రం అనేక సంస్థలు ఉన్నాయి. ఒక వేళ ఎన్‌పిఏలోకి చేరితే కొత్తగా ఏర్పాటుచేసిన అనేక సంస్థలు ఉన్నాయని, వాటి ద్వారా రుణాలు తీసుకుంటామని ఆర్ధికశాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించడం గమనార్హం.అదలా ఉంటే, ప్రభుత్వం ఆర్టీసీ, రోడ్లు భవనాలు ఇలా వివిధ ప్రభుత్వ శాఖల ఆస్తులను కుదువ పెట్టి అందినకాడికి అప్పులు చేస్తూనే ఉంది. ఈ నేపద్యంలో, వైసీపే ప్రభుత్వం పదవీకాలం ముగిసే నాటికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ స్థితికి దిగజారుతుంది అంటే ... జవాబు భయంకరంగా ఉంటుందని అంటున్నారు.

అదలా ఉంటే ఇప్పుడు ఏపీ ప్రభుత్వం రోజుకో అప్పు పత్రాన్ని బయటకు తీస్తోంది. తాజాగా, రాష్ట్రంలో కొత్తగా వైద్య కలశాల నిర్మాణం, పాత కళాశాలల అభివృద్ధి పేరిట, రూ.9వేల కోట్ల అప్పుకోసం గట్టి ప్రయత్నాలు చేస్తోంది. ఐదు బ్యాంకుల కన్సార్టియం ఏపీ ప్రభుత్వాన్ని నమ్మి అప్పు ఇవ్వడమా, ఇవ్వక పోవడమా అనే విషయంలో ఆలోచనలు చేస్తున్నాయి.రాష్ట్రంలో కొత్తగా 16 వైద్య కళాశాలలు నిర్మించడంతో పాటుగా పాత కళాశాలల అభివృద్ధికి మొత్తం రూ.16వేల కోట్లు అవసరమని ఏడాది  క్రితమే అధికారులు లెక్కలు సిద్దంచేశారు. అప్పటినుంచి అధికారులు బ్యాకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నా, పని కాలేదు. ఇప్పుడు  చిట్టచివరకు ఐదు బ్యాంకులు కన్సార్టియంగా ఏర్పడి సానుకూలంగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, అందుకు ప్రధాన కారణం రాష్ట్రంలో ఆర్థిక క్రమశిక్షణ లోపించడం ఒక  ప్రధాన కారణంగా అయితే, వైసీపీ ప్రభుత్వం విస్వనీయత మీద అనుమానాలు బలపడడం మరో కారణంగా ఆర్థిక రంగ నిపుణులు అంటున్నారు. అడుగు తీసి అడుగువేయాలంటే అప్పే ఆధారం కావడం ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతోందని, రాష్ట్ర ఆర్థిక ఆరోగ్యం అనారోగ్యంతో కునారిల్లుతొందనేందుకు కూడా ఇది నిదర్శనమని అంటున్నారు.

By
en-us Political News

  
సాధారణంగా   నాయకులు, తాము ప్రజలకు చేయగల పనుల విషయంలో వాస్తవికత వదిలేసి అతిశయోక్తులతో, అతి అంచనాలతో గొప్పలు చెప్పుకుంటుంటారు.
మొత్తం 28 జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష స్థానాలకు జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి 27 చోట్ల విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.  
అదానీతో సంబంధాలపై   రేవంత్ రెడ్డి స్పష్టత ఇచ్చారు. తెలంగాణలో అదానీ పెట్టుబడుల ద్వారా స్థానిక ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని, ప్రజాధనాన్ని దోచి అదానీకి కట్టబెట్టే విధానం తమది కాదని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీకి బలమైన ఉనికి లేదని, ఇటీవలి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీజేపీ డిపాజిట్ కూడా కోల్పోవడమే ఇందుకు నిదర్శనమన్నారు.
పోలీసుల హెచ్చరికలు, ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఆయన భారీ కాన్వాయ్‌తో అక్కడికి రావడంపై స్థానిక ప్రజలు, తెలుగుదేశం వర్గీయులు  ఆగ్రహం వ్యక్తం చేశారు.  ఎంపీ కాన్వాయ్ ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా  అంకాలమ్మ గూడూరులో ఘర్షణ వాతావరణం నెలకొంది. 
ఇదే వేదికపై నుంచి   544.11 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసిన రేవంత్ రెడ్డి,  ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని కూడా   ప్రారంభించారు.
కొలంబియా యూనివర్సిటీ వేదికగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ, ప్రస్తుతం  దేశ ఆర్థిక వ్యవస్థ   పతనావస్థలో ఉందని రాహుల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో నిరుద్యోగ సమస్య విపరీతంగా పెరిగిపోయిందని, యువతకు ఉపాధి అవకాశాలు కరవయ్యాయని ఆయన ఆరోపించారు.
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.