జ‌గ‌న్ ప‌క్కా బిజినెస్‌మేన్‌.. శ్రీలంక‌లా ఏపీ మార‌డం ఖాయం.. ఉండ‌వ‌ల్లి సంచ‌ల‌నం..

Publish Date:Apr 16, 2022

Advertisement

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రస్తుతం ఆర్థిక అరాచకత్వానికి  కేరాఫ్ అడ్రస్ గా మారింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రజాధనాన్ని తనకు ఓట్లు రాల్చి పెట్టేందుకు వీలుగా సంక్షేమ పథకాల మాటున పందేరం చేస్తున్నారు. దీన్నే క్విడ్ ప్రోకో అంటారని మాజీ ఎంపీ, జగన్ తండ్రి వైఎస్ అనుయాయి అయిన ఉండవల్లి అరుణ్ కుమార్ అంటున్నారు.  జగన్ కు నీకిది...నాకిది అన్న చందంగా క్విడ్ ప్రొకో మాటున లబ్ధి పొందడం తన తండ్రి వైఎస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచీ అలవాటే. అందుకుసంబంధించిన ఆర్థిక నేరాలపై జగన్ పై ఇప్పటికీ విచారణ జరుగుతోంది.  వ్యాపారంలో క్విడ్  ప్రోకోను  కూపీలాగి నిగ్గుతీయడానికి విచారణ సంస్థలు ఉన్నాయి. అయితే సంక్షేమం మాటున ఓట్ల లబ్ధికి పాల్పడే క్విడ్ ప్రోకో నిఘా సంస్థల పరిధిలోనికి రాదన్న ధీమా జగన్ లో కనిపిస్తున్నది.

 డబ్బులను తమ జేబులోంచి ఇస్తున్నట్లుగా చేతికి ఎముకే లేదన్నట్లుగా ఖర్చు పెట్టేస్తున్నారు. ఇలా చేయడం వల్ల రాష్ట్రం దివాళా తీయడం, అభివృద్ధి కుంటుపడటమే కాకుండా రాష్ట్రంలో  శ్రీలంక  పరిస్థితులు ఏర్పడే ముప్పు కూడా ఉందన్న ఆర్థిక రంగ నిపుణుల హెచ్చరికలు సీఎం జగన్ చెవికి ఎక్కడం లేదు. రెండేళ్ల తరువాత అసెంబ్లీ ఎన్నికలలో ఓట్లు రాబట్టడమే లక్ష్యంగా డబ్బుల పందేరంలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు.  ఒక విధంగా చెప్పాలంటే ఆయన ప్రభుత్వాధినేతగా బాధ్యతాయుత పదవిలో ఉండి ప్రభుత్వ ధనంతో జూదం ఆడుతున్నారు.  ఒక్క మాటలో చెప్పాలంటే ఏదో ఒక సాకుతో...తనకు అంటే తన పార్టీకి ఓట్లు వేస్తారని నమ్ముతున్న వర్గాలను సొమ్ముల పందేరంలో తనకు ఎవరూ సాటిలేరన్న చందంగా జగన్ ఈ సొమ్ము బదిలీ విద్యలో ఆరి తేరారు. 

ఆఖరికి కేంద్రం విపత్తు నిర్వహణ కోసం ఇచ్చిన సొమ్మును కూడా తన ఓటు బ్యాంకు విస్తరణ  పథకం కోసం వాడుసుకున్నారు. అంతెందుకు ఉచిత బియ్యానికి బదులుగా లబ్ధిదారులకు ఆ మేరకు సొమ్ము బదిలీ చేసేప్రతిపాదనను తెరపైకి తీసుకు వచ్చే సాహసం చేశారంటే...తన అధికారాన్నిఆయన ఏ స్థాయిలో ఎన్నికల లబ్థి కోసం వాడుకుంటున్నారో అర్ధం చేసుకోవచ్చు. 

నిజానికి ఓటు బ్యాంకు లక్ష్యంగా ప్రభుత్వాలు చేసే ఉచిత పందేరాలను అడ్డుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. అయితే దీనిని నియంత్రించే బాధ్యత ఎవరు తీసుకోవాలి.  ఎన్నికలను నిర్వహణ బాధ్యత ఉన్న ఎన్నికల సంఘమే ప్రభుత్వాలు జనాలను ప్రలోభ పెట్టే పందేరాలను నియంత్రించాలి. అయితే ఆ పని తమది కాదని ఎన్నికల సంఘం ఇటీవల తేల్చేసింది. కాగ్ వంటి సంస్థల నివేదికలను ప్రభుత్వాలుపట్టించుకోకుండా బుట్ట దాఖలు చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాల దుబారాను, ఆర్థిక అరాచకత్వాన్ని అడ్డుకొనే ఒక పటిష్ట వ్యవస్థ అవసరం ఉంది. 
నిజానికి నీతి ఆయోగ్ ఏర్పాటు ఉద్దేశమే ఇది. కానీ...అభివృద్ధి..రాజకీయాలు జుగల్ బందీగా సాగుతున్న తీరు నీతి ఆయోగ్ ను కూడా ఒక ఉత్సవ విగ్రహంగా మార్చేసింది. రాష్ట్రాలను మరీ ముఖ్యంగా బీజేపీయేతర ప్రభుత్వాలు అధికారంలో ఉన్నరాష్ట్రాల పట్ల కేంద్రంలోని మోడీ సర్కార్ సవతి ప్రేమ చూసుతోంది. అదే సమయంలో తమ నిర్ణయాలను విచక్షణను ఉపయోగించకుండా, రాష్ట్ర ప్రయోజనాలతో సంబంధం లేకుండా ఔదాల్చే జగన్ సర్కార్ వంటి ప్రభుత్వాల తప్పులను కేంద్రం చూసి చూడనట్టు వదిలేస్తున్నది. అదే జగన్ కు వరంగా మారింది. అందుకే నిబంధనల జోలికి వెళ్లకుండా యథేచ్ఛగా పందేరాల పరంపర కొనసాగించగలుగుతున్నారు. స్థానిక సంస్థల స్వయంప్రతిపత్తి కోసం ఉద్దేశించిన 93, 94 రాజ్యాంగ సవరణలను సైతం పట్టించుకోకుండా పంచాయతీ నిధులను కూడా మళ్లించేశారంటే ఇదే కారణం. ఈ నిరంకుశత్వం, నిష్పూచీ తనం, జవాబాదారీతనం లేని తీరుతో పరిపాలన, రాజకీయ ప్రయోజనం.. రెంటినీ అవిభక్త కవలలుగా మార్చి జగన్ చేస్తున్నది  వచ్ఛిన్నమే, విధ్వంసకర జూదమే!

By
en-us Political News

  
Publish Date:May 3, 2026
తాజా సమాచారం మేరకు మమతా బెనర్జీ తన సమీప ప్రత్యర్థి సువేందు అధికారి కంటే స్వలంగా వెనుకబడ్డారు. ఈసారి భవానీపూర్ నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకంగా మారింది.
ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. పశ్చిమ బెంగాల్‌లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని బీజేపీ, తమిళనాడులో డీఎంకే జోరు కనిపిస్తోంది. పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ గట్టిపోటీ ఇస్తూ.. ముందుకు సాగుతోంది. ఎర్లీ ట్రెండ్స్ ను బట్టి చూస్తే.. మహిళా ఓటర్ల మద్దతు ఈసారి కూడా మమతాబెనర్జీకే ఉందని తెలుస్తోంది.
కేంద్రంలోని అధికార పార్టీ కౌంటింగ్ కేంద్రాల వద్ద అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనీ.. ఈ విషయంలో ఎన్నికల సంఘం తీరు కూడా అనుమానాస్పదంగా ఉందని ఆమె సంచలన ఆరోపణలు చేశారు. కౌంటింగ్ ఏజెంట్లను భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న మమతా బెనర్జీ.. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయంతో ఓట్ల లెక్కింపులో మార్పులు చేసేందుకు వ్యూహరచన చేస్తున్నారన్నారు.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి.
విజయ్ తన పార్టీ అభ్యర్థుల కోసం మహాబలిపురం లోని ఒక ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లు తెలుస్తోంది. గెలిచిన అభ్యర్థులందరినీ వెంటనే చెన్నైలోని పనైయూర్ పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకోవాలని.. అక్కడి నుండి అందరినీ సామూహికంగా రిసార్ట్‌కు తరలించాలని విజయ్ ఆదేశించినట్లు తెలుస్తోంది.
బెంగాల్ ప్రస్తుత పరిస్థితులను ఆయన ఉత్తరప్రదేశ్, బిహార్‌లతో పోల్చారు. ఒకప్పుడు యూపీలో నెలకొన్న అరాచక శక్తులను బీజేపీ ప్రభుత్వం ఎలాగైతే అంతం చేసిందో, బెంగాల్‌లో కూడా అదే పునరావృతం అవుతుందని అన్నారు.
ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపుతో మొదలైంది. ఈ ఐదు రాష్ట్రాలలో ఎగ్జిట్ పోల్స్ అంచనాలు కొన్ని రాష్ట్రాల్లో ఒకే పార్టీకి స్పష్టమైన ఆధిక్యాన్ని, మరికొన్ని చోట్ల హోరాహోరీ పోరును సూచించాయి. పశ్చిమ బెంగాల్ విషయానికి వస్తే.. ఇక్కడ ఎన్నికల పోరు హోరాహోరీగా సాగింది. ఎగ్జట్ పోల్స్ అంచనాల ప్రకారం మమతా బెనర్జీ నేతృత్వంలోని
తమిళనాడు రాజకీయాలు మరోసారి రసవత్తరంగా మారాయి.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రేపు వెల్లడికానున్నాయి
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చే చాన్సే లేదన్నారు. ఈ సమావేశంలో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ బ‌లోపేతం, స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మం, క‌మిటీల నిర్మాణం లాంటి అంశాల‌పై నేతలతో చర్చించిన కేటీఆర్ . స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి విజయాలు నమోదు చేసిన పార్టీ నేతలను ఈ సందర్భంగా అభినందించారు.
కేటీఆర్ వ్యాఖ్యలపై కవిత చాలా ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్, తనను, తన రాజకీయ పార్టీనీ చాలా తేలికగాతీసుకుంటోందన్న కవిత.. ప్రాథమిక స్థాయిలో తన పార్టీని చాలా తేలికగా తీసుకుంటున్నందుకు ఆమె కేటీఆర్‌పై ఎదురుదాడి చేశారు. ఇటీవలే కేటీఆర్ బీఆర్ఎస్‌ను తిరిగి టీఆర్ఎస్‌గా మార్చడం గురించి మాట్లాడారనీ.. కానీ ఇప్పుడు ఈసీ తమ పార్టీకి ట్రేడ్‌మార్క్ టీఆర్ఎస్ పేరు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దానిని తేలికగా తీసుకుంటున్నట్లు మాట్లాడుతున్నారన్నారు.
ఒకప్పుడు సోషల్ మీడియాలో లోకేష్‌ను ట్రోల్ చేయడమే పనిగా పెట్టుకున్న వైసీపీకి ఆయన తన పనితీరుతోనే సమాధానం చెప్పారు. 400 రోజులకు పైగా సాగిన యువగళం పాదయాత్ర లోకేష్‌ను ప్రజలకు చేరువ చేయడమే కాకుండా.. ఆయనలోని నాయకత్వ పటిమను బయటపెట్టింది. ఆ యాత్రలో ఆయన సేకరించిన ప్రజా సమస్యలే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సూపర్ సిక్స్ పథకాలకు పునాదిగా మారాయి.
కవిత తన కొత్త రాజకీయ ప్రస్థానంలో భాగంగా యువతతో విస్తృతంగా మమేకమవ్వాలని నిర్ణయించుకున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.