యథా సీఎం..తథా అధికారులు..జగన్ పాలనలో ఐఏఎస్ లకు జైలు శిక్షలు!

Publish Date:May 7, 2022

Advertisement

ధ్రప్రదేశ్ లో జగన్ పాలనకీ.. ఆ రాష్ట్రంలో ఐఏఎస్ అధికారులకు కోర్టుల్లో శిక్షలకూ ఏదో అవినాభావ సంబంధం ఉన్నట్లుంది. ఏపీలో  సివిల్ సర్వీసెస్ అధికారులకు జైలు శిక్ష పడటమన్నది ఒక సాధారణ విషయంగా మారిపోయింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించడం అన్నది ఏపీలో అధికారులకు ఒక అలవాటుగా మారిపోయింది. సీనియర్ ఐఏఎస్ లు, నిజాయితీ అధికారులుగా పేరు పొంది, కెరీర్ లో ఒక్క రిమార్కు లేని అధికారులు కూడా జగన్ హయాంలో కంటెప్ట్ ఆఫ్ కోర్టు కుసులలో శిక్షలకు గురవుతున్నారు.  సాక్షాత్తూ చీఫ్ సెక్రటరీ సమీర్ శర్మ హైకోర్టుకు హాజరై తన కెరీర్ లో కోర్టు ముందు హాజరు కావడం ఇదే తొలిసారని ధర్మాసనం ముందు మొరపెట్టుకున్నారు. అంటే కోర్టు ఆయన తప్పేం లేకుండా హాజరు కావాల్సిందిగా ఆదేశించిందని కాదు.. ఇంత కాలం నిబంధనలను కచ్చితంగా పాటించిన ఆయన జగన్ హయాంలో అందుకు విరుద్ధంగా చేసి విచారణకు కోర్టుకు హాజరు కావలసి వచ్చింది. 

ఇంతకీ ఆయన కోర్టు ముందు హాజరైంది ఒక్క సారే.. కానీ ఆయన కింద పని చేస్తున్న ఐఏఎస్ లు మాత్రం కోర్టు ఎదుట చేతులు కట్టుకు నిలబడటమే కాదు.. శిక్షలకు కూడా గురౌతున్నారు. జరిమానాలు కడుతున్నారు. జైలు శిక్షకు బదులుగా సామాజిక సేవ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఐఏఎస్ లు కోర్టు ముందు హాజరు కావడం, శిక్షలకు గురి కావడం ఇప్పుడొక సెన్సెషనల్ వార్తగా ఎవరూ భావించడం లేదు. అదో రోజు వారీ కార్యక్రమం అన్నట్లుగా ఎవరూ పట్టించుకోవడం లేదు. 

తాజాగా నిజాయితీ పరురాలైన అధికారిగా, నిబంధనలను నిక్కచ్చిగా అమలు చేసే సాహసోపేతమైన అధికారిగా గుర్తింపు పొందిన పూనం మాల కొండయ్యకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. ఇంకా ముందు ముందు  మరిన్ని శిక్షలు ఎదురు చూస్తున్నాయా అంటే ఔననే సమాధానం వచ్చేటట్లే ఉంది. ఎందుకంటే హైకోర్టులో ఇంకా పలు కోర్టు ధిక్కరణ కేసులు పెండింగ్ లో ఉన్నాయి. వాటి విషయంలో తీర్పులు ఎలా వస్తాయన్నది ఊహించలేం కానీ.. ఇప్పటి వరకూ వచ్చిన తీర్పులను బట్టి చూస్తే ఆ ధిక్కరణ కేసుల్లో కూడా ఐఎఎస్ లు శిక్షలకు గురయ్యే అవకాశమే ఉంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ హయాంలో పని చేసిన పలువురు ఐఏఎస్ లు కూడా కోర్టు కేసులను ఎదుర్కొన్నారు. వారు ఎదుర్కొన్న కేసులన్నీ అప్పటి సీఎం తనయుడిగా ఉన్న జగన్ కు సంబంధించిన క్విడ్ ప్రోకో కేసులే కావడం గమనార్హం. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన హయాంలో ఐఏఎస్ లు కోర్టు విచారణలు ఎదుర్కొంటూ, శిక్షలకు గురౌతున్నారు. 

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.