దోపిడీ సొమ్ముతో విధ్వంసానికి కుట్ర!?

Publish Date:Jul 27, 2024

Advertisement

ఇటీవలి ఎన్నికలలో ఎదురైన ఘోర పరాజయాన్ని వైసీపీ అధినేత  జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జీర్ణించుకోలేక పోతున్నాడు. త‌న రాజ్యాన్ని శ‌త్రువులు ఆక్ర‌మించుకున్నార‌న్న రీతిలో ఆయన వ్య‌వ‌హార‌శైలి ఉంది. ప్ర‌జాస్వామ్యంలో ఉన్నాం.. ప్ర‌జ‌లు మ‌న ఐదేళ్ల అరాచ‌క పాల‌న‌ను ఛీ కొట్టార‌ని జ‌గ‌న్ అంగీకరించలేకపోతున్నారు. తన రాజ్యాన్ని కబళించేశారన్న కక్షతో రగిలిపోతున్నట్లుగా ఆయన వ్యవహార శైలి ఉంది. అందుకు తగ్గట్టుగా జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డికి స‌ల‌హాలు ఇచ్చే నేత‌లు సైతం ఉండ‌టంతో ఆయ‌న‌ పిచ్చి ప‌రాకాష్ట‌కు చేరుతోంది. కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చి ప‌ నిండా రెండు నెల‌లుకాలేదు. అప్పుడే రాష్ట్రంలో ఏదో జ‌రిగిపోతుంద‌ని జ‌గ‌న్ గ‌గ్గోలు పెట్ట‌డం చూసి జనం న‌వ్వుకుంటున్నారు. సాధార‌ణంగా కొత్త‌గా ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే.. స‌ర్దుబాటు కావ‌టానికి క‌నీసం ఆరు నెల‌లు స‌మ‌యం ప‌డుతుంది. గ‌త ప్ర‌భుత్వంలో చేసిన అప్పులు, రాబ‌డి త‌దిత‌ర అంశాల‌పై అవ‌గాహ‌న‌కు రావ‌డంతో పాటు.. శాఖ‌ల వారిగా అధికారుల‌ను స‌ర్దుబాటు చేసుకోవ‌టం, పాలనపై ప‌ట్టు సాధించడం కోసం స‌మ‌యం ప‌డుతుంది.  కానీ, జ‌గ‌న్ తీరు చూస్తుంటే.. కుర్చీ నాది, దానిలో కూర్చోవ‌డానికి చంద్ర‌బాబు ఎవ‌రు అనే ఆక్రోశంతో, ఆవేశంతో ఉడికిపోతున్నట్లు కనిపిస్తోంది. వీలైనంత త్వ‌ర‌గా ఆ కుర్చీని లాక్కోవాల‌నే దుగ్ధతో  ఎంత‌కైనా తెగించేందుకు జ‌గ‌న్‌, ఆయ‌న టీం సిద్ధ‌మ‌వుతోంది. ఇందుకోసం నెల‌కు వంద కోట్లు ఖ‌ర్చు చేసేందుకు స‌న్న‌ద్ద‌మైన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతుంది. 

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఐదేళ్ల పాల‌న‌లో అరాచ‌కాల‌కు హ‌ద్దు లేకుండా పోయింది. ఆయ‌న అనుచ‌రులు రాష్ట్ర‌ వ్యాప్తంగా పెద్ద మొత్తంలో దోపిడీకి పాల్ప‌డ్డారు. ప్ర‌తిప‌క్ష పార్టీ నేత‌లపై అక్ర‌మ కేసులు పెట్టి చిత్ర హింస‌ల‌కు గురిచేశారు. ప్ర‌భుత్వం తీరును ప్ర‌శ్నించిన వారిని అక్ర‌మ కేసుల‌లో ఇరికించి మరీ జైళ్ల‌కు పంపించారు. మొత్తంగా చెప్పాలంటే జ‌గ‌న్ ఐదేళ్ల పాల‌న‌లో వైసీపీ నేత‌లు ఉన్మాదుల్లా వ్య‌వ‌హ‌రించారు. త‌మ‌ అరాచ‌క పాల‌న‌తో ప్ర‌జ‌ల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేసి మ‌రోసారి అధికారంలోకి రావాల‌న్న జ‌గ‌న్ వ్యూహాల‌కు జనం ఎన్నికలలో చెక్ పెట్టారు.  ప్ర‌జ‌లంతా ఏక‌మై వైసీపీని ఘోరంగా ఓడించారు. ఘోర ఓట‌మిని త‌ట్టుకోలేక జ‌గ‌న్ మాన‌సిక  ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని ఆయన  ఆంత‌రంగికులే చెబుతున్నారు. నెల‌న్న‌ర రోజుల్లో స‌రైన తిండి, నిద్ర లేక జ‌గ‌న్ బ‌రువు కూడా త‌గ్గారంటున్నారు. 2019లో జ‌గ‌న్ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ప్ర‌భుత్వ భ‌వ‌నాలు కూల్చివేత‌లు, ప్ర‌తిప‌క్ష నేత‌ల అక్ర‌మ అరెస్టుల‌తో అరాచ‌క పాల‌న‌కు తెర‌లేపారు. ప్ర‌స్తుతం అధికారంలోకి వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం ఎక్క‌డా ఘ‌ర్ష‌ణ‌లు త‌లెత్త‌కుండా, రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జ‌రిగేలా ప్ర‌ణాళికాబద్ధంగా ముందుకెళ్తోంది. దీంతో ప్ర‌జ‌లు కూట‌మి ప్ర‌భుత్వం తీరుప‌ట్ల సంతోషంగా ఉన్నారు. నెల‌న్న‌ర వ్య‌వ‌ధిలోనే కూట‌మి ప్ర‌భుత్వం ప‌ట్ల ప్ర‌జల నుంచి వ‌స్తున్న మంచి స్పంద‌న‌ను చూసి జ‌గ‌న్ రగిలిపోతున్నారు. ఈ సానుకూల వాతావరణాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా  రాష్ట్రంలో అల్ల‌ర్ల‌కు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసిన‌ట్లు ఏపీ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది.

సీఎం చంద్ర‌బాబు నాయుడు రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు   ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. రాజ‌ధాని అమ‌రావ‌తి , పోల‌వ‌రం ప్రాజెక్టుల‌పై ప్ర‌త్యేక దృష్టి సారించిన చంద్ర‌బాబు.. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జ‌రిగేలా, కంపెనీలు ఏర్పాట‌య్యేలా ప్ర‌ణాళిక‌తో ముందుకెళ్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు ప్ర‌ముఖ కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకొచ్చాయి. కూట‌మి ప్ర‌భుత్వంలో ప్ర‌శాంత పాల‌నకు స‌హ‌క‌రిస్తే  రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు కంపెనీలు క్యూ క‌డ‌తాయ‌ని, త‌ద్వారా చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ల్యాణ్ కు మంచి పేరు వ‌స్తుంద‌ని జ‌గ‌న్ భావిస్తున్నారు. అదే జ‌రిగితే వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి వైసీపీ ఉనికిమాత్రంగా కూడా మిగిలే అవకాశం లేదని   జ‌గ‌న్, ఆయ‌న వ‌ర్గీయులు ఆందోళ‌న చెందుతున్నారు. దీంతో రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం హ‌యాంలో అరాచ‌కాలు, హ‌త్య‌లు పెరిగిపోయాయ‌ని, 36 మంది వైసీపీ కార్య‌క‌ర్త‌ల‌ను హ‌త్య‌లు చేశార‌ని జ‌గ‌న్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నారు. ఢిల్లీకి వెళ్లి కూట‌మి ప్ర‌భుత్వం 50రోజుల పాల‌న‌లోనే రాష్ట్రంలో శాంతిభ‌ద్ర‌త‌లు పూర్తిగా అదుపు త‌ప్పాయ‌ని, రాష్ట్ర‌ప‌తి పాల‌న పెట్టాలంటూ జ‌గ‌న్ గ‌గ్గోలు పెట్టారు. ఢిల్లీలో ధ‌ర్నాకు కోట్లాది రూపాయ‌లు జ‌గ‌న్ ఖ‌ర్చు చేశారు.  కానీ, కూట‌మి పార్టీల నేత‌ల దాడుల వ‌ల్ల చ‌నిపోయిన 36 మంది వివ‌రాలు ఇవ్వాల‌ని కోరితే మాత్రం జ‌గ‌న్‌, వైసీపీ నేత‌లు నీళ్లు నములుతున్నారు. కేవ‌లం రాష్ట్రంలో పెట్టుబ‌డులు పెట్టేందుకు కంపెనీల ప్ర‌తినిధులు ముందుకు రాకుండా ఉండాల‌నే జ‌గ‌న్ ఇలా వ్య‌వ‌హ‌రిస్తున్నారని కూట‌మి పార్టీల నేత‌లు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. 

రాబోయే కాలంలోనూ రాష్ట్రంలో ఘ‌ర్ష‌ణ‌లు సృష్టించేలా జ‌గ‌న్, ఆయ‌న బృందం ప్లాన్ చేస్తున్న‌ట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ప్ర‌భుత్వం ప‌నిచేయ‌లేని ప‌రిస్థితి క‌ల్పించాల‌ని జ‌గ‌న్ భావిస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్ర‌మంలో అన్ని జిల్లాల్లో, అన్ని ప‌ట్ట‌ణ కేంద్రాల్లో ధ‌ర్నాలు, ప్ర‌ద‌ర్శ‌న‌లు, ఆందోళ‌న‌లు, అల్ల‌ర్ల‌తో రాష్ట్రం మొత్తం అశాంతి సృష్టించాల‌న్న‌ది వైసీపీ ప్లాన్ గా తెలుస్తోంది. ఇందుకోసం జ‌గ‌న్ నెల‌కు వంద కోట్లు ఖ‌ర్చుచేసేందుకు సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం. ఈ బాధ్య‌త‌ల‌ను మాజీ ఐఏఎస్ అధికారి ధ‌నుంజ‌య‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డికి అప్ప‌గించిన‌ట్లు వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతున్నది. వైసీపీ అధికారంలో ఉన్న స‌మ‌యంలో ధ‌నుజ‌య రెడ్డి, మిథ‌న్ రెడ్డితోపాటు జ‌గ‌న్ కు ద‌గ్గ‌ర‌గా మెలిగిన వైసీపీ నేత‌లు వంద‌ల కోట్ల ప్ర‌జా సొమ్మును దోపిడీ చేశారు. ఆ సొమ్మును బ‌య‌ట‌కు తీసి జిల్లాల్లో అల్ల‌ర్లు సృష్టించేందుకు ఉప‌యోగించ‌బోతున్నార‌ని వైసీపీ వ‌ర్గాల్లో ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి జ‌గ‌న్, ఆయ‌న బ్యాచ్ కుట్ర‌ల‌ను చంద్ర‌బాబు ఆధ్వ‌ర్యంలోని కూట‌మి ప్ర‌భుత్వం ఏ విధంగా తిప్పికొడుతుంద‌నే అంశం ఆస‌క్తిక‌రంగా మారింది.

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్ లో ఇక వైసీపీ అవసరం ఏ మాత్రం లేదంటున్నారు ఆ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిల. వైసీపీ అధినేత, సొంత అన్న అయిన జగన్ కు నోరెత్తే అవకాశం, అవసరం లేకుండా చేస్తున్నారు.
బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు శుక్రవారం (అక్టోబర్ 18) నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. మంత్రి కొండా సురేఖపై ఆయన పరువునష్టం దావా వేసిన సంగతి తెలిసిందే.
గత ఐదేళ్లుగా రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ దేశ వ్యాప్తంగా నవ్వుల పాలు కావడానికి కారణమైన జగన్ పాలన అంతం కావడంతో అమరావతికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయి. అమరావతే ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా తలెత్తుకుని ఠీవీగా నిలిచింది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం ఇక ఏ అవరోధాలూ లేకుండా సజావుగా సాగి నిర్దుష్ట సమయానికి పూర్తి అవుతుందన్న విశ్వాసం అందరిలోనూ వ్యక్తం అవుతోంది.
కేంద్రంలో కొలువుదీరి ఉన్న మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి సర్కార్ జమిలీ ఎన్నికలపై దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. మోడీ రెండో సారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచీ జమిలి ఎన్నికల జపం చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మూడో సారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తరువాత జమిలి ఎన్నికల నిర్వహణకు కార్యాచరణకు వేగవంతం చేశారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్నది. శుక్రవారం (అక్టోబర్18) ఉదయం శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్న భక్తులతో 26 కంపార్ట్ మెంట్లు నిండిపోయాయి.
వైసీపీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి పోలీసుల ముందు విచారణకు హాజరయ్యారు. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో విచారణకు రావలసిందిగా సజ్జలకు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసు మేరకు సజ్జల మంగళగిరి పోలీసు స్టేషన్ కు వచ్చారు.
ఎన్ డి ఏ భాగస్వామ్య పక్షాల సమావేశం మరికొద్ది సేపట్లో జరగనుంది. ఎపి ముఖ్యమంత్రి చంద్రబాబు తో పాటు 20 భాగస్వామ్యపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొననున్నాయి. హర్యానా ఎన్నికలో బిజెపి ఘన విజయం సాధించిన నేపథ్యంలో సాయంత్రం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది.
తెలుగుదేశం అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేసీఆర్ విషయంలో టిట్ ఫర్ టాట్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారా? 2019లో తెలుగుదేశం పార్టీ ఓటమిపై కేసీఆర్ చేసిన రిటర్న్ గిఫ్ట్ వ్యాఖ్యలకు చంద్రబాబు ఇప్పుడు అదే రీతిలో బదులు చెప్పడానికి రెడీ అయిపోయారా? ప్రత్యర్థులకు అందని వ్యూహాలతో చెలరేగిపోతారన్న పేరున్న కేసీఆర్ చంద్రబాబు ఎత్తులతో చతికిలపడిపోయారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి దేశవ్యాప్తంగా వున్న పారిశ్రామికవేత్తలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతం పలుకుతున్నారు.
వైసీపీ పాలనలో విధ్వసానికి గురైన రాజధాని నగరం అమరావతి కూటమి ప్రభుత్వం వచ్చిన మరుక్షణం నుంచే అభివృద్ధి పథంలో పయనిస్తోంది.
మావోయిస్ట్ అగ్రనేత సుజాతను అత్యంత చాకచక్య్ంగా అరెస్ట్ చేశారు. శుక్రవారం ఆమెను అరెస్ట్ చేసిన విషయాన్ని ధృవీకరించారు.
సైబరాబాద్ మెక్క, మాజీ మంత్రి విడదల రజనీకి ఉచ్చు బిగుస్తోందా? అధికారాన్ని, పదవిని అడ్డుపెట్టుకుని అడ్డగోలు దోపిడీకి తెగబడిన విడదల రజని ఇప్పుడు కర్మఫలం అనుభవించక తప్పదా అంటే పరిశీలకులే కాదు, వైసీపీ శ్రేణులు సైతం ఔననే అంటున్నాయి. మంత్రిగా ఉన్న సమయంలో ఆమె ఇష్టారీతిగా వ్యవహరించారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
హైద్రాబాద్లో  40 చోట్ల ఏకకాలంలో   ఐటీ సోదాలు  జరుగుతున్నాయి. గూగి ప్రాపర్టీస్ అండ్ డెవలపర్స్ , అన్విత బిల్డర్స్, అధినేత అచ్చుత్ రావ్ ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. బొప్పన శ్రీనివాస్, బొప్పన అనూప్ ఇంట్లో కూడా ఐటీ సోదాలు జరుగుతున్నాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.