ఏపీలో బీజేపీ తెరవెనుక వ్యూహం?

Publish Date:Jul 2, 2023

Advertisement

రానున్న ఎన్నికలలో ఏపీలో ప్రతిపక్షాల మధ్య పొత్తు ఉంటుందా? ప్రధాన పార్టీ టీడీపీతో జనసేన కలిసే ఎన్నికలకు వెళ్తుందా? లేక గత ఎన్నికల మాదిరి విడిగానే బరిలో దిగుతారా? టీడీపీతో పొత్తు ఉంటుందని పవన్ కళ్యాణ్ చాలాకాలం క్రితమే చెప్పేసినా ఈ మధ్య కాలంలో ఆయన ప్రసంగాలలో మాటలు ఎందుకు మారాయి? ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ టీడీపీ-జనసేన పొత్తులో కూడా ఉంటుందా? లేక జనసేనతో తెగదెంపులు చేసుకొని ఒంటరిగా పోటీచేస్తుందా? ఇదే ఇప్పుడు ఏపీలో ఎక్కడ నలుగురు చేరినా జరుగుతున్న చర్చ. నిజానికి టీడీపీ-జనసేన-బీజేపీ పొత్తు ఉంటుందని దాదాపుగా రాజకీయాలలో ఖరారైన అంశమే కాగా ఎందుకో.. ఎక్కడో జనసేన, బీజేపీ కదలికలు చూస్తే అనుమానించక తప్పట్లేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. అందులో కూడా ప్రధానంగా బీజేపీ రాజకీయాల గురించి చూస్తే ఈ అనుమానానికి మరింత బలం చేకూరుతుంది.

ఎన్నికలలో ప్రభుత్వ అనుకూల ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని రెండు భాగాలుగా విభజించుకోవాలి. ఏపీలో ఈ లెక్కన చూస్తే.. ప్రభుత్వ   వ్యతిరేక ఓటు టీడీపీ, జనసేన పంచుకుంటాయి. రాష్ట్రంలో బీజీపీకి ఉన్న ఓటు శాతం అత్యంత స్వల్పం. ఆ పార్టీకి ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఇసుమంతైనా మళ్లే అవకాశాలు లేవు. కానీ తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుగా వెళ్తే ఈ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కూటమి ఖాతాలో పడుతుంది. సరిగ్గా  ఇక్కడే బీజేపీ ఏమైనా రాజకీయాలు చేస్తున్నదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.  వైసీపీకి అధికారం దక్కలా వద్దా అన్న సంగతెలా ఉన్నా టీడీపీని దెబ్బ తీయాలనే ఆలోచన ఉంటే మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు జనసేన-బీజేపీ వైఖరి చూస్తే ఈ ఓటు చీల్చే ప్రయత్నం ఏమైనా జరుగుతోందా అనే అనుమానాలు కలుగుతున్నాయి.

నిన్నటి వరకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహీ యాత్రలో పొత్తులపై ఎలాంటి ప్రకటన చేయకపోగా.. అక్కడక్కడా తానే సీఎం అనే మాటలు కూడా అన్నారు. దీనికి తోడు పవన్   వైసీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. పవన్ ప్రసంగాలు  వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అనేలా ఉన్నాయి. అవుట్ అండ్ అవుట్ వైసీపీని తూర్పార పట్టిన పవన్ టీడీపీతో పొత్తుల గురించి ఎక్కడా ప్రస్తావన రాకుండా జాగ్రత్త పడ్డారు. మూడు నెలల క్రితం వరకు పొత్తులు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు గురించి చెప్పిందే చెబుతూ వచ్చిన పవన్ వారాహీ విజయయాత్రలో టీడీపీ ప్రస్తావన తేలేదు. దీంతో ఇది వ్యూహమా.. భవిష్యత్ సంకేతమా అనే చర్చ మొదలైంది.

 పవన్ ఈ మధ్య కొత్తగా తనకు సీఎం అయ్యేందుకు అవకాశం ఇవ్వాలని అడగటం, తనతో పాటుగా తన పార్టీ వారిని కూడా అసెంబ్లీకి పంపాలని కోరడం, ఒక్క అవకాశం తమకు ఇచ్చి చూడాలని ప్రజలను ఒప్పించే ప్రయత్నం చేయడం ఇవన్నీ రాష్ట్ర రాజకీయాలలో కొత్త కొత్త ఆలోచనలకు దారితీస్తున్నాయి. కొద్ది నెలల క్రితం వరకు సీఎం తాను అయ్యే అవకాశం లేదని చెప్పిన పవన్.. ఈ మధ్య తానే సీఎం అవుతానని చెప్పటం వెనుక బీజేపీ వ్యూహం ఉందంటూ పరిశీలకులు విశ్లేషణలకు పని చెప్పారు.    పవన్ స్వతహాగా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే నమ్మకం ఎవరికీ కలగడం లేదు. బీజేపీ వయా పవన్ మీదగా రాజకీయ ఎత్తుగడలకు సిద్దమైందా అనే అనుమానాల బలంగా వ్యక్తమౌతున్నాయి. 

ఈ మధ్య కాలంలో పవన్ చేసిన వ్యాఖ్యలను చూస్తే.. ఒకటి టీడీపీతో గ్యాప్ అయినా పెరగాలి.. రెండు పొత్తులో డిమాండ్లు సాధించేలా ఒత్తిడి పెంచే ప్రయత్నం అయినా కావాలి. మూడు బీజేపీ ఏదైనా కొత్త ప్రణాళిక రచించి అది పవన్ తో అమలు చేయిస్తునైనా ఉండాలి. దేశవ్యాప్తంగా బీజేపీ రాజకీయ శైలిని చూస్తే చాలా రాష్ట్రాలలో ఇలా పాత మిత్రులను సైడ్ చేసి తాను ఎదుగుతూ రావడం గమనించొచ్చు. ఏపీలో కూడా బీజేపీ ఇలాంటి పన్నాగం ఏమైనా పన్నిందా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. నిజానికి టీడీపీ సింగల్ గా పోటీచేసినా ప్రభుత్వాన్ని నెలకొల్పే సీట్లను సంపాదించడం పెద్ద కష్టమేమీ కాదని ఇప్పటికే చాలా సర్వేలు చెప్తున్నాయి. టీడీపీ నేతల్లో కూడా ఈ ధీమా కనిపిస్తున్నది. అదే ఇప్పుడు బీజేపీకి మింగుడు పడక తెరవెనక దెబ్బతీసే ప్రయత్నం చేసినా ఆశ్చర్యం ఏమీ లేదని పరిశీలకులు అంటున్నారు. రాజకీయం అంటే రాజకీయమే కదా..   లోగుట్టు ఆ పెరుమాళ్ళకెరుక!

By
en-us Political News

  
భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా (ఇన్ చార్జ్) బొత్స అనూషను ఆ పార్టీ అధినేత జగన్ నియమించారు. ఈ మేరకు   పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి  ఉత్తర్వులు వెలువడ్డాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ నియామకం జరిగినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.  
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జగన్ విదేశీ పర్యటన పెట్టుకోవడాన్ని ప్రస్తావిస్తూ రాజకీయ పరిశీలకులు షర్మిల కుమార్తె వివాహానికి హాజరు కాకుండా తప్పించేకునేందుకే జగన్ ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చంటూ విశ్లేషిస్తున్నారు.  ఈ నేపథ్యంలోనే షర్మిల తన అన్న నివాసానికి వెళ్లి వివాహ ఆహ్వానపత్రిక అందిస్తారా? అందిస్తే జగన్ ఆ వివాహానికి హాజరౌతారా? అన్న అనుమానాలు పరిశీలకులలో వ్యక్తమౌతున్నాయి.
విదేశీ పర్యటనలో ఉన్నంతకాలం  అందుబాటులో ఉండే కాంటాక్ట్ ఫోన్ నంబరుతో పాటు అధికారిక ఈ-మెయిల్ అడ్రస్ కూడా సీబీఐ అధికారులకు కచ్చితంగా అందించాలి. ఇక విదేశీ పర్యటన ముగిసిన వెంటనే   కోర్టు విచారణ ప్రక్రియకు హాజరు కావాలని కోర్టు ఆదేశించింది.
చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జి.ఎం. మొహిద్దీన్ కూడిన ధర్మాసనం స్పీకర్ తీర్పును పక్కనపెట్టి దానం నాగేందర్ అనర్హతను ఖాయం చేసింది. 
విజయవాడ ఏసీబీ కోర్టు న్యాయాధికారి సమక్షంలో శుక్రవారం దాదాపు ఐదుగంటల పాటు  సత్యప్రసాద్‌ తన వాంగ్మూలాన్ని నమోదు చేయించారు. ఈ ప్రక్రియలో పలువురు న్యాయవాదులు, ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అధికారులు   పాల్గొన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు కీలక బాధ్యతలు నిర్వర్తించిన సత్యప్రసాద్, ఈ అక్రమ వసూళ్ల తంతు ఎలా సాగిందో సవివరంగా న్యాయమూర్తి ఎదుట చెప్పారు.
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
మైగ్రేన్ తలనొప్పితో ఆసుపత్రికి వెళ్లిన బెక్కీ జోన్స్‌కు బ్రెయిన్ క్యాన్సర్ ఉందంటూ 11 ఏళ్ల పాటు కీమోథెరపీ ఇచ్చారు. కానీ చివరికి అసలు క్యాన్సరే లేదని తెలిసిన షాకింగ్ వివరాలు ఈ వెబ్ స్టోరీలో చదవండి.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.