ఏపీ సీఎం జగన్ ఆర్భాటంగా ప్రకటించి ప్రారంభించిన ఒక్కో పథకానికీ మెల్లిమెల్లిగా చెల్లుచీటీ ఇచ్చేస్తున్నారా? అమ్మ ఒడి పథకానికి కండీషన్స్ తో దాదాపు చరమగీతం పాడేసిన జగన్ ఇప్పుడు రైతు భరోసాకూ శఠగోపం పెట్టేయనున్నారా? వైసీపీ గొప్పగా చెప్పుకుంటున్న పథకాలలో రైతు భరోసా ఒకటి. ఏటా రైతు ఖాతాలో పన్నెండున్నర వేలు జమ చేయడానికి ఉద్దేశించిన ఈ పథకానికి ఈ ఏడాది మంగళం పాడేశారంటున్నారు పరిశీలకులు. ప్రతి ఏటా మే నెలలో రైతు ఖాతాలలో సొమ్ములు జమ కావలసి ఉండగా.. ఈ ఏడాది ఈ పథకానికి సంబంధించి ఎటువంటి ప్రస్తావనా ప్రభుత్వం నుంచి రాలేదు. అంటే ఈ నెలలో ఇక రైతు భరోసా సొమ్ములు అందనట్లేనని రైతులు సైతం నిర్ణయానికి వచ్చేశారు. అసలు వాస్తవంగా జగన్ జగన్ రైతు బరోసా కింద ఇచ్చింది ఏడాదికి ఏడున్నరవేలే. కేంద్రం ఇచ్చిన ఆరున్నర వేలను మినహాయించుకుని జగన్ రైతు భరోసా ఇచ్చారు. ఇచ్చిన ఏడున్నర వేలూ కూడా రెండు విడతల్లో ఇచ్చారు. రెండేళ్ల పాటు ఏడాదికి ఏడున్నర వేలు చొప్పున ఇచ్చిన జగన్ మూడో ఏడాది ‘భరోసా’కు హామీ లేదని చెప్పకనే చెబుతున్నారు. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి రైతు భరోసా కోసం బడ్జెట్ కేటాయించి, లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసిన జగన్ సర్కార్ ఆ లబ్ధిదారుల జాబితాను మాత్రం రైతు భరోసా కేంద్రాలలో ఇంత వరకూ ప్రదర్శించలేదు.
గత నెల 15 నాటికే జాబితా సిద్ధమైనప్పటికీ దానికి ఇంకా ప్రదర్శించక పోవడంతో ఈ ఏడాది రైతు భరోసాపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఉద్యోగుల జాతాలే ఎప్పుడు చెల్లిస్తామన్నదే చెప్పలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం.. రైతు భరోసా గురించి ఏం చెప్పగలుగుతుందని పరిశీలకులు అంటున్నారు. ఆర్థిక కష్టాల పేరు చెప్పి ఒక్కో పథకాన్నీ ఆంక్షల చట్రంలో బిగించేసి లబ్ధిదారుల సంఖ్యను తగ్గిచుకునే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని అంటున్నారు.
అదే దారిలో రైతు భరోసాకు మంగళం పాడేసే ఉద్దేశంతోనే సర్కార్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం సర్కార్ ముందున్న పెద్ద గండం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు చెల్లించడం. అందు కోసమే రమారమి నలుగున్నర కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. ముందుగా ఈ చెల్లింపులు పూర్తయిన తరువాతనైనా రైతు భరోసా గురించి ఆలోచిస్తుందా అంటే ప్రభుత్వానికి ఆ వెసులు బాటు లేదనీ, వచ్చే నెలలో అమ్మ ఒడి పథకం అమలు వ్యయం తరుముకు వస్తున్నదనీ ఆర్థిక నిపుణులు అంటున్నారు. అమ్మ ఒడి పథకం అమలును ఇప్పటికే వాయిదా వేశారు. అదీ అలాంటిలాంటి వాయిదా కాదు. ఏకంగా ఒక ఏడాది అమ్మఒడికి మంగళం పాడేసేంతగా. అందుకే అమ్మ ఒడి పథకం అమలును మరోసారి వాయిదా వేయలేని అనివార్యతను జగన్ సర్కార్ ఎదుర్కొంటున్నది. అందుకే రైతు భరోసాపై జగన్ ఈ ఏడాది ఇక దృష్టి సారించే అవకాశమే లేదని అంటున్నారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-government-to-skip-raithu-bharosa-25-135416.html
తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లుగా.. వాగ్వాదం కాస్తా ఘర్షణగా మారింది. పరస్పర దాడులకు దారి తీసింది. రాళ్లు, కర్రలతో ఇరువర్గాలూ పరస్పర దాడులకు తెగబడ్డారు. దీంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తంగా మారింది.
వైఎస్ఆర్ జయంతిని పురస్కరించుకుని, ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయనకు నివాళులు అర్పించేందుకు ఏర్పాట్లు చేశారు. వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నివాళులర్పించే క్రమంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది.
గన్నవరం పోలీసులు సమర్పించిన నివేదిక ప్రకారం, ప్రశ్న రావణ్ దేశ సార్వభౌమత్వానికి భంగం కలిగించేలా ప్రవర్తించారనే బలమైన ఆరోపణలు ఉన్నాయి. నిషేధిత మావోయిస్టు పార్టీకి మద్దతుగా, యువతను ఆ మార్గం వైపు ప్రేరేపించేలా ఆయన కంటెంట్ ఉందనేది పోలీసుల ప్రధాన అభియోగం.
ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి ఇప్పటివరకు లక్ష్మారెడ్డి గన్‌మెన్‌లను వెంట పెట్టుకోకుండా ప్రజల మధ్యకు వస్తున్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయనకు ప్రభుత్వం భద్రతా సిబ్బందిని కేటాయించినప్పటికీ.. తనకు ప్రత్యేక భద్రత అవసరం లేదని చెబుతూ వారిని విధుల్లో కొనసాగనివ్వలేదు.
సీఎం పర్యటన ద్వారా ఈ కేసులోని సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందంటూ డీఎంకే ప్రధాన కార్యదర్శి ఆర్.ఎస్. భారతి సుప్రీంకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేశారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియ మరింత ఆలస్యం కాకుండా ఉండేందుకు, తమకు అనుకూలంగా నిర్ణయం వచ్చేలా చూసేందుకు ఆమె ముందు జాగ్రత్తగా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
కోలీవుడ్‌లోని మరికొందరు స్టార్స్ రాజకీయాలలోకి అడుగులు వేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే స్టార్ హీరో ధనుష్ కూడా రాజకీయ అరంగేట్రం చేయబోతున్నారు.
రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన విలువలతో కూడిన రాజకీయాలకు నిలువెత్తు రూపంగా నిలిచారు. సొంత ఇల్లు కూడా లేకుండా, ఒక పాత స్కూటర్ మినహా ఎలాంటి ఆస్తులు కూడబెట్టకుండా నిరాడంబరంగా జీవించారు.
తాడికొండ నియోజకవర్గంలో వైసీపీ తరఫున తాను పోటీ చేయడానికి దారితీసిన పరిస్థితులను గుర్తు చేసుకున్న ఉండవల్లి శ్రీదేవిరాజధాని ప్రాంత సీటును దక్కించుకుని, భారీ మెజారిటీతో విజయం సాధించానని చెప్పారు.
నిజాయితీగా పార్టీ కోసం జెండా పట్టి రోడ్లెక్కిన కార్యకర్త ఒకసారి పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కిన తర్వాత ఏ అగ్రనేత కూడా వారిని కాపాడటానికి రావడం లేదని శ్రీధర్ చెప్పారు. నాయకులు కేవలం ఫోటోలకు ఫొటోలు దిగడానికి, మీడియాలో కనిపించడానికే ప్రాధాన్యత ఇస్తారు తప్ప, లోయర్ లేదా మిడిల్ క్లాస్ కార్యకర్త ఆసుపత్రి బిల్లు ఎంత అయింది? కోర్టు ఖర్చులు ఎలా కడుతున్నాడు? అని మానవత్వంతో ఆలోచించే పరిస్థితుల్లో నేటి నాయకత్వాలు లేవని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు, ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు.
ఆ ఎన్నికలలో జనసురాజ్ పార్టీ ఒక్కటంటే ఒక్క స్థానంలో విజయం సాధించలేదు సరికదా.. ఆ పార్టీ అభ్యర్థులెవరికీ కనీసం డిపాజిట్లు కూడా దక్కలేదు. తెరవెనుక ఉండి ఎందరో దిగ్గజాలను సీఎం గద్దెపై కూర్చోబెట్టిన పీకే.. రాజకీయ వ్యూహాలు తన సొంత పార్టీకి ఇసుమంతైనా ఉపయోగపడలేదు. దీంతో ఇక లాభం లేదనుకుని తానే స్వయంగా ఎన్నికల బరిలో నిలబడి సత్తా చాటాలని నిర్ణయించుకున్నారు.
కోల్‌కతాలోని కాళీఘాట్‌లోని మమతా బెనర్జీ అధికారిక నివాసం వద్ద భారీగా పోలీసులు, కేంద్ర బలగాలను మోహరించడం ఈ ఆరోపణలకు బలాన్ని చేకూరుస్తోంది. మమత నివాసానికి వెళ్లే అన్ని ప్రధాన మార్గాలను పోలీసులు తమ అధీనంలోకి తీసుకుని, భారీ పోలీసు వాహనాలతో పూర్తిగా దిగ్బంధించారు.