విజయసాయిపై జ‘గన్’ఫైర్: పీకే సర్వేలే రీజన్!

Publish Date:Apr 19, 2022

Advertisement

వైసీపీలో ఎప్పుడు ఎవరిని అందలం ఎక్కిస్తారో? ఎప్పుడు ఎవరిని అధ:పాతాళానికి పడేస్తారో ఎవరి ఊహకూ అందదు. ఒకప్పుడు వైసీపీలో అంతా తానే అన్నట్లుగా విజయసాయి ప్రభ వెలిగింది. ఆ తరువాత ఏం జరిగిందో కానీ...క్రమంగా ఆయన ప్రభ పార్టీలో మసకబారుతూ వచ్చింది. పూలమ్మిన చోటే కట్టెలమ్మిన చందంగా పార్టీలో అత్యంత క్రియాశీలంగా వ్యవహరించిన విజయ సాయి ఆ తరువాత ఉత్తరాంధ్ర ఇన్ చార్జి బాధ్యతలకే పరిమితం అయ్యారు. అంతలోనే ఏమైందో ఇప్పుడు ఆ నామమాత్రపు బాధ్యతల నుంచి కూడా తప్పించేసిన జగన్ విజయసాయిని ఉత్సవ విగ్రహ స్థాయికి తగ్గించేశారు. 

  విజయసాయి అధినేతకు అత్యంత ఆప్తుడిగా, విశ్వాసపాత్రుడిగా గుర్తింపు పొందారు. అందుకే ఎటువంటి రాజకీయ అనుభవమూ లేకపోయినా...పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేశారు. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నియమించారు. అయితే ఇదంతా కొద్ది కాలమే...క్రమంగా విజయసాయి పార్టీలో కీలక స్థానం నుంచి ఒక్కో మెట్టూ దింపేస్తూ వచ్చిన జగన్ ఉత్తరాంధ్ర జిల్లాల ఇన్ చార్జి పదవికి పరిమితం చేశారు. ఇప్పుడు ఆ పదవిని కూడా ఊడబీకేయడంతో ఇక వైకాపాలో విజయసాయి పాత్ర నామమాత్రమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. జగన్ తాజాగా వెల్లడించిన జిల్లా ఇన్ చార్జిల జాబితాలో విజయసాయి పేరు గల్లంతైంది. పార్టీ కేంద్రకార్యాలయానికి రమ్మని పిలిచారని అంటున్నప్పటికీ ..అక్కడ కూడా ఆయనకు క్రియాశీలంగా పని చేసే అవకాశం ఉండదని చెబుతున్నారు.  ఉత్తరాంధ్ర ఇన్ చార్జిగా విజయసాయి రెడ్డి పనితీరు వల్ల అక్కడ పార్టీకి నష్టం జరగిందన్న ఆరోపణలే ఇందుకు కారణమని చెబుతున్నప్పటికీ అసలు కారణం వేరే ఉందన్నది పరిశీలకుల అభిప్రాయం.  అయితే తాజా ఇన్ చార్జీల జాబితాలో పార్టీలో మరో ఇద్దరు ప్రముఖుల పేర్లు కూడా గల్లంతయ్యాయి. వారు కూడా తక్కువ వారేం కాదు. పార్టీ రాజకీయ సలహాదారుగా ప్రస్తుతం పార్టీలో, ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న సజ్జల రామకృష్ణారెడ్డి ఒకరైతే...మరొకరు సాక్షాత్తూ జగన్ బంధువు, ప్రస్తుతం టీటీడీ చైర్మన్  వైవీ సుబ్బారెడ్డి. 

 ముఖ్యంగా విజయసాయిరెడ్డిపై జగన్ ఆగ్రహానికీ అసంతృప్తికీ కారణాలేమిటన్న ప్రశ్నకు....క్యాడర్ లో విజయసాయి రెడ్డికి ఉన్న గుర్తింపేనన్న సమాధానం వస్తుంది. తన తరువాత తనంతటి వాడిగా విజయసాయి ఎదుగుదలను అడ్డుకోవడానికే జగన్ ఆయనను కేవలం ఉత్తరాంధ్రకు పరిమితం చేశారనీ, అయితే అక్కడా ఆయన తన ప్రాబల్యాన్ని పెంచుకునేందుకు ఇచ్చిన ప్రాధాన్యం అధినేత ఆకాంక్షల మేరకు పార్టీని నడిపించేలా పని చేయలేదన్న భావనకు జగన్ రావడమేనని అంటున్నారు. 

వీటికి తోడు 2019 ఎన్నికలలో జగన్ విజయానికి వ్యూహరచన చేసి విజయవంతంగా అమలు చేసిన ప్రశాంత్ కిషోర్ 2024లో కూడా ఏపీలో మరోసారి జగన్ పార్టీని గెలిపించేందుకు పని చేయనున్నారు. ఆయన చేసిన సర్వేలు, వాటి ఫలితాల ఆధారంగానే జగన్ నిర్ణయాలు తీసుకుంటున్నారనీ...అందులో భాగమే విజయ సాయి రెడ్డి ప్రాధాన్యాన్ని కుదించేయడం అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విజయసాయికి మరో మారు రాజ్యసభ అవకాశం ఇచ్చే అవకాశాలు కూడా దాదాపు మృగ్యమనే అంటున్నారు.  

మెత్తానికి వైసీపీలో విజయసాయి ప్రభ మసకబారడానికి ఎవరు ఏయే కారణాలు చెప్పినా జగన్ ఎవరినీ ఎక్కువ కాలం నమ్మరన్నదే వాస్తవం. 
జిల్లాఇన్ చార్జీల లిస్టులో సజ్జల, వైవీ రెడ్డి పేర్లూ గల్లంతవ్వడమే ఇందుకు  నిదర్శనం. 

By
en-us Political News

  
జాతీయ రాజధాని ఢిల్లీలో రాజకీయ వేడెక్కుతున్న వేళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకులకు సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ అత్యంత కీలకమైన ఆదేశాలు జారీ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వ్యవహారంపై కాంగ్రెస్ న్యాయపోరాటానికి దిగింది.
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వెస్ట్ బైపాస్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి అత్యంత కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ భిన్నమైన వైఖరిని ప్రదర్శించారు.  ప్రధాని మోదీతో ఆదివానం ఒకే వేదిక పంచకున్న తమిళనాడు సీఎం విజయ్.. ఆ బహిరంగ వేదికపైనే  రాష్ట్ర సమస్యలను, అలాగే  రావాల్సిన నిధులను ప్రస్తావించి అందరి దృష్టినీ ఆకర్శించారు. ప్రధాని వేదికపైనే ఆసీనులై ఉన్నప్పటికీ, ఏమాత్రం సంకోచించకుండా రాష్ట్ర ప్రయోజనాలే తమకు అత్యంత ముఖ్యమని విజయ్ కుండబద్దలు కొట్టారు. 
ప్రస్తుతం మార్కెట్‌లో రోజురోజుకూ పెరుగుతున్న ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి
అర్థశాస్త్ర రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి విజేతల ప్రకటన వెలువడింది.
 సొంత పార్టీకి చెందిన ఎమ్మెల్యేయే ప్రభుత్వ విధానాలపై న్యాయపోరాటానికి దిగడం, తనకు జరిగిన అన్యాయంపై పార్టీ హైకమాండ్ కూ, సీఎం రేవంత్ రెడ్డి తీరుపై అగ్రనేత రాహుల్ కు ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరికలు జారీ చేయడం సంచలనంగా మారింది.  
ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది.
భారతీయ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తూ
సికింద్రాబాద్‌లోని బొల్లారం చిన్నారి మోజెస్ అరెలియా కిడ్నాప్, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
జగన్ అక్రమాస్తులకేసుల విచారణను వేగవంతం చేయాలని ఈడీ కోర్టును ఆశ్రయించడాన్ని సమర్ధించిన తెలుగుదేశం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి.. ఈ కేసులను  కేవలం రోజువారీ విచారణ కాకుండా, ప్రతి రోజూ, రోజంతా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.  
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఇండియా కూటమి నేతల విజ్ణప్తికి నో చెప్పారు. తనను కలవాలంటూ ఇండియా కూటమి నేతలు చేసిన అభ్యర్థనను ఆయన తిరస్కరించారు. రాజకీయ పార్టీల నేతలతో సమావేశం కావడం కుదరదని విస్పష్టంగా తేల్చేశారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.