జగన్ ది అవగాహనా రాహిత్యం.. అజ్ణానం.. మంత్రి నారాయణ

Publish Date:Apr 2, 2026

Advertisement

అమరావతికి చట్టబద్ధత విషయంలో  ధర్మమే గెలిచిందని ఏపీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన జగన్మోహన్ రెడ్డి ఆడిన మూడు ముక్కలాట ముగిసిందన్నారు.  చట్టసభలో అమరావతే రాజధాని అని ఆమోదం పొందినా, వైసీపీ నేతలు అవగాహన లేకుండా ప్లాట్లు, ఖర్చులంటూ అవగాహనా రాహిత్యంతో వ్యాఖ్యలు చేస్తూ తమ అజ్ణానాన్ని చాటుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

 ఇప్పటికే 70,790 ప్లాట్లు కేటాయించామని, ఇంక కేవలం 650 మందికి మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.  డేటా తెలుసుకోకుండా మాట్లాడటం మానుకోవాలన్నారు.  తన బొమ్మ కోసం సర్వే రాళ్లపై 750 కోట్లు, పాస్‌బుక్‌ల కోసం పాతిక కోట్లరూపాయల ప్రజాధనాన్ని తగలేసిన జగన్, తన సొంత విలాసాల కోసం రుషికొండ ప్యాలెస్ కట్టుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తు కోసం రాజధానిని నిర్మిస్తోందన్న నారాయణ..  అమరావతి వంద  శాతం సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ అని చెప్పారు.

 ప్రభుత్వం దగ్గరున్న 5,000 ఎకరాలు అమ్మి తీసుకున్న రుణాలు తీరుస్తామని, ప్రజల పన్ను నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయబోమని స్పష్టం చేశారు. హైదరాబాద్ కంటే అద్భుతంగా అంతర్జాతీయ స్థాయి క్రీడా స్టేడియంలు, ఎయిర్‌పోర్ట్‌లతో అమరావతిని తీర్చిదిద్దుతున్నామన్న నారాయణ..  2028 ఆగస్టు నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. లోక్‌సభలో బిల్లు పెట్టిన రోజే ప్రజలను పక్కదారి పట్టించేందుకు జగన్ మావిగన్ పేరుతో మరో కుట్రకు తెరలేపారని, ఇలాంటి పచ్చి అబద్ధాలను ప్రజలు నమ్మరన్నారు.

By
en-us Political News

  
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో డ్రగ్స్ సంస్కృతి ఒక పెను సవాలుగా మారింది. ఇటీవలి కాలంలో రాజకీయ నాయకులు, ప్రముఖుల పేర్లు డ్రగ్స్ కేసుల్లో వినిపిస్తుండటం సమాజంలో తీవ్రసంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్తవ వేదిక చర్చలో డోలేంద్ర ప్రసాద్, కంఠంనేని రవిశంకర్ లు ఇది కేవలం శాంతిభద్రతల సమస్య మాత్రమే కాదనీ, సమాజ భవిష్యత్తుకు పెనుముప్పుగా పరిణమించిన ఒక సామాజిక రుగ్మత అని పేర్కొన్నారు.
ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో విజయ్ రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఈ క్రమంలోనే జననాయగన్‌ సినీమా విడుదలపై నెలకొన్న అనిశ్చితిని ఆయన ప్రజల ముందు ఉంచారు. అలాగే.. కరూర్ ప్రాంతంలో చోటుచేసుకున్న విషాద ఘటనను ప్రస్తావిస్తూ.. అది యాధృచ్ఛికంగా జరిగింది కాదని, దాని వెనుక కూడా లోతైన కుట్ర దాగి ఉందన్న అనుమానాలున్నాయన్నారు.
నిజానికి తాను రాజ‌కీయ స‌న్యాసం చేసిన‌ట్టు చెబుతూనే ఉన్నా.. ఇప్ప‌టికీ ఆయ‌న‌ త‌న టీం ద్వారా అకౌంట్ స‌ర్వీసెస్ అందిస్తూనే ఉన్నారు. ఆపై జ‌గ‌న్ కి లోపాయికారిగా సహకరించేందుకే ఈ రాజీనామా డ్రామాల‌ని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బేసిగ్గా విజ‌య‌సాయిరెడ్డి కామెంట్ చేయాల్సింది ఏదైనా ఉందంటే.. ఇటీవ‌ల జ‌గ‌న్ అర్ధంప‌ర్దం లేకుండా చేసిన మావిగ‌న్ అనే ప్ర‌తిపాద‌న‌ మీదే. కానీ రేణుక చౌద‌రి స‌భ‌లో లేవ‌నెత్తిన క‌మ్మ‌రావ‌తిని ప‌ట్టుకుని.. పోస్టులు పెట్ట‌డం స‌రికాద‌ంటున్నారు.
రాజ్యసభలో అమరావతి చట్టబద్ధత బిల్లుకు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, టీఎంసీ, ఆప్, బీజేడీ, ఆర్జేడీ, బీఆర్ఎస్, జేడీ(యూ), శివసేన మద్దతు ఇచ్చాయి. రాజ్యసభలో అమరావతి చట్టబద్ధతపై జరిగిన చర్చలో 11 పార్టీలు పాల్గొన్నాయి.
గురువారం సాయంత్రం రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు జరుపుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇక 2015లో దేశంలోని వివిధ పుణ్యక్షేత్రాల నుంచి తెచ్చిన పవిత్ర జలాలు, మట్టిని ఉంచిన ఉద్దండరాయునిపాలెంలో పర్యటించి, రాజధాని సంకల్పంలో పాల్గొన్నారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును రాజ్యసభలో సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఏపీ రాజధాని విషయంలో ఉన్న చట్టపరమైన అస్పష్టతను తొలగించేందుకు ఈ సవరణ అత్యవసరమని పేర్కొన్నారు. బిల్లుపై జరిగిన చర్చ అనంతరం, సభాపతి సి.పి. రాధాకృష్ణన్ క్లాజ్ వారీగా ఓటింగ్‌ నిర్వహించగా సభ్యులు అనుకూలంగా ఓటు వేశారు. దీంతో అమరావతిని రాజధానిగా ఖరారు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి రాజ్యసభ ఆమోదం లభించింది.
. తాము అమరావతిని వ్యతిరేకించడం లేదనీ, అయితే రాజధాని పేరుతో సాగుతున్న పరిణామాలు, ఆర్థిక భారాలనే ప్రశ్నిస్తున్నామన్నారు. రైతుల నుంచి భూములు సేకరించి ఇన్నాళ్లు గడుస్తున్నా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని ఆయన విమర్శించారు.
అమరావతికి చట్టబద్ధత అమరావతి రైతుల నైతిక విజయంగా అభివర్ణించారు. సుదీర్ఘకాలం పాటు మొక్కవోని దీక్షతో రైతులు చేసిన పోరాటం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాజధాని ఉద్యమ సమయంలో పాలకులు ప్రయోగించిన అణచివేత చర్యలను ఈ సందర్భంగా రేణుకా చౌదరి గుర్తు చేశారు.
సీఎం హోదాలో నాడు అమరావతి శాసన రాజధాని , విశాఖ పరిపాలన రాజధాని , కర్నూలు న్యాయ రాజధాని అంటూ ఓ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. ఆ దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు పడకపోయినా.. అప్పటి వరకూ పరుగెడుతున్న అమరావతి నిర్మాణ పనులను నిలిపివేశారు.
దేశంలో ఉన్న అన్ని పార్టీల‌ను ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం వైపు నిలిపి అమ‌రావ‌తి బిల్లుకు చ‌ట్ట‌బ‌ద్ధ‌త క‌ల్పించిన ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని పార్ల‌మెంటు హాలులో గురువారం ఉదయం క‌లిసిన లోకేష్ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల త‌ర‌ఫున కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేశారు.
అమరావతి భవిష్యత్తు పై ఉన్న సందిగ్ధతకు శాశ్వతంగా తెరపడిందన్నారు. రైతుల త్యాగానికి, ప్రజల ఆకాంక్షలకు దక్కిన గౌరవం అని పేర్కొన్నారు. లోక్ సభలో అమరావతి బిల్లు ఆమోదం స్వర్ణాంధ్ర నిర్మాణంలో కీలక మైలురాయి అని పేర్కొన్న చంద్రబాబు.. అమరావతి ఇక అజేయం..అజరామరమన్నారు.
లోక్ సభలో ఈ బిల్లు ఆమోదం పొందడం అమరావతికి చట్టపరమైన రక్షణ దిశగా అత్యంత కీలక ముందడుగు పడినట్లైంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టగా, విస్తృత చర్చ అనంతరం మెజారిటీ సభ్యుల మద్దతుతో బిల్లును సభ ఆమోదించింది. సభలో ఈ బిల్లుపై దాదాపు రెండు గంటల పాటు చర్చ జరిగింది.
హిట్ అండ్ రన్ నేరాల కంటే అత్యంత ఘోరమైన నేరాలకు పాల్పడిన పార్టీగా విమర్శించారు. రాజకీయ లబ్ధి కోసం ఆ పార్టీ చేస్తున్న ప్రచారాన్ని దుయ్యబట్టారు. అలవోకగా అబద్ధాలు చెబుతూ, వాస్తవాలను వక్రీకరిస్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తోందని వైసీపీ పేరు చెప్పకుండానే ఆ పార్టీపై విమర్శలు గుప్పించారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.