Publish Date:Apr 16, 2022
ఏపీలో అవినీతి. జగన్‌రెడ్డి అవినీతి. వైసీపీ నేతల అవినీతి. మద్యంలో అవినీతి. ఇసుకలో అవినీతి. గనుల్లో అవినీతి. ఆంధ్రప్రదేశ్‌లో ఎందెందు వెతికినా అందందు అవినీతి అవినీతి అవినీతి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక, ప్రభుత్వ విభాగాల్లో కరెప్షన్‌కు కేరాఫ్ అయిన రెవెన్యూ శాఖ అవినీతి గురించి అయితే ఇక్క చప్పనవసరమే లేదు. భూములు, దస్తావేజుల గోల్‌మాల్‌తో కోట్లకు కోట్లు చేతులు మారుతుంటాయనే ఆరోపణ ఉంది. ఈ మాట వాళ్లూవీళ్లు అనడం కాదు.. తాజాగా, రెవెన్యూ శాఖకు కొత్తగా మంత్రిగా వచ్చిన ధర్మాన ప్రసాదరావే తన శాఖలో అవినీతిపై సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది. ఇంతకీ ఆయన ఏమన్నారంటే....
రెవెన్యూ శాఖలో అవినీతి భారీ స్థాయిలో పెరిగిపోయిందని, దాని నివారణకు కృషి చేస్తానని రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. "అవినీతి నివారణలో భాగంగా సీఎం బ్యాంకుల నుంచి రైతుల ఖాతాలకు నేరుగా నగదు పంపే విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చారు. అయినా అవినీతి తగ్గిపోలేదు. ఇది మనం సిగ్గుపడాల్సిన పరిస్థితి ఉంది. నిజాయితీగా పనిచేస్తేనే ప్రజలు నమ్ముతారు. కులం, మతం చూసి ప్రజలు ఓట్లు వేసే రోజులు పోయాయి. పంజాబ్‌లో ఆప్‌కు పట్టం కట్టడమే ఇందుకు నిదర్శనం. వయోభారం పెరిగే కొద్దీ రాజకీయాల్లో ఉత్సాహం తగ్గుతోంది. త్వరలో విరామం ప్రకటించి కొత్త వారికి అవకాశం ఇవ్వాలని అప్పుడప్పుడు అనిపిస్తోంది. ప్రజల ప్రేమాభిమానులు ఇందుకు అడ్డొస్తున్నాయి" అని ధర్మాన ధర్మసూక్తులు చెప్పారు. ఆయన మాటలను బట్టి.. రెవెన్యూ శాఖలో భారీ అవినీతి ఉన్నట్టేగా? పాలకులు, అధికారులు దొరికినకాడికి దోచుకుంటున్నట్టేగా? సాక్షాత్తూ మంత్రే చెబుతుంటే ఇక వేరే చెప్పేదేముంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/minister-dharmana-comments-on-correption-25-134468.html
పశ్చిమబెంగాల్‌లో మూడున్నర దశాబ్దాల ఏళ్ల సీపీఎం పాలనకు బ్రేక్ వేసి 2011లో అధికార పగ్గాలు చేపట్టిన తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్టీ.. 2026 వరకు వరుస విజయాలతో ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆమె 15 ఏళ్ల ఆధిపత్యానికి ఎన్డీఏ తెర దించింది. మమతా సైతం కాంగ్రెస్‌లో కేంద్రమంత్రిగా, పలు కీలక పదవులు నిర్వహించి, తర్వాత సొంత కుంపటి పెట్టుకున్న నాయకురాలే కావడం గమనార్హం.
ప్రజా సమస్యలపై స్పష్టమైన అజెండాతో ఎన్నికల బరిలోకి దిగిన విజయ్‌ను తమిళ ప్రజలు ఆదరించడం శుభపరిణామమన్నారు.
తన పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఆయన సాగించిన ప్రయాణం ఒక అద్భుతమైన రాజకీయ థ్రిల్లర్‌ను తలపిస్తుంది. ఎన్నికల ప్రచార సమయంలో విజయ్ అనేక ఆటంకాలను ఎదుర్కొన్నారు. ప్రత్యర్థి పార్టీల నుండి వచ్చిన తీవ్ర విమర్శలు, అధికార యంత్రాంగం విధించిన ఆంక్షలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేశాయి. వ్యక్తిగత జీవితంపై జరిగిన దుష్ప్రచారం విజయ్ ఇమేజ్‌ను దెబ్బతీస్తుందని అందరూ భావించారు.
తమిళనాడులో టీవీకే పార్టీ విజయాన్నిస్వాగతిస్తూ.. వైసీపీ సోషల్ మీడియా వేదికగా సంబరాలు మొదలు పెట్టింది. విజయ్ సాధించిన ఈ అద్భుత విజయం వెనుక వైసీపీ అధినేత జగన్ సహకారం ఉందంటూ వైసీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా గతంలో ఒక వివాహ వేడుకలో వైఎస్ జగన్, విజయ్ ఇద్దరూ కలిసి దిగిన ఒక ఫోటోను ఇప్పుడు వైసీపీ నెట్టింట వైరల్ చేస్తోంది.
ఈ ఎన్నికల ఫలితాల్లో విజయ్ టవీకే పార్టీ స్పష్టమైన ఆధిక్యత కనబరిచింది. ప్రభుత్వ వ్యతిరేకతతో పాటు, కూటమి పక్షాల మధ్య సరైన సమన్వయం లేకపోవడం కూడా ఈ ఓటమికి ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
1982లో తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్టీఆర్, కేవలం 9 నెలల కాలంలోనే రాష్ట్రమంతటా పర్యటించి ప్రభంజనం సృష్టించారు. 1983 ఎన్నికల్లో కాంగ్రెస్ వంటి బలమైన పార్టీని మట్టికరిపించి, తొలి ప్రయత్నంలోనే ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించి రికార్డ్ సృష్టించారు.
భారత రాజకీయ యవనికపై భారతీయ జనతా పార్టీ తన ఉనికిని మరింత శక్తివంతం చేస్తోంది.
చారిత్రాత్మక విజయం ఖాయమని తేలడంతో.. విజయం అభిమానుల సంబరాలు మిన్నంటాయి. అయితే.. ఈ నేపథ్యంలో సినీ నటి త్రిష పేరు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచిఎన్డీయూ కూటమి అభ్యర్థి మల్లాడి కృష్ణారావు విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ అభ్యర్థి గొల్లపల్లి అశోక్ పై నాలుగువేల ఐదు వందల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు.
ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమి సాధించిన ఘన విజయంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హర్షం వ్యక్తం చేశారు.
తట్టంచావడి నియోజకవర్గం నుంచి ఆయన భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన పోటీ చేసిన మరో స్థానమైన మంగళంలోనూ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీకి అధికారం దూరమైనట్టే. ఈసారి కూడా అధికారాన్ని దక్కించుకుంటామని గట్టిగా చెప్పిన మమత.. బెంగాల్ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్న నేపథ్యంలో.. ఓటమి మూటగట్టుకోక తప్పలేదు. రాష్ట్రవ్యాప్త ట్రెండ్స్ గమనిస్తే, బీజేపీ మెజారిటీ మార్కు వైపు వేగంగా దూసుకుపోతోంది. 294 స్థానాలున్న బెంగాల్ అసెంబ్లీలో మేజిక్ ఫిగర్ 148 కాగా, బీజేపీ 177 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యతతో ఉంది.
హంగ్ పరిస్థితి ఏర్పడితే డీఎంకే, ఏఐడీఎంకేలకు మద్దతు ఇస్తారన్న పరిశీలకుల అంచనాలను తమిళనాడు ప్రజలు తల్లకిందులు చేశారు. విజయ్ కింగ్ మేకర్ కాదు.. కింగే అని విస్పష్ట తీర్పు ఇచ్చారు. తమిళనాడు ఎన్నికలఫలితాల సరళిని బట్టి చూస్తే.. విజయ్ టీవీకే పార్టీ వందకు పైగా సీట్లలో విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.