వాలంటీర్లపైనే విశ్వాసం.. ఎన్నికల్లో గట్టెక్కిస్తారన్నదే జగన్ ధీమా

Publish Date:Apr 22, 2022

Advertisement

వైఎస్ జగన్మోహనరెడ్డి...ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి. ఇప్పటి పాలన సంగతి పట్టించుకోకుండా మరో రెండేళ్ల తరువాత వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం కోసం ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ప్రస్తతం రాష్ట్రంలో అన్ని వర్గాలలో అసంతృప్తి గూడుకట్టుకుందన్న సంగతి ప్రస్ఫుటంగా తెలుస్తున్నా...రెండేళ్లలో జగన్మాయ చేయలేనా అన్న ధీమాతో ఉన్నారు. అందుకే పార్టీలో అసమ్మతినీ, ఉద్యోగులలో ఆగ్రహాన్నీ, సామాన్య జనంలో ఆవేదననీ దేనినీ అడ్రెస్ చేయడం లేదు...కనీసం చేద్దామని కూడా అనుకోవడం లేదు. మరి వచ్చే ఎన్నికల్లో గెలుపుపై ఆయన ధీమా ఏమిటి?

ఇందుకు ఆయనే సృష్టించిన సరికొత్త (అ)వ్యవస్థ ఉందిగా... అదే వాలంటీర్ల వ్యవస్థ. దానిపైనే ఆయన నమ్మకం...వాలంటీర్లు ఉన్నారన్నదే ఆయన ధీమా అంటున్నారు విశ్లేషకులు. సొంత గ్రామంలోనే ప్రభుత్వ ఉద్యోగమంటూ ఘనంగా ప్రకటించుకుని పెద్ద ఎత్తున నామమాత్రపు వేతనాలకు ఆయన నియమించుకున్న ప్రైవేటు సైన్యమే వాలంటీర్లు. వచ్చే ఎన్నికలను వారి ద్వారానే గట్టెక్కాలన్నది ఆయన యోచన. వైకాపా ఎమ్మెల్యేలు సైతం తమ ప్రైవేటు సంభాషణల్లో జగన్ ధీమా ఇదేనని చెప్పుకొస్తున్నారు. 
వలంటీర్లతో ఎన్నికలు గెలవడమేమిటి? ఎన్నికలలో విజయం సాధించాలంటే అభివృద్ధి పనులు చేయాలి. ప్రజా సంక్షేమం కుంటుపడకుండా కార్యక్రమాలు చేయాల. తద్వారా ప్రజా విశ్వాసం చూరగొనాలి. అప్పుడు కదా, జనం మెచ్చి ఒట్లేసేది? కానీ వైకాపా అధినేతకు అటువంటి వాటిపై నమ్మకం లేదు. ప్రజల వద్దకు నేరుగా ప్రభుత్వం అంటే వాలంటీర్లు వెళ్లి సేవలందిస్తున్నారు కదా! ఇంకేం చేయాలి? అన్న ధీమాలో ఉన్నారు. వాలంటీర్లనే బూతు స్థాయి అధికారులుగా నియమించేస్తే.. కాగల కార్యం వారే చూసుకుంటారన్న దీమా ఆయనది. అందుకే ఊరూరా, వాడ వాడలా వాలంటీర్లకు సన్మానం చేసే కార్యక్రమానికి ఆయన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శ్రీకారం చుట్టారు. అది ఇంకా కొనసాగుతోంది. 

వారి మీద ఎంత విశ్వాసం అంటే స్థానిక ప్రజాప్రతినిథుల అధికారాలలో కోత పెట్ట మరీ వారికి కట్టబెట్టారు. స్థానికంగా ఎమ్మెల్యేలను మించిన పెత్తనం వారి చేతికే ఇచ్చేశారు. అధికారికంగా కాదు...  మీ అంతటి వారు లేరంటూ భుజకీర్తులు తగలించడం ద్వారా. ఇంతకీ వాళ్లు చేయాల్సిన పనేమిటి? వైకాపా కార్యకర్తల్లా పని చేయాలి. ఎన్నికల నిర్వహణ బాధ్యతలు మోయాలి.
అయితే స్థానిక ఎన్నికల సందర్భంగా వాలంటీర్ల మితిమీరిన జోక్యంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఒక దశలో వాలంటీర్ల జోక్యాన్ని అప్పటి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సీరియస్ గా తీసుకున్నారు. వారి ఫోన్లను సైతం స్వాధీనం చేసుకున్నారు. తరువాత బద్వేలు, తిరుపతి ఎన్నికలలో కూడా వారి తీరు, శైలి వివాదాస్పదం అయ్యింది. 
వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో పబ్బం గడిచేతి వారి చలువతోనే అని జగన్ నమ్మతున్న నేపధ్యంలో గతంలో వారి ప్రమేయాన్ని సీరియస్ గా తీసుకున్న ఎన్నికల సంఘం ఈ సారి ఊరుకుంటుందా? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి.  

By
en-us Political News

  
ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ ను బయటకు పంపాలని ఆప్ నేత సంజయ్ సింగ్ డిమాండ్ చేశారు. ఢిల్లీ ఎన్నికలో బిజెపికి లాభం చేకూరే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.  కాంగ్రెస్ నేత అజయ్ మాకెన్ బిజెపిని బలపరిచే విధంగా మాట్లాడారని ఆయన ఆరోపించారు.
వైసీపీ హయాంలో మంచి చెడ్డలు, తప్పొప్పులతో పని లేకుండా జగన్ కు వ్యతిరేకం అని భావించిన వాళ్ల కోసం జైళ్లు నోళ్లు తెరిచేవి. పోలీసుల జులం స్వాగతం పలికేది. అర్థరాత్రి, అపరాత్రి అన్న తేడా లేకుండా తెలుగుదేశం నేతలు, కార్యకర్తలను పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసే వారు. నోటీసుల మాటే లేదు. అనుకుంటే జైల్లో తోసేయడమేనన్నట్లుగా పరిస్థితి ఉండేది.
కామారెడ్డిలో  జిల్లాలో  ఎస్ఐ సాయికుమార్ , కానిస్టేబుల్ శృతి  , కంప్యూటర్ ఆపరేటర్  నిఖిల్  సదాశివనగర్ చెరువులో  దూకి ఆత్మహత్య చేసుకోవడం కలకలం సృష్టిస్తోంది. ఎస్ ఐ, కానిస్టేబుల్ మధ్య అక్రమ సంబంధం ఉందని వార్తలు వస్తున్నాయి
ఎఫ్ డిసి చైర్మన్ దిల్ రాజు నేతృత్వంలో సినీ ప్రముఖులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు.అల్లు అర్జున్ వివాదం నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో బెనిఫిట్స్ షో రద్దు చేస్తున్నట్టు, టికెట్ల పెంపు నేనున్నంతవరకు ఉండవని   ప్రకటించడంతో చిత్రపరిశ్రమ ఒక్క సారిగా ఉలిక్కిపడింది
జర్నలిస్టుపై దాడి కేసులో హైకోర్టు ముందస్తు బెయిలు నిరాకరించడంతో నటుడు మోహన్ బాబు అజ్ణాతంలోకి వెళ్లిపోయారని ప్రచారం జరుగుతోంది. ఆయన ఎక్కడ ఉన్నారన్న సమాచారం లేదని పోలీసులు సైతం చెబుతున్నారు.
అల్లు అర్జున్ అరెస్టు తదననంతర పరిణామాలతో తెలంగాణ ప్రభుత్వానికీ, సినీ పరిశ్రమకు మధ్య ఏర్పడిన అగాధాన్ని పూడ్చడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఎఫ్ డీసీ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో నిర్మాత దిల్ రాజు ఆధ్వర్యంలో కొందరు సినీ ప్రముఖులు గురువారం ( డిసెంబర్ 26) ముఖ్యమంత్రి రేవంత్ తో భేటీ కానున్నారు.
భారత తపాలా శాఖ బుక్ పోస్టు సర్వీసులను రద్దు చేసింది. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా బుక్ పోస్టు సర్వీసులను తపాలా శాఖ రద్దు చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. గురువారం (డిసెంబర్ 26) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో కంపార్ట్ మెంట్లన్నీ నిండిపోయి భక్తుల క్యూలైన్ ఎంబీసీ వరకూ సాగింది.
ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పరిస్థితి చూస్తే ఎవరికీ అయ్యో పాపం అని కూడా అనాలని అనిపించదు. ఎందుకంటే గతంలో ఓబుళాపురం మైనింగ్ కేసులో శ్రీలక్ష్మి జైలుకు వెళ్లారు. జగన్ క్విడ్ ప్రొకో కేసులలో విచారణను ఎదుర్కొన్నారు. ఆ అరెస్టులు, విచారణల ఒత్తిడి కారణంగా తీవ్ర అనారోగ్యానికి గురై చాలా కాలం వీల్ చైర్ కే పరిమితమయ్యారు.
అల్లు అర్జున్ తన సినీమాలు వరుస విజయాలు అందుకుంటుండటంతో ఆయన యాటిట్యూడ్ మారిందన్న విమర్శలు గత కొంత కాలంగా వినిపిస్తూనే ఉన్నాయి. అయితే.. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఆయన నంద్యాలలో వైసీపీ అభ్యర్థికి మద్దతుగా ప్రచారం చేయడం మాత్రం పెను వివాదానికి దారి తీసింది.
ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత ఆలయాల పవిత్రత పరిరక్షణపై ప్రత్యేక దృష్టి సారించింది. జగన్ హయాంలో రాష్ట్రంలో ఆలయాలపై జరిగిన దాడులు, జరిగిన అపచారాల సంగతి తెలిసిందే. సాక్షాత్తూ కలియుగ వైకుఠం అనే తరుమలలోనే పవిత్రతకు భంగం వాటిల్లే సంఘటనలు చోటు చేసుకున్నాయి.
మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మౌనం ప్రస్తుతం రాజకీయవర్గాలలో చర్చనీయాంశంగా మారింది. గతంలో అంటే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలోనూ, అధికారం కోల్పోయిన తరువాత ఆయన జనసేన గూటికి చేరేంత వరకూ కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి నిత్యం వార్తల్లో నిలిచేవారు. ఆయన మాట్లాడితే ఒక సంచలనం అన్నట్లుగా పరిస్థితులు ఉండేవి.
తెలంగాణలో రాజకీయ ప్రకంపనలు రేపుతున్న ఫార్ములా ఈ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కు నోటీసులు జారీ కానున్నాయి. ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు ఇప్పటికే ఐఏఎస్ అధికారి దాన కిశోర్ ను విచారించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.