Publish Date:Jan 22, 2026
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి పాదయాత్రకు సమాయత్తమౌతున్నారు. రాష్ట్రంలో ఎన్నికలకు మరో మూడేళ్ల వ్యవధి ఉండగానే జగన్ పాదయాత్ర ప్రకటన రాజకీయంగా చర్చకు తెరతీసింది. 2019 ఎన్నికలకు ముందు జగన్ ప్రజా సంకల్పయాత్ర పేరిట దాదాపు 16 నెలల పాటు పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఆ పాదయాత్ర కారణంగానే అప్పటి ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. అయితే అధికారంలో ఉన్న ఐదేళ్లూ జగన్ సర్కార్ విధానాలు, జగన్ కక్ష సాధింపు రాజకీయాలు, అలాగే రాష్ట్రంలో అభివృద్ధి ఆనవాలు లేకుండా చేసి, అరకొర సంక్షేమంతో సాగించిన పాలనా, అలాగే జగన్ అనుసరించిన ఆర్థిక అరాచకత్వ విధానాల కారణంగా 2024 ఎన్నికలలో పార్టీ ఘోరంగా పరాజయం పాలైంది. కనీసం ప్రతిపక్ష హోదాకు కూడా నోచుకోకుండా 11 స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికలలో పరాజయం తరువాత జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్నారు. ఎక్కువగా బెంగళూరులోని ఎలహంక ప్యాలెస్ కే పరిమితమౌతూ రాష్ట్రంలో పార్ట్ టైమ్ రాజకీయాలు నెరపుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పార్టీ బలహీనపడింది.
ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో పార్టీని మళ్లీ బలోపేతం చేయాలంటే పాదయాత్ర శరణ్యమని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తున్నది. తాజాగా తాడేపల్లిలోని పార్టీ క్యాంపు ఆఫీసులో ఏలూరు నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో జగన్ తన పాదయాత్ర ప్రకటన చేశారు. తన ప్రకటన పార్టీ క్యాడర్ లో జోష్ నింపుతుందని ఆయన భావిస్తున్నట్లు పరిశీలకులు చెబుతున్నారు.
అయితే జగన్ పాదయాత్ర @ 2.0 వల్ల పెద్దగా ప్రయోజనం ఉండే అవకాశాలు లేవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు ఆయన సుదీర్ఘ పాదయాత్రకు విశేష స్పందన లభించింది. అప్పట్లో ఆయన అడుగుకో హామీ అన్నట్లుగా వాగ్దానాలు గుప్పించారు. వాటిని నమ్మి జనం ఆయన పార్టీకి బ్రహ్మరథం పట్టి ఆ ఎన్నికలలో ఘన విజయం చేకూర్చి పెట్టారు. అయితే అయిదేళ్ల పాలనలో పాదయాత్ర ద్వారా వచ్చిన మైలేజీని పూర్తిగా పోగొట్టుకోవడమే కాకుండా, తీవ్ర ప్రజా వ్యతిరేకతను కూడా జగన్ మూటగట్టుకున్నారు. హామీల అమలు విషయాన్ని పట్టించుకోలేదు. నవరత్నాల పేరుతో సంక్షేమ పథకాలను అరకొరగా అమలు చేశారు. అంతే కాకుండా అధికారంలో ఉన్నప్పుడు జనం మొహం చూడటానికి కూడా ఇష్టపడకుండా, బయటకు వచ్చినప్పుడు రోడ్డుకు ఇరువైపులా పరదాలు కట్టుకు తిరిగిన జగన్.. పార్టీ పరాజయం తరువాత కూడా పెద్దగా జనంలోకి రాలేదు. మరి ఇప్పుడు పాదయాత్ర అంటూ మరో సారి జనం ముందుకు వచ్చే ప్రయత్నం ఏ మేరకు వర్కౌట్ అవుతుందన్నది అనుమానమేనన్నది పరిశీలకుల విశ్లేషణ.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/jagan-announce-padayatra-39-212842.html
2014 నుంచి ఆంధ్రప్రదేశ్ లో రెండు ప్రధాన రాజకీయ పార్టీల మధ్యే అధికారం మారుతూ వస్తోంది. వైపీపీ, తెలుగుదేశం మధ్య ద్విముఖ పోరే నెలకొని ఉంది. ఈ పరిస్థితుల్లో విజయసాయిరెడ్డి కొత్త పార్టీ రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలలో మార్పు తీసుకువచ్చే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కాషాయం పార్టీ రాష్ట్ర నేతలు కొండా బీజేపీ ఎంట్రీపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతున్నారు. వీటికి తోడు సకుటుంబ సపరివార సమేతంగా అయితేనే కాషాయం కండువా కప్పుకుంటానంటూ కొండా సురేఖ కండీషన్లు పెడుతున్నట్లు వస్తున్న వార్తలు ఆమెకు బీజేపీ ఎంట్రీ కూడా మూసుకుపోయిందా అన్న అనుమానాలకు కలిగిస్తున్నాయి.
కొండా సుశ్మీత మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. తన వ్యాఖ్యలకు తానే బాధ్యురాలిననీ, తన తల్లిపై వేటు వేయడం సరికాదనీ ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యాఖ్యలకు తన తల్లిని శిక్షించడం సరికాదన్నారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలకు, స్వతంత్రంగా మాట్లాడే మహిళల గొంతుకకు విలువ లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ అధిష్టానం సీఎఉం మాటకు ఎంత ప్రాధాన్యత ఇస్తుందో, ఆయనకు వ్యతిరేకంగా అసమ్మతి గళం ఎత్తే సీనియర్ నేతలకూ అంతే ప్రాధాన్యత ఇస్తుంది. దీంతో కాంగ్రెస్ సీఎం ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది. కాంగ్రెస్ అధికారంలో ఉన్న పార్టీ సీఎంలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఇదేనని చెప్పాలి.
ఒక్క ఆంధ్రప్రదేశ్ అనే కాదు.. దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ సొంత కాళ్లపై నిలబడాలన్నదే బీజేపీ విధానమని విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు. గతంలో ఏపీలో బీజేపీ మద్దతు వల్లే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందనీ, ఈ వాస్తవాన్ని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ బహిరంగ వేదికలపై స్పష్టంగా చెప్పారని విష్ణువర్ధన్ రెడ్డి గుర్తు చేశారు.
రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రంలో ఇరిగేషన్ సదుపాయాలను మెరుగుపరిచేందుకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా పూర్తవుతుండటంతో, ఇరిగేషన్ రంగంపై మాట్లాడటానికి ప్రతిపక్షానికి ఎలాంటి అవకాశాలు లేకుండా పోయాయని ఆయన కుండబద్దలు కొట్టారు.
జలయజ్ణం పేరుతో వైఎస్ చేసింది ధనయజ్ణమని విక్రమ్ పూల అన్నారు. ప్రాజెక్టుల అంచనా వ్యయం పెరగడం, ప్రాంతీయ సమతుల్యత లోపించడం, హెడ్ వర్క్స్ కంటే ముందుగా కాలువల తవ్వకం వంటి వాటికే వైఎస్ జలయజ్ణం పరిమితమైందని విక్రమ్ పూల వివరించారు.
కాంగ్రెస్ హైకమాండ్ మీనాక్షీ నటరాజన్ పై వేటు వేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. రాహుల్ గాంధీ నేతృత్వంలోని జాతీయ నాయకత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ వ్వవహారాలను చక్కదిద్దేందుకు భూపేష్ బగెల్ సమర్ధంగా పని చేయగలరని భావించి ఆ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.
తాను పూర్తిగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాననీ, వచ్చే ఎన్నికలలో పోటీ చేయననీ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ కూడా ప్రజా ప్రతినిథిగా, పొలిటికల్ లీడర్ గా సేవలందించిన అయ్యన్న పాత్రుడు హఠాత్తుగా రాజకీయాలకు రిటైర్మెంట్ అంటూ చేసిన ప్రకటన రాజకీయవర్గాలలో సంచలనం సృష్టించింది.
2019 ఎన్నికలలో వైసీపీ విజయంలో అప్పటి జగన్ పాదయాత్ర కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే అప్పట్లో.. జగన్ వాగ్దానాలపై ప్రజలలో నమ్మకం ఉండేది. ప్రజలతో ఆయన మమేకమయ్యేవారు.
రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో తెలుగుదేశం పార్టీ అధికార రేసులో లేకపోయినప్పటికీ.. రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తూనే ఉంది. అందుకే రాష్ట్రంలో రాజకీయ వేడ రగిలిన ప్రతి సందర్భంలోనూ తెలుగుదేశం ప్రస్థావన వస్తూనే ఉంటుంది.
తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపుతున్న పరిణామాలు ఇప్పుడు అత్యంత ఆసక్తికర మలుపు తిరిగాయి.
తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఆమె చూపు బీఆర్ఎస్ వైపు మళ్లిందా అన్న అనుమానాలకు తావిచ్చింది. కేబినెట్ నుంచి తనకు ఉద్వాసన పలికిన తరువాత మీడియాకు వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్న కొండా సురేఖ.. తాజాగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై ప్రశంసల వర్షం కురిపించారు.