ఆంధ్రప్రదేశా.. అత్యాచారాల ప్రదేశా?.. మహిళలపై పూటకో ఘోరం.. రోజుకో దారుణం

Publish Date:May 7, 2022

Advertisement

మహిళలకు ఇసుమంతైనా రక్షణ లేని పరిస్థితులు ఏపీలో నెలకొని ఉన్నాయి. అసలు ఆంధ్రప్రదేశా, అత్యాచారాల ప్రదేశా అనే సందేహం ఏర్పడేలా పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తుంటే.. ఏపీలో మహిళలు భద్రతా, రక్షణా కరవై దినదిన గండంలా బతుకీడుస్తున్నారు. జగన్ ఏలుబడిలో ఏపీ అరాచకత్వానికి చిరునామాగా మారిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దిశ చట్టం అంటూ ఆర్బాటంగా సీఎం జగన్ చేసిన ప్రకటనలన్నీ కాగితం మూటలుగానే మిగిలిపోయాయి.

ఒక దాని వెంట ఒకటిగా మహిళలపై అఘాయిత్యాలు వెలుగు చూస్తూనే ఉన్న ప్రభుత్వంలో మాత్రం వాటిని అరికట్టేదిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించవు. పైపైచ్చు అత్యాచార ఘటనలపై నిరసనలు వ్యక్తం చేస్తూ రాజకీయం చేస్తున్నారంటూ వైసీపీ మంత్రులు ఎదురుదాడులకు దిగుతున్నారు. మహిళలపై అకృత్యాలకు పాల్పడిన వారిని పట్టుకుని కేసులు నమోదు చేసే విషయంలో ఏ మాత్రం చొరవ చూపని పోలీసులు.. విపక్షాల ఆందోళనలపై ఉక్కుపాదం మోపడంలో మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం చూపిస్తున్నారు. 

మహిళల రక్షణ విషయంలో వైఫల్యాలపై ప్రభుత్వాన్ని, యంత్రాంగాన్ని నిలదీసి ప్రశ్నించాల్సిన ఏపీ మహిళా కమిషన్ ప్రభుత్వం తరఫున వకల్తాపుచ్చుకోవడానికే పరిమితమైంది. బాధితులకు భరోసాగా నిలబడాల్సింది పోయి బాధితులకు అండగా ఉండేందుకు వచ్చిన వారికే నోటీసులు ఇచ్చే పరిస్థితిలో ఉంది. ఇక పోలీసులైతే.. విచారణ లేకుండానే, వైద్య పరీక్షలు జరగకుండానే అత్యాచారం జరగలేదని ప్రకటించడం, నిందితులకు అనుకూలంగా మాట్లాడడానికే తమ శక్తియుక్తులన్నీ ఉపయోగిస్తున్నారు. 

తెనాలి రైల్వే స్టేషన్ లో జరిగిన ఘటన విషయంలో సాక్షాత్తూ హోంమంత్రి నేరస్తులను వెనకేసుకొచ్చే విధంగా మాట్లాడారు. మహిళా హోంమంత్రి అయ్యుండీ.. దొంగతనం కోసం వచ్చిన వాళ్లు అనుకోకుండా తోపులాట జరిగి అత్యాచారం చేశారని చెప్పడం ప్రభుత్వానికి మహిళలపై జరిగిన అఘాయిత్యాలపై చర్యలు తీసుకునే ఉద్దేశమే లేదా అన్న అనుమానాన్ని కలిగించేలా ఉన్నాయి. మరో సంఘటనలో హత్యాచారానికి గురైన మహిళది ఆత్మహత్య అని చెప్పడానికి సదరు ఎస్పీ పడిన తాపత్రేయం దిగ్భ్రమ కలిగించక మానదు. మృతదేహంపై గాయాలు కనిపిస్తున్నా.. ఇంకా పోస్టుమార్టం నివేదిక రాకున్నా..అత్యాచారం జరగలేదనీ, ఆ మహిళ ఆత్మహత్య చేసుకుందనీ మీడియాకు చెప్పడం.. నిందితులను కాపాడటానికి చేసిన ప్రయత్నమే తప్ప మరొకటి కాదని విమర్శలు వెల్లువెత్తాయి. మొత్తానికి ఏపీలో మహిళలకు భద్రత, రక్షణ లేని పరిస్థితులు ఉన్నాయి. అసలు రాష్ట్రంలో ప్రజా ప్రబుత్వం ఉందా అని అనుమానం కలిగేలా జగన్ సర్కార్ తీరు ఉంది.  

By
en-us Political News

  
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
హైదరాబాద్‌ నగరంలో శాంతిభద్రతల నిర్వహణను మరింత సమర్థంగా చేపట్టేందుకు పోలీస్‌ శాఖలో భారీ పునర్వ్యవస్థీకరణ చేపట్టారు.
దసరా పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
ఖైరతాబాద్‌ అసెంబ్లీ ఉపఎన్నికపై ఉత్కంఠ కొనసాగుతోంది.
ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిలో తీవ్రంగా గాయపడినా.. అసాధారణ ధైర్యసాహసాలతో 174 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన
కృత్రిమ మేధ (AI) ప్రపంచాన్ని వేగంగా మార్చేస్తున్న వేళ.. దాని భవిష్యత్తుపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో సెప్టెంబర్ 22న జరిగిన 18 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని ఇంద్రపల్లి హరిణి హత్య ఉదంతం
మోసపోయాం.. గోసపడుతున్నాం..సీఎం రేవంత్‌పై కేటీఆర్ ఆగ్రహం.!
రంగారెడ్డి జిల్లా నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో కోకాపేట్‌ నియోపోలిస్‌ వద్ద ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.
ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి అత్యంత వేడెక్కింది
విద్యావలయంలో గంజాయి మొక్క కలకలం..!
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.