ఏ బిడ్డా ఇది నా అడ్డా అనగలవా జగన్?.. పులివెందుల నడిబొడ్డున బాబు సవాల్

Publish Date:Aug 5, 2023

Advertisement

పులివెందుల.. ఈ పేరు చెబితే చాలు ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న ఎవ‌రైనా వైఎస్ఆర్‌ కుటుంబానికి కంచుకోట అని ఠక్కున చెప్పేస్తారు.. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి ఆ నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల అండ‌దండ‌ల‌తో రాష్ట్ర రాజ‌కీయాల‌ను శాసించారు. వైఎస్ కుటుంబం ఏం చెబితే అక్క‌డి మెజార్టీ ప్ర‌జలు అదే ఫాలోఅయ్యేవారు. వైఎస్ఆర్ మృతి త‌రువాత కూడా వై.ఎస్‌. జ‌గ‌న్‌కు పులివెందుల ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు.

భారీ మెజార్టీతో అసెంబ్లీకి పంపించి సీఎంను చేశారు. వైఎస్ఆర్ బంతికున్న స‌మ‌యంలో పులివెందుల‌లో ప్ర‌తిప‌క్ష‌పార్టీల నేత‌లు అడుగుపెట్టి గ‌ర్జిద్దామ‌న్నా అక్క‌డి ప్రజ‌ల నుంచి స్పంద‌న క‌రవ‌య్యేది. దీంతో కుప్పం నియోజ‌క‌వ‌ర్గం చంద్ర‌బాబుకు ఎలాగో..   పులివెందుల ప్ర‌జ‌లు వైఎస్ఆర్ కుటుంబానికి అలా అండ‌గా నిలుస్తూ వ‌స్తున్నారు. అయితే  ప్ర‌స్తుతం పులివెందుల‌లో ప‌రిస్థితులు మారుతున్నాయి. ఇందుకు నిద‌ర్శనం తెలుగుదేశం అధినేత చంద్ర‌బాబు పులివెందుల వెళ్లి సింహ‌గ‌ర్జ‌న చేయ‌డ‌మే. వైసీపీ శ్రేణుల్లో ఇన్నాళ్లూ ఒక గ‌ట్టి న‌మ్మ‌కం ఉండేది. చంద్ర‌బాబు రాష్ట్రంలో ఎక్క‌డికివెళ్లినా ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న వ‌స్తుందేమో కానీ..   జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి అడ్డా పులివెందుల వెళితే ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌నే భావ‌న‌లో ఉండేవారు. అయితే, రెండు రోజుల క్రితం చంద్ర‌బాబుకు పులివెందుల‌ ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్ట‌డంతో  వైసీపీ శ్రేణుల నమ్మకం పటాపంచలైపోయింది. వారి వెన్నులో వణుకు పుట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

చంద్ర‌బాబు, వైఎస్ రాజశేఖరరెడ్డిల రాజ‌కీయాలు వేరుగా ఉండేవి. చంద్ర‌బాబుకు కుప్పం నియోజ‌క‌వ‌ర్గం కంచుకోట‌గా ఉండ‌గా.. రాజ‌శేఖ‌ర‌రెడ్డికి పులివెందుల కంచుకోట‌గా ఉంది. వీరిద్ద‌రూ ప్ర‌త్య‌ర్థులైన‌ప్ప‌టికీ ఒక‌రి నియోజ‌క‌వ‌ర్గంలో మ‌రొక‌రు ఆధిప‌త్యం చెలాయించాల‌ని ఎప్పుడూ చూడ‌లేదు. ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి మాత్రం చంద్ర‌బాబు నియోజ‌క‌వ‌ర్గం కుప్పంలో వైసీపీ జెండా ఎగురేస్తామంటూ ప్ర‌క‌ట‌నలు చేస్తూ వ‌స్తున్నారు. దీనికి తోడు కుప్పంలో చంద్ర‌బాబు ప‌ర్య‌టించిన స‌మ‌యంలో అనేక అడ్డంకులు సైతం సృష్టించారు. కానీ  ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తుంటే కుప్పంలో చంద్ర‌బాబు ఓడిపోవ‌టం అలా ఉంచితే.. పులివెందుల‌లో జ‌గ‌న్ ప‌రువు పోయే ప‌రిస్థితి ఏర్ప‌డిందని పరిశీలకులు అంటున్నారు.

  జ‌గ‌న్ వ్యూహం రివర్స్ అయ్యిందని విశ్లేషిస్తున్నారు.  చంద్ర‌బాబు పులివెందుల నియోజ‌క‌వ‌ర్గంలో కాలుమోప‌డ‌మే త‌రువాయి అక్క‌డి ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. దీనికితోడు చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌ను అడ్డుకోవాల‌ని చూసిన వైసీపీ శ్రేణుల‌ను త‌రిమి కొట్టారు. ఈ విచిత్ర ప‌రిస్థితి చూసి ఇది పులివెందుల నియోజ‌క‌వ‌ర్గ‌మేనా అనే అనుమానం విశ్లేష‌కుల నుంచిసైతం వ్య‌క్త‌మ‌వుతోంది. చంద్ర‌బాబుకు పూలుప‌రిచి పులివెందుల ప్ర‌జ‌లు స్వాగ‌తం ప‌ల‌క‌డంతో పాటు, చంద్ర‌బాబు మాట్లాడే ప్ర‌తీ మాట‌కు హ‌ర్ష‌ధ్వానాలు చేశారు. దీంతో పులివెందుల ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకు ప‌లికిన స్వాగ‌తాన్ని చూసి వైసీపీ శ్రేణులు వ‌ణికిపోతున్నాయని ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి.  

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిపై పులివెందుల ప్ర‌జ‌ల్లో రోజురోజుకు ఆద‌ర‌ణ త‌గ్గిపోవ‌డానికి ప‌లు కార‌ణాల‌ను విశ్లేషకులు తెర‌పైకి తెస్తున్నారు. వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ప్ర‌తిప‌క్షంలో, సీఎంగా ఉన్న స‌మ‌యంలోనూ పులివెందులకు ఎప్పుడో ఒక‌సారి వ‌చ్చేవారు. అక్క‌డ రాజ‌కీయాల‌న్నీ ఆయ‌న సోద‌రుడు వివేకానంద‌రెడ్డి చూసుకుంటూ ఉండేవారు. నియోజ‌క‌వ‌ర్గంలో ఎవ‌రికి ఏ చిన్న స‌మ‌స్య వ‌చ్చినా వివేకానందరెడ్డే ప‌రిష్క‌రించేవారు. ఏదైనా పెద్ద స‌మ‌స్య అయితేనే వైఎస్ఆర్ వ‌ర‌కు వ‌చ్చేది. దీనికి తోడు పులివెందుల నుంచి త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన‌వారికి రాజ‌శేఖ‌ర‌రెడ్డి స‌మ‌యం కేటాయించి వారి స‌మ‌స్య‌ల‌ను వినేవారు.

వారి స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించేలా చూసేవారు. దీంతో పులివెందుల ప్ర‌జ‌ల‌కు వైఎస్ఆర్ అన్నా.. వివేకానంద రెడ్డి అన్నా ఎన‌లేని అభిమానం. వైఎస్ఆర్ మ‌ర‌ణం త‌రువాత జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డిపై సైతం పులివెందుల ప్ర‌జ‌లు అంతే అభిమానాన్ని చూపుతూ వ‌చ్చారు. అయితే, ఈ నాలుగేళ్ల కాలంలోజ‌గ‌న్ త‌మ‌ను ప‌ట్టించుకోలేద‌న్న భావన అక్క‌డ ప్ర‌జ‌ల నుంచి వ్య‌క్త‌మ‌వుతోంది. దీనికితోడు పులివెందుల ప్ర‌జ‌ల‌కు జగన్ ద‌ర్శ‌న‌భాగ్య‌మే క‌రువ‌వుతోంద‌ట‌. ఒక‌వేళ జ‌గ‌న్‌ను క‌లిసేందుకు వెళ్లినా అవ‌కాశం ద‌క్క‌డం లేద‌ట‌. దీంతో రోజురోజుకు జ‌గ‌న్ అంటే అక్క‌డి ప్ర‌జ‌లు చీద‌రించుకొనే ప‌రిస్థితులు ఏర్ప‌డిన‌ట్లు స్థానికంగా ప్ర‌చారం జ‌రుగుతుంది. 

చంద్ర‌బాబుకు పులివెందుల‌లో అద్భుత ఆద‌ర‌ణ ల‌భించ‌డానికి మ‌రోకార‌ణం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. అదే.. వివేకానంద‌రెడ్డి హ‌త్య‌. వివేకా హ‌త్య‌కేసు విచార‌ణ‌లో సీఎం జ‌గ‌న్ తీరు పులివెందుల ప్ర‌జ‌లకు ఆగ్ర‌హాన్ని కలిగిస్తోందని చెబుతున్నారు. వివేకాను  అవినాశ్ రెడ్డి హ‌త్య‌చేశాడ‌ని రాష్ట్రం మొత్తం కోడైకూస్తున్నా జ‌గ‌న్ మాత్రం ఆయ‌న్ను కాపాడుకుంటూ వ‌స్తున్నార‌న్న విమ‌ర్శ‌లు ఉన్నాయి. దీనికితోడు వివేకా కుమార్తెను దూరం పెట్ట‌డం, సొంత చెల్లి ష‌ర్మిల‌ను దూరం పెట్ట‌డం కూడా పులివెందుల ప్ర‌జ‌ల్లో జ‌గ‌న్ ప‌ట్ల వ్య‌తిరేక భావం  నెల‌కొనడానికి కారణమని పరిశీలకులు చెబుతున్నారు. సీఎంగా ఉండి, కేంద్ర ప్ర‌భుత్వం అండ‌దండ‌లు పుష్క‌లంగా ఉన్న‌ప్ప‌టికీ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి సొంత బాబుయిని హ‌త్య‌ చేసిన నిందితుల‌ను క‌ట‌క‌టాల్లోకి పంపించ‌లేక పోయాడ‌ని, ఇక మ‌న‌కేం న్యాయం చేస్తాడ‌నే భావ‌న‌కు పులివెందుల‌లోని మెజార్టీ ప్ర‌జ‌లు వ‌చ్చారంటున్నారు. ఇదే ప‌రిస్థితి ఎన్నిక‌ల వ‌ర‌కు కొన‌సాగితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పులివెందుల‌లో టీడీపీ జెండా ఎగిరినా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన అవ‌స‌రం లేద‌ని అంటున్నారు.

By
en-us Political News

  
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
స్థానిక ప్రజా సమస్యలను తనదైన శైలిలో పరిష్కరిస్తూ జనాల గుండెల్లో కొలువయ్యారు. అన్నిటికీ మించి మంగళగిరిలో నెలకొన్న అతి కీలకమైన, ప్రధానమైన   గృహ నిర్మాణ హక్కుల (హౌసింగ్ డాక్యుమెంటేషన్) పత్రాల సమస్యకు దశలవారీగా శాశ్వతంగా పరిష్కరిస్తున్నారు.
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్..!
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.