యూట్యూబర్ ప్రశ్న రావణ్ పై ఉపా కేసు.. మాజీ న్యాయమూర్తి రామకృష్ణ సంచలన విశ్లేషణ.!

Publish Date:Jul 6, 2026

Advertisement

తెలుగువన్ ఎక్స్ క్లూజివ్

 యూట్యూబర్ బచ్చలకూరి జోసఫ్ అలియాస్  ప్రశ్న రావణ్  అరెస్టు,  ఆయనపై నమోదైన సెక్షన్ల వ్యవహారం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌లను ఉద్దేశించి సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో గన్నవరం పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అయితే..  ఈ కేసులో సాధారణ  సెక్షన్లతో పాటు కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాద నిరోధక చర్యల కోసం ప్రయోగించే అత్యంత కఠినమైన చట్టం  ఉపా  అన్‌లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ సెక్షన్ 39ను కూడా చేర్చడం తీవ్ర చర్చకు దారితీసింది.  ఈ నేపథ్యంలో ప్రస్తుత చట్టపరమైన పరిణామాలు,  ఉపా చట్టం తీవ్రత, రావణ్‌కు కోర్టుల్లో ఎదురుకాబోయే సవాళ్లపై మాజీ న్యాయమూర్తి రామకృష్ణ  తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సంచలన విశ్లేషణ చేశారు. సాధారణంగా దేశద్రోహ శక్తులు, ఉగ్రవాద ముఠాలతో సంబంధాలు ఉన్నవారిపై ప్రయోగించే ఈ చట్టాన్ని ఒక యూట్యూబర్‌పై ప్రయోగించడం వెనుక ఉన్న న్యాయపరమైన సాధ్యాసాధ్యాలను ఆయన  వివరించారు.  మాజీ జడ్జి రామకృష్ణ విశ్లేషణ ప్రకారం.. ఉపా  చట్టం కింద కేసు నమోదైతే నిందితుడికి సాధారణ కోర్టుల్లో అంత సులభంగా ఉపశమనం లభించదు. ఈ చట్టం పరిధిలోకి వచ్చే కేసులను ఎన్ఐఏ  ప్రత్యేక  కోర్టులు లేదా హైకోర్టులు మాత్రమే విచారిస్తాయి. అంతే కాకుండా, ఈ చట్టం కింద నమోదైన సెక్షన్ల ప్రకారం నిందితుడికి త్వరగా బెయిల్ వచ్చే అవకాశం ఉండదు.  విచారణ ప్రక్రియ చాలా సుదీర్ఘంగా సాగుతుందని ఆయన స్పష్టం చేశారు. రావణ్ కేసులో కేవలం దూషణలు, రాజకీయ విమర్శలే కాకుండా ఉపా చట్టం పరిధిలోకి వచ్చే వ్యూహాత్మక అంశాలు లేదా ఆడియో క్లిప్పింగుల ఆధారంగా పోలీసులు బలమైన సాక్ష్యాలను సిద్ధం చేసి ఉంటారని   అభిప్రాయపడ్డారు. ఒకవేళ ఈ సెక్షన్లను ఉన్నతాధికారులు,  న్యాయస్థానాలు ప్రాథమికంగా అంగీకరిస్తే.. రావణ్‌ను ఈ కేసుల నుండి రక్షించడం చట్టపరంగా చాలా కష్టమైన విషయమని మాజీ న్యాయమూర్తి   చెప్పారు.  రాజకీయ విమర్శలు, సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించే హక్కు అందరికీ ఉన్నప్పటికీ..  మాట్లాడే భాష చట్టపరిధిని దాటినప్పుడు ఇలాంటి తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని రామకృష్ణ అన్నారు.  ఇప్పటికే రాష్ట్రంలో ఈ కేసు చుట్టూ తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. ప్రజాస్వామ్యవాదులు, ప్రతిపక్షాలు ఈ చట్టం ప్రయోగాన్ని కక్షసాధింపుగా అభివర్ణిస్తుండగా..  చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా శిక్షార్హులేనని అధికార పక్షం వాదిస్తోంది.  

పూర్తి ఇంటర్వ్యూ తెలుగువన్ చానల్ లో వీక్షించండి

Former Judge Ramakrishna Legal Analysis, Andhra Pradesh Police Ravan Arrest, Chandrababu Pawan Kalyan YouTuber Case, AP Politics Social Media Arrests

 

 

By
en-us Political News

  
కంగుతిన్న వైసీపీ అసెంబ్లీలో లోకేష్ ప్రసంగంపై ప్రజలలో చర్చ జరగకుండ ఉండేందుకు మండలి వేదికగా బొత్స పెద్ద డ్రామాకు తెరతీసి.. అచ్చెన్నాయుడు తనను అవమానించారు, క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేసి గందరగోళం సృష్టించే ప్రయత్నించారన్నారు. 
మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన కుమారుడు రాజీవ్, వారి కుటుంబ సభ్యులపై  జోగి రాజీవ్ భార్య  మేఘన పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. వరకట్న వేధింపులు, గృహహింస, మతమార్పిడి ఒత్తిళ్లు అంటూ మేఘన  ఫిర్యాదు మేరకు 11 మంది పై కేసు నమోదైన సంగతి తెలిసిందే.
నిబంధనల ప్రకారం భర్తీ చేయాల్సిన ఈ పదవుల కోసం ఆయన ఇప్పటికే ఇద్దరి పేర్లు ప్రతిపాదించారు.  సామాజిక న్యాయం, ప్రాంతీయ సమతుల్యతతో పాటు పార్టీ పట్ల అంకిత భావాన్నీ, పార్టీ కోసం పని చేసిన తీరునూ కూడా పరిగణనలోనికి తీసుకుని మరీ ఈ పేర్లు ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం.    
ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్‌ రెడ్డికి జాయింట్‌ కో-ఆర్డినేటర్‌ బాధ్యత..!
అర్బన్ నక్సల్, రూరల్ నక్సల్ అనే పదాల సరసన ఇప్పుడు దిమాగీ నక్సల్అ నే కొత్త బ్రాండ్‌ను చేర్చారన్నారు భరద్వాజ. అంతేందుకు ఆపరేషన్ కగార్ పేరుతో నక్సలైట్లను భౌతికంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా ప్రకటించి మార్చి 31 2026 డెడ్ లైన్ విధించిన సంగతిని గుర్తు చేశారు.
ఐదేళ్లు అధికారంలో ఉన్న జగన్ ఐదు డీఎస్సీలు నిర్వహించాల్సిన ఆయన ప్రభుత్వం ఒక్క డీఎస్సీ ఎందుకు నిర్వహించలేకపోయిందో చెప్పాలన్నారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకూ ఇప్పుడు వైసీపీ లోకేష్ రాజీనామా చేయాలన్న డిమాండ్ కూ పొంతన లేదన్నారు.
ఈ కొత్త పాలకమండలిలో వివిధ రాష్ట్రాల నుంచి కీలక నాయకులకు చోటు కల్పించారు.  కాగా బిజెపి జాతీయ ఉపాధ్యక్ష పదవుల్లో మొత్తం 13 మంది నాయకులకు అవకాశం దక్కింది. వీరిలో  పురందేశ్వరి ఒకరు. 
వనపర్తి కాంగ్రెస్‌లో టికెట్ వివాదం..నేను కూడా జీవన్ రెడ్డిలా తిరగబడతా..!
ప్రజాసమస్యలపై చర్చ జరగాల్సిన మండలిలో ఇరు పార్టీలకు చెందిన నేతలూ.. వ్యక్తిగత దూషణలతో సభలో మాటల యుద్ధానికి దిగారు.  ముఖ్యంగా  మండలిలో విపక్ష నాయకుడు, వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మంత్రి అచ్చెన్నాయుడుల మధ్య మాటల మంటలు రేగాయి. పరస్పరం విమర్శలు, ఆరోపణలు గుప్పించుకున్నారు.
సెంబ్లీ ఎన్నికలలో తన జన సురాజ్ పార్టీ ఘోర పరాజయం పాలైనప్పటికీ... ఇటీవల బంకీపూర్ నియోజకవర్గ ఉప ఎన్నికలో ప్రశాంత్ కిశోర్ బీజేపీ కంచు కోటను బద్దలు కొట్టి మరీ విజయం సాధించారు.
భారత ప్రధాన న్యాయమూర్తి ఒక కేసు విచారణ సందర్భంగా చేసిన కాక్రోచ్ అన్నపదం ఎంతటి సంచలనానికి దారి తీసిందో.. ప్రధాని తన పంద్రగస్టు ప్రసంగంలో ఉపయోచించిన దిమాగీ నక్సల్ పదం కూడా అంతకు మించి సంచలనం సృష్టించింది. 
 ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్‌గా నాగబాబును నియమిస్తూ..  ఆయనకు కేబినెట్ హోదాను కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీ శాఖ  సోమవారం ఉత్తర్వులు ారీ చేసింది.  
గత కొంతకాలంగా పార్టీలో తనను ఏ విధంగా పక్కన పెట్టారో  వివరించారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో, తన కుమారుడి విద్యాభ్యాసానికి సంబంధించిన గ్రాడ్యుయేషన్ వేడుకల కోసం అమెరికా వెళ్లిన  సమయంలోనే కనీసం ముందస్తు సమాచారం,  షోకాజ్ నోటీసు కూడా ఇవ్వకుండా  తనను ఆ పదవి నుంచి తొలగించారని గుర్తు చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.