రాజకీయ వైకుంఠపాళీలో దిగజారిన జగన్

Publish Date:Jul 9, 2022

Advertisement

ఏద‌యినా శుభ‌కార్యం ఆనందోత్సాహాల‌తోనే ఆరంభ‌మ‌వుతుంది, ముగుస్తుంది. సినిమా ఆరంభం, పార్టీ ఆరంభం, సెంచ‌రీ కొట్టిన సినిమా ఉత్స‌వం, ప‌దేళ్ల త‌ర్వాత పార్టీ విజ‌యాలు నెమ‌రేసుకునే కార్య‌క్ర‌మం.. ఇలా అన్నీ హ్యాపీ నోట్‌తోనే జ‌రుగుతాయి. కానీ, క‌నీవినీ ఎరుగ‌ని రీతిలో వైసీపీ ప్లీన‌రీ పాత సినిమాలోలా ఏడుపు స‌న్నివేశంతోనే ఆరంభ‌మ‌యింది. అదీ పార్టీ అధినేత ఆంధ్ర‌ప్ర‌దేశ్  ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి, ఆయ‌న త‌ల్లి విజ‌య‌ల‌క్ష్మికి గౌర‌వ అధక్షురాల‌న్న ప‌ద‌వి నుంచి దించేసిన ఘ‌ట్టంతో ప్లీన‌రీకి వ‌చ్చిన వారు పైకీ, కొందరూ లోలోప‌ల  ఇంకొందరు బాధ‌ప‌డ్డారు. కానీ ప్ర‌జ‌లు, విప‌క్షాలు మాత్రం ఈ మొత్తం హ‌డావుడితో వైసీపీ నిజ‌రూపం బ‌య‌ట‌ప‌డింద‌ని అంటున్నారు. త‌ల్లితో రాజీనామా చేయ‌డం పార్టీలో రాజీనామాల శ‌కం ఆరంభానికి నాందిగా విశ్లేష‌కులు అంటున్నారు. 
వై.ఎస్ మ‌ర‌ణానంత‌రం  జ‌గ‌న్ వైసీపీ పార్టీ తో ప్ర‌జ‌ల్ని ఆక‌ట్టుకుని ప్ర‌జారంజ‌కంగా ప‌రిపాలిస్తారని అంద‌రూ అనుకున్నారు. కానీ జ‌గ‌న్ పాద‌యాత్ర‌లు, ప్ర‌చారాల హ‌డావుడిలో చెప్పిన‌వ‌న్నీ  గాలికి వ‌దిలేశారు. త‌న ప‌ద‌విని కాపాడుకోవ‌డం కోసం త‌ల్లిని గౌర‌వ అధ్య‌క్షురాలిని చేసి పార్టీ వీరాభిమానుల అండతో  అధికార అందలం అందుకున్నారు.  అయితే మాట‌లు చెప్పి పాల‌న సాగించ‌డం ఆట్టే కాలం సాగ‌దు. విప‌క్షాల మీద ఎగిరిప‌డ‌టం, అనుభ‌వ‌రాహిత్యంతో క‌బుర్లు చెప్పి, ప‌థ‌కాల పేరుతో అన్ని వ‌ర్గాల‌వారినీ ఆక‌ట్టుకోవ‌డానికి చేసిన యత్నాలు ఆట్లే కాలం ఫలితాలనివ్వడు.

 క్ర‌మేపీ జ‌గ‌న్ తంత్రాల‌న్నీ బెడ‌సికొట్టాయి. అన్ని త‌న‌ను కాపాడుకునే మార్గాలకు మెట్లు వేసుకోవడమే త‌ప్ప  ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల‌ను, సంక్షేమాన్ని ప‌ట్టించుకునే త‌త్వం ఆయ‌న‌లో లేద‌న్న‌ది అర్ధ‌మ‌యింది. మూడేళ్ల పాల‌న ముగిశాక చేసిన‌ దేమిటి, జ‌రిగిన‌దేమిటి అని పార్టీ వ‌ర్గాలే బేరీజు వేసుకునే పరిస్థితి వచ్చింది.  పార్టీలోనూ, బ‌య‌టా వారికి  గౌర‌వం సన్న‌గిల్లింద‌ని, జీ హుజూర్ అంటూ బ‌త‌కాల్సి వ‌స్తుంద‌న్న అనుమానాలు పెనుభూతాలై వెంటాడాయి. దీంతో విసిగెత్తిన‌వారంతా త‌మ త‌మ నియోజ‌క‌వ‌ర్గాల్లో ఒక‌రితో ఒక‌రు పోటీ పేరుతో కొట్లాట‌కు, విభేదాల‌కు బాటలు వేసుకున్నారు.  

షర్మిలమ్మ 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేసి గొంతు పోయేలా అన్న కోసం మాట్లాడారు, కానీ ఇప్పుడు తండ్రి సమాధి దగ్గర అన్న తనకు అన్యాయం చేశాడంటూ మౌనంగా రోదిస్తున్నారు.  పార్టీని అడ్డు పెట్టుకుని స్వ‌యం వృద్ధిని ఆశించిన జ‌గ‌న్ క్ర‌మేపీ చెల్లి ష‌ర్మిల‌ను దూరం చేశారు. అన్న త‌న తండ్రిలా ప‌రిపాలిస్తాడ‌ని తండ్రి మాట‌, బాట‌, ప్ర‌తిష్ట‌ను కాపాడ‌తాడ‌ని అనుకున్న ష‌ర్మిల విసిగెత్తి మరో  తెలుగు రాష్ట్రం తెలంగాణాకు వలస వెళ్లిపోయారు. అక్క‌డ వేరే పార్టీ పెట్టి నిల‌దొక్కుకోవాల‌ని ప్రయత్నిస్తున్నారు.  ఇప్పుడు తల్లిదీ అదేబాట. కరివేపాకు చందంగా జగన్ పార్టీలో కొనసాగడం ఇష్టం లేని జగన్మాత.. జగన్ కోరిక మేరకే అయినా తన గౌరవానికి భంగం వాటిల్లకుండా  వైదొలగారు.

తల్లీ చెల్నిని దూరం చేసుకోవడానికి క్షణమైనా ఆలోచించని జగన్ ఇక పార్టీ, రాష్ట్రం సంక్షేమం, శ్రేయస్సు కోసం ఎలా ఆలోచిస్తారని పార్టీ శ్రేణులో అంతర్గత సంభాషణల్లో చర్చలు లేవదీస్తున్నాయి.  ప్రజల్లో పెచ్చరిల్లుతున్న అసమ్మతి, అసంతృప్తి, ఆగ్రహం జగన్ దృష్టికి వెళ్లలేదని అనుకోలేం. అలాగే పార్టీలో పెచ్చరిల్లుతున్న అసమ్మతి కూడా జగన్ కు తెలిసే ఉంటుంది. అందుకే అధికారం, పార్టీలో పెత్తనం రెండూ ఒకే సారి జారిపోతాయన్న భయంతోనే.. తల్లి విజయమ్మకు పార్టీతో అంటీముట్టనట్టుగా  ఉన్న సంబంధాలను కూడా తెంచాశారని విశ్లేషకులు అంటున్నారు.

అదే సమయంలో భవిష్యత్ లో ఎవరూ కూడా పార్టీలో తన నాయకత్వాన్ని ప్రశ్నించే అవకాశం ఇవ్వకుండా ఉండేందుకే శాశ్వతంగా అధ్యక్షుడిగా కొనసాగేలా పార్టీ బైలాస్ ను సవరించి మరీ ప్లీనరీ వేదికగా తీర్మానాన్ని ఆమోదింప చేసుకున్నారు.తల్లీ, చెల్లి పట్ల జగన్ వ్యవహరించిన తీరును గమనించిన  పార్టీ నేతల్లో తమ భవిష్యత్ పట్ల బెదురు ఆరంభమైంది. కొద్ది కొద్దిగానైనా.. జగన్ విధానాల పట్ల పార్టీ నేతల్లో పెరుగుతున్న ధిక్కారం. కొందరైతే అప్పుడే పక్క చూపులు చూస్తున్నారనీ పరిశీలకులు అంటున్నారు. ఎన్నికల సమయానికి జగన్ పార్టీకి బాయ్ బాయ్ చెప్పే నేతల సంఖ్య గణనీయంగానే ఉంటుందన్న విశ్లేషణలూ చేస్తున్నారు. తాను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న చందంగా జగన్ అధికారం చేపట్టిన మూడేళ్లలోనే అటు ప్రజల.. ఇటు కుటుంబ సభ్యుల విశ్వాసం కోల్పోయే పరిస్థితి కొని తెచ్చుకున్నారని అంటున్నారు.  ప్లీనరీ వేదికగా విజయమ్మ రాజీనామా ప్రకటనే ఇందుకు నిదర్శనమంటున్నారు.  

By
en-us Political News

  
స్థానిక  సన్నాహాలపై తెలుగుదేశం కూటమికి చెందిన దాదాపు 45 వేల మంది ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు,  కార్యకర్తలతో  సీఎం చంద్రబాబు ఈ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీపై చంద్ర నిప్పులు చెరిగారు.
కర్ణాటక ఎమ్మెల్సీ ఎన్నికల్లో 4-0తో ఎన్డీఏ క్లీన్ స్వీప్.!
జగన్‌ తాను మళ్లీ  అధికారంలోకి వస్తానంటూ జగన్ 2.o అంటూ చేసిన వ్యాఖ్యలకు పవన్ కల్యాణ్ మేం 10x చూపిస్తామంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.  తెలుగుదేశం కూటమి ప్రభుత్వ విధానాలను విమర్శిస్తూ జగన్ చేసిన హెచ్చరికలకు పవన్ కల్యాణ్  దీటుగా ఇచ్చిన స్ట్రాంగ్ కౌంటర్ పొలిటికల్ సర్కిల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ కూడా పెద్ద ఎత్తున చర్చకు తెరలేపింది.  
పులివెందుల నియోజకవర్గ పరిధిలో కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. దశాబ్దాల కాలంగా ఎలాంటి ప్రతిఘటన లేకుండా ఏకపక్షంగా జగన్ కు పట్టుఉన్న నియోజకవర్గం పులివెందుల. అటువంటి పులివెందులలో ఎంపీటీసి జడ్పీటీసి స్థానాలను టీడీపీ  ఏకగ్రీవంగా కైవసం చేసుకుంది.
2019 ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన తర్వాత   శైలిని ఒకింత మార్చుకున్నారు. 2024 ఎన్నికల ముందు వరకూ ఆయన పార్టీ నేతలు నోటి దురుసు ప్రదర్శించడాన్ని ప్రోత్సహించారు కానీ, స్వయంగా తాను ఒకింత సహనం చూపారు. అంత మాత్రాన రాజకీయ విలువలతో మృదు విమర్శలు చేశారని కాదు కానీ, అధికారంలోకి రావడానికి ముందున్నంత దూకుడు లేదని చెప్పాల్సి ఉంటుంది.
వైయస్ జగన్ ఇలాకాలో టీడీపీ 40 ఏళ్ళ చరిత్రను తిరగాసింది.
రాజకీయ కక్షలను పక్కనపెట్టి, రాష్ట్రాభివృద్ధి, స్థానిక స్వపరిపాలన బలపడే దిశగా అన్ని పార్టీలు అడుగులు వేయాలి. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పారదర్శకమైన ఎన్నికలను నిర్వహించడమే ఏ ప్రభుత్వానికైనా, వ్యవస్థకైనా అసలైన పరీక్షగా నిలుస్తుంది.
గతంలో స్థానిక ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న దౌర్జన్యాలు, హింసాత్మక ఘటనలకు సంబంధించిన వీడియోలను ప్రదర్శించి, నాడు జగన్ హయాంలో అరాచకం ఏ రకంగా స్వేరవిహారం చేసిందో చూపి మరీ ఆ పార్టీ తీరును దుయ్యబట్టారు.  
వందలాది మంది కొత్త వ్యక్తులు వస్తే తనకు  ప్రాణహాని ఉందని, కెమెరాలు, ఫోటోలతో ఇంటి భద్రత బయటపడుతుందని జగన్  షర్మిల కుమార్తె వివాహం ఎలహంక ప్యాలెస్ లో వద్దనడానికి కారణంగా తన లేఖలో పేర్కొన్నారు. అయితే దీనికి వైఎస్ కుటుంబ సభ్యులు, షర్మిల కుటుంబం తప్పుపడుతోంది. ఈ నేపథ్యంలో   షర్మిల కుటుంబ సభ్యులు జగన్ కు సంధించిన లేఖాస్త్రంలో  వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన కుటుంబ వేడుకలను ప్రస్తావిస్తూ.. జగన్ ను వైఎస్సార్ కంటే గొప్పవాడివా అంటూ నిలదీశారు.
అధికారిక భేటీ ముసుగులో జరిగిన ఈ గోప్యతా ఉల్లంఘన ఉదంతం ఒక్కసారిగా రాష్ట్రంలో పొలిటికల్ హీట్ ను పెంచేసింది. ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో డీకే శివకుమార్ ఈ అంశానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
జడ్పీ చైర్మన్ కావాలంటే ముందుగా జెడ్పీటీసీగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే కదిరి నియోజకవర్గంలోని నల్ల చెరువు జెడ్పీటీసీ స్థానంలో పరిటాల రవి నామినేషన్ వేయనున్నారు.  పరిటాల శ్రీరామ్  విజయం కోసం క్షేత్రస్థాయిలో పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తూ భారీ విజయంపై తెలుగుదేశం కన్నేసింది.  
అధినేత జగన్ ప్రెస్ మీట్ పెట్టి మరీ గతంలోనే ఏపీలో స్థానిక ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగదని జోస్యం చెప్పారు.  అల్లర్లు జరుగుతాయని హెచ్చరికలు జారీ చేశారు. చివరకు ఆయన అన్నట్లుగానే జరిగింది. అల్లర్లకు కారణం ఎవరన్నది పక్కన పెడితే.. వైసీపీ సుప్రీం కోర్టుకు వెళ్లి మరీ మునిసిపోల్స్ కు రీ షెడ్యూల్ సాధించింది.
అధికారికంగా ఇటు షర్మిల కానీ, అటు జగన్ కానీ వివాహ వేడుక బెంగళూరు ప్యాలెస్ విషయంపై మాట్లాడలేదు. అయితే మీడియా కథనాల ఆధారంగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని మాత్రం తగుదునమ్మా అంటూ మీడియా ముందుకు వచ్చి.. జగన్ నివాసం ఉంటున్న బెంగళూరు ప్యాలెస్ ఫంక్షన్ హాలేమీ కాదు.. పెళ్లిళ్లకు వేదికగా ఇవ్వడానికి అంటూ వ్యాఖ్యలు చేశారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.