మరోసారి ఢిల్లీకి జగన్.. రెండు రోజుల మకాం వెనక మతలబేంటి?

Publish Date:Jul 2, 2023

Advertisement

సీఎం జగన్ మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు అక్కడే మకాం వేయనున్నారు. ఈ మేరకు జగన్ ఢిల్లీ పర్యటన ఖరారైంది. ఈ నెల 5, 6 తేదీల్లో సీఎం జగన్ ఢిల్లీలో ఉండనున్నారు. ప్రధాని నరేంద్ర మోడీతో పాటు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోనూ సీఎం జగన్ సమావేశం కానున్నారు. 5వ తేదీ రాత్రికి మోడీ, అమిత్ షాతో సీఎం భేటీ ఖరారు అయినట్లు తెలుస్తోండగా.. ఆలస్యం అయితే 6వ తేదీ సమావేశం కానున్నారు. వీరితో పాటు ఢిల్లీలో మరికొందరు పెద్దలతో కూడా భేటీ కానున్నారు. ఇప్పటికే ప్రభుత్వ వర్గాలు, వైసీపీ నేతలు ఈ భేటీ గురించి ప్రచారం కూడా మొదలు పెట్టారు. పెండింగ్ సమస్యల పరిష్కారానికి, పోలవరం అడహక్ నిధులకు సంబంధించిన అంశాలపై సీఎం జగన్ కేంద్రం వద్దకు వెళ్తున్నారని చెప్తున్నారు. 

అయితే, ఒకవైపు రాష్ట్రంలో, కేంద్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో సీఎం జగన్ ఢిల్లీ పర్యటన ఆసక్తికరంగా మారుతోంది. 2019 ఎన్నికల ముందు నుండే సీఎం జగన్ బీజేపీతో సఖ్యత పెంచుకున్నారు. ఇక సీఎం అయ్యాక మొదలు ఇప్పటి వరకు కేంద్రంలో తన అవసరం ఉన్నా లేకపోయినా.. బీజేపీ అడిగినా అడగకపోయినా బీజేపీ ప్రభుత్వానికి ప్రతి అంశంలోనూ మద్దతు ఇచ్చారు. అయితే, అప్పుడు పరిస్థితి వేరు.  ఇది ఎన్నికల సమయం. ఎవరికి వారికి ఇప్పుడు సొంత ఎజెండా  తప్పదు. దీంతో మొన్నటి వరకు వైసీపీ ప్రభుత్వానికి నొప్పి కలిగేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయని బీజేపీ పెద్దలు ఈ మధ్య టోన్ మార్చారు. 

తాజాగా ఏపీకి వచ్చిన అమిత్ షా జగన్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో ప్రభుత్వ అవినీతి పెచ్చుమీరిందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఏపీలో అన్నీ అక్రమాలే అంటూ దుయ్యబెట్టారు. జగన్ ప్రభుత్వంపై అమిత్ షా ఘాటు విమర్శల అనంతరం ఇప్పుడు తొలిసారి సీఎం జగన్ అమిత్ షా వద్దకు వెళ్లనున్నారు. మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీతో జగన్ భేటీ అయి కూడా చాలా కాలం అయింది. ఆ మధ్య ఒకసారి కలుస్తారని ప్రచారం జరిగినా ఎందుకో అప్పుడు అది కుదరలేదు. మోడీ సైతం జూలైలో ఏపీకి వస్తారని, ఇక్కడ బహిరంగ సభ కూడా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఈసారి కలయిక మీద చాలానే చర్చ సాగుతోంది.  ప్రస్తుత పరిస్థితిలో  జగన్ ప్రధానితో భేటీ కావడాన్ని రాజకీయంగా కీలకమైన పరిణామంగానే చూడాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   

ఏపీ రాజకీయాలలో ఎన్నికల హీట్ ఎప్పుడో మొదలైంది. ఒక వైపు వైసీపీ వై నాట్ 175 అంటూ తన సంక్షేమం మీదనే ఆశలు పెట్టుకొని జగన్ బ్రాండ్ ఉపయోగించుకుని మరోసారి అధికారం దక్కించుకోవాలని ఆరాటపడుతుండగా.. రాష్ట్రంలో కుంటుపడిన అభివృద్ధి, సీఎంగా జగన్ చేసిన అప్పులు,తప్పులు,  రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పరంగా ఇబ్బందులను ప్రజలలోకి బలంగా తీసుకెళ్లి తాము గద్దెనెక్కాలని ప్రతిపక్షాలు ఇప్పటికే వార్ మొదలు పెట్టాయి. మరో వైపు రాష్ట్రంలో పార్టీల మధ్య పొత్తులపై కూడా తీవ్ర ప్రచారం జరుగుతున్నది. టీడీపీ-జనసేన మధ్య దాదాపుగా పొత్తు ఖరారైందనీ, బీజేపీ కూడా కలిసే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలలో చర్చలు సాగుతున్నాయి. వైసీపీ ఒంటరైతే విజయానికి దూరమైనట్లేనని భావిస్తున్నారు. ఇలాంటి సమయంలో జగన్ ఇప్పుడు బీజేపీ పెద్దలతో భేటీ కావడం  ఆసక్తికరంగా మారింది.

మరోవైపు జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకేసులో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నది. అత్యవసరంగా ఈ కేసు విచారణ పూర్తి చేయాలని కూడా సీబీఐని ఆదేశించింది. ఈ కేసులో వైసీపీ ఎంపీ, జగన్ సోదరుడు అవినాష్  బెయిల్ మీద ఉన్నారు. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి ఇప్పటికే జైల్లో ఉన్నారు. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో కూడా కదలిక మొదలైంది. దీంతో ఎన్నికల ముందు ఈ రెండు కేసులు వైసీపీకి తలపోటుగా మారనున్నాయనే ఊహాగానాలు కూడా మొదలవగా.. ఇప్పటికిప్పుడు జగన్ ఢిల్లీ పర్యటనకు బయల్దేరనుండడం పలు ఊహాగానాలకు తావిస్తుంది. మరి ఈ రెండు రోజుల పర్యటన వెనుక మతలబేంటో.. ప్రధాని, అమిత్ షాలతో భేటీ వెనుక ఆంతర్యమేమిటో అన్నచర్చ జోరుగా సాగుతోంది.

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.