టీడీపీ దెబ్బకు దిగొచ్చిన జగన్! ఓటీఎస్ పై వెనకడుగు.. కానీ ..

Publish Date:Dec 8, 2021

Advertisement

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి మరో మారు దిగి వచ్చారు. ప్రజాగ్రహానికి తల వంచారు.ప్రతిపక్ష తెలుగు దేశం పార్టీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా, వెల్లువెత్తిన నిరసనలు, జనాగ్రహానికి  ‘జగనన్న’ దిగి వచ్చారు. జగనన్న సంపూర్ణ గృహ హక్కు పధకమని ఓ ముద్దు పేరు తగిలించి, ఎప్పుడో ఏనాడో ఆ నాటి ప్రభుత్వాలు పేద ప్రజలకు వివిధ పథకాల ద్వారా  ఇచ్చిన ఇళ్ళకు, ఇప్పుడు  రూ. 10 వేల  నుంచి రూ.20 వేల వరకు  వన్ టైమ్ సెటిల్మెంట్ (ఓటీపీ) చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోమని, లేదంటి రేషన్ సహా సంక్షేమ ఫలాలు అందవని మెడ మీద కత్తి పెట్టి, దుర్మార్గపు వసూళ్ళకు దిగిన జగన్ ప్రభుత్వం, చివరకు దిగి వచ్చింది. 

ఇంతవరకు గ్రామ వాలంటీర్ల  గ్రామ సచివాలయ సిబ్బంది, ఇతర ప్రభుత్వ అధికారులకు టార్గెట్లు పెట్టిన ప్రభుత్వం ఇప్పుడు మెట్టు దిగింది. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి,స్వరం మార్చి, ‘”అబ్బే బలవంతం ఏమీలేదు, ఓటీఎస్ వినియోగించుకోవాలా? వద్దా? అనేది ప్రజల ఇష్టమే” అని  చెప్పు కొచ్చారు. ముఖ్యమంత్రి ఈరోజు (బుధవారం)ఓటీఎస్‌ పథకం, గృహనిర్మాణంపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ పథకం గురించి ప్రజలకు పూర్తిస్థాయిలో వివరించి, అర్థం చేయించాలన్న ముఖ్యమంత్రి.. ఈ పథకం పూర్తిగా స్వచ్ఛందమేనని చెప్పారు. ప్రజలు ఈ పథకాన్ని వద్దనుకుంటే అవసరం లేదని చెప్పారు. 

మూడు రాజధానుల విషయంలో ఎలాగైతే చింత చచ్చినా పులుపు చావలేదు అన్నట్లుగా వ్యవహరించారో అదే విధంగా ఓటీపీ విషయంలోనూ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  ఈ పథకం ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయని చెప్పారు. ఓటీఎస్ ద్వారా పట్టా పొందితే.. ఆ ఇంటిని అవసరాలకు తనఖా పెట్టుకోవచ్చని, కావాలంటే అమ్ముకునే హక్కు కూడా ఉంటుందని ముఖ్యమంత్రి  చెప్పారు. క్లియర్‌ టైటిల్‌తో రిజిస్ట్రేషన్‌ జరుగుతుందని వెల్లడించారు. ఓటీఎస్‌ పథకం ద్వారా అన్నిరకాల సంపూర్ణహక్కులూ ఇంటి యజమానులకు లభిస్తాయని తెలిపారు. పేదలకు మంచి అవకాశాన్ని కల్పిస్తున్నామన్న జగన్‌.. ఆ అవకాశాలను వాడుకోవాలా? లేదా? అన్నది ప్రజల ఇష్టమేనని చెప్పారు. ఈ పథకం ద్వారా.. రూ.10 వేల కోట్ల భారాన్ని పేదలపై తొలగిస్తున్నామని చెప్పారు.

అయితే రూ.10 వేల కోట్ల భారాన్ని తగ్గించి ఓటీపీ పేరున ఏకంగా రూ.60 వేల కోట్ల భారం మోతుతున్న విషయాన్ని మాత్రం చెప్పలేదు సీఎం జగన్ రెడ్డి. ఏది ఏమైనా జనాగ్రహానికి తలొగ్గి ముఖ్యమంత్రి మరోమారు మడమ తిప్పారు. అయితే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం ట్రాక్ రికార్డును గమనిస్తే, ఇది వ్యూహాత్మకంగా వేసిన వెనకడుగే తప్ప, మనసు మారి తీసుకున్న మంచి నిర్ణయం కాదని పరిశీలకులు అంటున్నారు. తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతానికి వెనక్కి తగ్గినట్లే తగ్గి, మరో దొంగ దెబ్బ తీసినా ఆశ్చర్య పోనవసరం లేదని కూడా అంటున్నారు.

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.