రాష్ట్రంలో అధికారం కోల్పోయిన నాటి నుంచి వైసీపీ నేతలు ఒకరి తరువాత ఒకరు చిక్కుల్లో పడుతున్నారు. వైసీపీ ఇటీవలి సార్వత్రిక ఎన్నికలలో ఘోర పరాజయం మూటగట్టుకున్న తరువాత ఈ ఐదు నెలల కాలంలో పలువురు నేతలు కేసులను ఎదుర్కొంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని సాగించిన అరాచకం, దోపిడీ, దాడులు, దౌర్జన్యాల కారణంగా న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొంటున్నారు.
ఇప్పుడు తాజాగా ఆ జాబితాలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ చేరారు. గ్రంథి శ్రీనివాస్ 2019 ఎన్నికలలో భీమవరం నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. అప్పట్లో ఆయన జేనసేనాని పవన్ కల్యాణ్ పై 8300 ఓట్ల మెజారిటీతో విజయం సాధించి సంచలనం సృష్టించారు. అయితే 2024 ఎన్నికలలో ఆయన అదే నియోజకవర్గం నుంచి తెలుగుదేశం కూటమి అభ్యర్థి పులపర్తి రామాంజనేయులుపై 13,726 ఓట్ల తేడాతో పరాజయాన్ని మూటగట్టుకున్నారు.
ఆ తరువాత నుంచి ఆయన వైసీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. త్వరలో ఆయన వైసీపీకి గుడ్ బై చెబుతారన్న వార్తలు కూడా గట్టిగా వినిపిస్తున్నారు. ఈ తరుణంగా గ్రంథా నివాసాలు, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఆధ్వర్యంలో గ్రాంధి నివాసం, కార్యాలయం, రొయ్యల ఫ్యాక్టరీ, కృష్ణా జిల్లా నాగాయలంకలోని ఆయన కార్యాలయలపై ఏకకాలంలో దాడులు జరుగుతున్నాయి.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/it-raids-on-ycp-former-mla-grandhi-srinivas-25-187977.html
న్యాయవాది ఖాజా మొయిజుద్దీన్ హత్య కేసు మరోసారి చర్చనీయాంశంగా మారింది.
అమెరికాలో మరోసారి విషాదం చోటుచేసుకుంది. ఉపాధి కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన తెలంగాణకు చెందిన ఓ మహిళ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.
భారత పైలట్ చెప్పిన షాకింగ్ నిజాలు..!
ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (BSNL) తన చందాదారులను ఆకట్టుకునేందుకు మరో వినూత్నమైన ఆఫర్‌ను ముందుకు తెచ్చింది.
ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న భూ సమస్యల పరిష్కారంపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
భాగ్యనగరంలో వరుస ఘటనలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
పాతబస్తీ రాజకీయాల్లో కీలక నేతగా, ఎంఐఎం శాసనసభా పక్ష నేతగా కొనసాగుతున్న అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన తాజా వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి.
తెలంగాణ సాంస్కృతిక ఆత్మకు ప్రతీక అయిన బతుకమ్మ సంబరాలను ఈ ఏడాది అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది.
భార్యాభర్తల బంధం అంటే కష్టసుఖాల్లో ఒకరికొకరు తోడుగా నిలవడం.. జీవితాంతం కలిసి నడవడం. కానీ.. మధ్యప్రదేశ్‌లో ఓ భర్త డబ్బు కోసం ఆ బంధానికే తూట్లు పొడిచాడు.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి పైలట్ స్మిత్ మచ్చర్‌పై కో-పైలట్ హమామ్ అల్ హమామీ దాడికి పాల్పడిన ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది.
భారతదేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన యూపీఐ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది.
పెట్రోల్‌లో ఇథనాల్ కలపడాన్ని ప్రోత్సహిస్తున్న కేంద్ర ప్రభుత్వ తాజా విధానాలు ఇప్పుడు సామాన్యుల వంటగదిపై తీవ్ర ప్రభావం
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి.