రైతు భరోసాకూ శఠగోపమేనా? మాటా, మడమ తిప్పేస్తున్న జగన్!

Publish Date:May 4, 2022

Advertisement

ఏపీ సీఎం జగన్ ఆర్భాటంగా ప్రకటించి ప్రారంభించిన ఒక్కో పథకానికీ మెల్లిమెల్లిగా చెల్లుచీటీ ఇచ్చేస్తున్నారా? అమ్మ ఒడి పథకానికి కండీషన్స్ తో దాదాపు చరమగీతం పాడేసిన జగన్ ఇప్పుడు రైతు భరోసాకూ శఠగోపం పెట్టేయనున్నారా? వైసీపీ గొప్పగా చెప్పుకుంటున్న పథకాలలో రైతు భరోసా ఒకటి. ఏటా రైతు ఖాతాలో పన్నెండున్నర వేలు జమ చేయడానికి ఉద్దేశించిన ఈ పథకానికి ఈ ఏడాది మంగళం పాడేశారంటున్నారు పరిశీలకులు. ప్రతి ఏటా మే నెలలో రైతు ఖాతాలలో సొమ్ములు జమ కావలసి ఉండగా.. ఈ ఏడాది ఈ పథకానికి సంబంధించి ఎటువంటి ప్రస్తావనా ప్రభుత్వం నుంచి రాలేదు. అంటే ఈ నెలలో ఇక రైతు భరోసా సొమ్ములు అందనట్లేనని రైతులు సైతం నిర్ణయానికి వచ్చేశారు.  అసలు వాస్తవంగా జగన్ జగన్ రైతు బరోసా కింద ఇచ్చింది ఏడాదికి ఏడున్నరవేలే. కేంద్రం ఇచ్చిన ఆరున్నర వేలను మినహాయించుకుని జగన్ రైతు భరోసా ఇచ్చారు. ఇచ్చిన ఏడున్నర వేలూ కూడా రెండు విడతల్లో ఇచ్చారు. రెండేళ్ల పాటు ఏడాదికి ఏడున్నర వేలు చొప్పున ఇచ్చిన జగన్ మూడో ఏడాది ‘భరోసా’కు హామీ లేదని చెప్పకనే చెబుతున్నారు. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి రైతు భరోసా కోసం బడ్జెట్ కేటాయించి, లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసిన జగన్ సర్కార్ ఆ లబ్ధిదారుల జాబితాను మాత్రం రైతు భరోసా కేంద్రాలలో ఇంత వరకూ ప్రదర్శించలేదు.

గత నెల 15 నాటికే జాబితా సిద్ధమైనప్పటికీ దానికి ఇంకా  ప్రదర్శించక పోవడంతో ఈ ఏడాది రైతు భరోసాపై నీలి నీడలు కమ్ముకున్నాయి.  ఉద్యోగుల జాతాలే ఎప్పుడు చెల్లిస్తామన్నదే చెప్పలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం.. రైతు భరోసా గురించి ఏం చెప్పగలుగుతుందని పరిశీలకులు అంటున్నారు. ఆర్థిక కష్టాల పేరు చెప్పి ఒక్కో పథకాన్నీ ఆంక్షల చట్రంలో బిగించేసి లబ్ధిదారుల సంఖ్యను తగ్గిచుకునే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని అంటున్నారు.

అదే దారిలో రైతు భరోసాకు మంగళం పాడేసే ఉద్దేశంతోనే సర్కార్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం సర్కార్ ముందున్న పెద్ద గండం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు చెల్లించడం. అందు కోసమే రమారమి నలుగున్నర కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. ముందుగా ఈ చెల్లింపులు పూర్తయిన తరువాతనైనా రైతు భరోసా గురించి ఆలోచిస్తుందా అంటే ప్రభుత్వానికి ఆ వెసులు బాటు లేదనీ, వచ్చే నెలలో అమ్మ ఒడి పథకం అమలు వ్యయం తరుముకు వస్తున్నదనీ ఆర్థిక నిపుణులు అంటున్నారు. అమ్మ ఒడి పథకం అమలును ఇప్పటికే వాయిదా వేశారు. అదీ అలాంటిలాంటి వాయిదా కాదు. ఏకంగా ఒక ఏడాది అమ్మఒడికి మంగళం పాడేసేంతగా. అందుకే అమ్మ ఒడి పథకం అమలును మరోసారి వాయిదా వేయలేని అనివార్యతను జగన్ సర్కార్ ఎదుర్కొంటున్నది. అందుకే రైతు భరోసాపై జగన్ ఈ ఏడాది ఇక దృష్టి సారించే అవకాశమే లేదని అంటున్నారు.  

By
en-us Political News

  
ఇటీవల కాలంలో ముగ్గురుర వైసీపీ నేతలపై నమోదైన మూడు కేసుల్లో ఆ నేతలు వ్యవహరిస్తున్న తీరు, వారికి పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి మద్దతు విమర్శలకు గురౌతోంది. పూర్తిగా కుటుంబ వివాదాలు, ప్రత్యక్షంగా వారు పాల్పడిన అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో నమోదైన కేసులను కూడా రాజకీయ వేధింపులంటూ  వారు మాట్లాడుతున్న మాటలు, చేస్తున్న వ్యాఖ్యలు విస్తుగొలుపుతున్నాయి.
ప్రభుత్వ బాకాలుగా వ్యవహరిస్తున్న మరికొన్ని మీడియా సంస్థల విలేకరులపై కూడా జంతర్ మంతర్ వద్ద నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రదర్శనకారులపై పోలీసుల దాష్టీకాన్నీ, తమ ఆందోళనలపై కేంద్రం అనుసరిస్తున్నఅణచివేతనూ ప్రస్తావించకుండా కేంద్ర ప్రభుత్వ అనుకూలతకే ప్రాధాన్యం ఇవ్వడంతోనే ప్రధాన స్రవంతి మీడియా ప్రజాగ్రహానికి గురౌతోందని చెబుతున్నారు.
ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేసిన ఈ వీడియో సందేశంపై ప్రముఖ నటుడు, సామాజిక విమర్శకుడు ప్రకాశ్ రాజ్ ప్రధాని ముఖంలో భయం ప్రస్ఫుటంగా కనిపించిందంటూ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
పార్లమెంటు ఉభయ సభలలో ఏదో ఒక సభ లో సభ్యత్వం లేని వ్యక్తి ఆరు నెలల కాల పరిమితి మించి కేంద్ర మంత్రిగా కొనసాగే అవకాశం లేదు. దీంతో మోడీ ఆదేశాల మేరకు రవ్ నీత్ సింగ్ బిట్టూ తన పదవికి రాజీనామా సమర్పించారు.
పరీక్షల్లో పారదర్శకత, విద్యారంగంలో సంస్కరణలు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా డిమాండ్ తో యువత చేపట్టిన పోరాటానికి మద్దతు ప్రకటించడమే కాకుండా.. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం జరగనున్న ధర్నాలో స్వయంగా పాల్గొంటానని వెల్లడించారు.
కల్వకుంట్ల తారకరామారావు జన్మదినం జులై 24 ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ కేటీఆర్ కు పాతిక కిలోల సన్నబియ్యాన్ని కానుకగా పంపారు. అదీ తాను స్వయంగా ఆ బర్త్ డే గిఫ్ట్ ను అందించకుండా, ర్యాపిడో బైక్ బుక్ చేసి.. ఆ కానుకను తెలంగాణ భవన్ కు కేటీఆర్ కు పంపించారు.
వాస్తవానికి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే కేబినెట్ భేటీకి డిప్యూటీ సీఎం హాజరు కాకపోవడానికి రాజకీయ కారణాలున్నాయా అన్న అనుమానాలకు ఆస్కారం లేని పరిస్ధితి ఉంది. ఎందుకంటే.. ఇటీవలే ముంబై లోని కోకిలా బెన్ అంబానీ ఆస్పత్రిలో పవన్ కల్యాణ్ భుజానికి శస్త్ర చికిత్స జరిగింది. ఆయనకుపూర్త విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించడం వల్లనే కేబినెట్ భేటీకి రాలేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
మత్స్యకారుల నాయకుడిగా, మాజీ మంత్రిగా గుర్తింపు పొందిన సీదిరి అప్పలరాజు ఇటీవల వార్తల్లో నిలిచారు.
జగన్ సొంత కుంపటి పెట్టుకున్న నాటి నుంచీ వెన్నంటి ఉన్న విజయసాయిరెడ్డి, సమీప బంధువు అయిన బాలినేని లకు పార్టీలో దక్కిన మర్యాద తెలిసిందే. ఇప్పుడు తాజాగా నిన్న మొన్నటి వరకూ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా, నమ్మిన బంటుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఇప్పుడు కనీసం తాడేపల్లి ప్యాలెస్ గేటు వద్ద ఎంట్రీ కూడా దొరకడం లేదు.
ఇటీవల నిరుద్యోగ యువతను ఉద్దేశించి సుప్రీంకోర్టు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు నిరసనగా, సామాజిక మాధ్యమాల్లో రాజుకున్న ఆగ్రహం ఇప్పుడు దేశ రాజధాని జంతర్ మంతర్ వద్ద విశ్వరూపంతో నిలిచింది. ప్రశ్నించే హక్కును కోల్పోయిన తరానికి ప్రాతినిధ్యం వహిస్తూ కాక్రోచ్ జనతా పార్టీ రూపంలో విద్యార్థులు, యువత ఉద్యమిస్తున్నారు.
ఏపీలో కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ ఈ అంశాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది. జాతీయ స్థాయి నీట్ లీకేజీ వ్యవహారంలోకి ఏపీ మెగా డీఎస్సీ పరీక్షల అంశాన్ని జోడించి లబ్ధి పొందేందుకు ప్రయత్నాలు చేస్తున్నది. రాష్ట్రంలో ఇటీవల నిర్వహించిన డీఎస్సీ పరీక్షల్లో అనేక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైసిపి నాయకత్వం విమర్శిస్తూ, నీట్ తో పాటు డీఎస్సీ అక్రమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది.
దేశవ్యాప్తంగా నీట్ పరీక్షల నిర్వహణ, ప్రశ్నాపత్రాల లీకేజీ ఆరోపణలు తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి.
రాజకీయం గురించి కాదు. పార్టీ గురించి కాదు.ఒక నాయకుడి గురించి కూడా కాదు....ఒక తరం గురించి. విజృంభించిన లాఠీల్లో రక్తం చిందించిన ఈ తరం గురించి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.