వివేకా కేసులో సీబీఐకి షర్మిల సాక్ష్యం! వైఎస్ భారతీ జగన్ రెడ్డి బుక్కైనట్టేనా? 

Publish Date:Jan 2, 2022

Advertisement

2022 సంవత్సరంలో ఏపీ సీఎంకు చుక్కలు కనిపించబోతున్నాయా? జగన్ రెడ్డి పదవికి గండమేనా? అంటే వైసీపీ వర్గాల నుంచే అవుననే సమాధానమే వస్తోంది. అక్రమాస్తుల కేసులో కోర్టు విచారణకు జగన్ హాజరుకావాలంటూ దాఖలైన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టులో విచారణ ముగిసింది. తీర్పు రిజర్వ్ లో ఉంది. ఆ కేసులో జగన్ కు వ్యతిరేకంగా తీర్పు వస్తే ఆయన రాజీనామా చేసే అవకాశాలుంటాయి. అదే సమయంలో జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ పైనా హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ కేసులో వ్యతిరేక తీర్పు వచ్చినా జగన్ పదవికి గండమే. ఒకవేళ హైకోర్టులో జగన్ కు అనుకూలంగా తీర్పు వచ్చినా.. సుప్రీంకోర్టుకు వెళతానని ప్రకటించారు ఎంపీ రఘురామ. ఇది కూడా జగన్ కు ఇబ్బందికరమే. 

ఇక వైఎస్సార్ కుటుంబంలో విభేదాలు తీవ్ర స్థాయికి చేరాయని అంటున్నారు. ఫ్యామిలీలో జగన్ ఒంటరి అయ్యారని తెలుస్తోంది. క్రిస్మస్ సందర్భంగా ఇడుపాలపాయకు వెళ్లిన జగన్... కుటుంబంతో కాకుండా సింగిల్ గానే వైఎస్సార్ ఘాట్ దగ్గర నివాళి అర్పించారు. తల్లి విజయమ్మ కూడా ఆయనతో కనిపించలేదు. ఇడుపుల పాయ గెస్ట్ హౌజ్ లో జగన్ తో షర్మిల గొడవ పడ్డారని, రాత్రికి రాత్రే అక్కడినుంచి వచ్చేసిందనే ప్రచారం జరిగింది. ఆస్తి విషయంలో కొన్ని రోజులుగా జగన్ తో గొడవ పడుతున్న షర్మిల.. ఇప్పుడు తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయిందని అంటున్నారు. అందుకే అన్న సంగతి తేలుస్తానంటూ ఆమె శపథం చేస్తుందని తెలుస్తోంది. షర్మిలకు తల్లి విజయమ్మతో పాటు వైఎస్ కుటుంబం మద్దతు ఉందని అంటున్నారు.

ఇన్ని సమస్యలు ఉన్న జగన్ కు వైఎస్ వివేకా హత్య కేసు మరిన్ని చిక్కులు తెచ్చిపెట్టడం ఖాయమని అంటున్నారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ ను ఫిక్స్ చేసే అవకాశం షర్మిలకు లభించిందని తెలుస్తోంది. ఈ కేసులో ఆమెను సాక్ష్యం చెప్పమని సీబీఐ అధికారులు సంప్రదించారట. దానికి ఆమె అంగీకరించి ప్రాథమికంగా కొన్ని వివరాలు చెప్పారని.., స్టేట్ మెంట్ ఇవ్వడానికి కూడా సిద్ధపడుతున్నారని సమాచారం. వివేకా హత్య కేసులోకి భారతీరెడ్డిని షర్మిల లాగేసిందని తెలుస్తోంది. వివేకా హత్య జరిగిన తర్వాత ఎంపీ అవినాష్ రెడ్డి ఎవరెవరికి ఫోన్లు చేశారో బయటకు తీసిన సీబీఐ.. వారిలో భారతీరెడ్డి కూడా ఉన్నారని తేల్చారట. దీంతో భారతీరెడ్డిని కూడా సీబీఐ ప్రశ్నించడానికి రెడీ అవుతోందని అంటున్నారు. భారతీరెడ్డికి సంబంధించిన మరిన్ని కీలక అంశాలను సీబీఐకి చెప్పేందుకు షర్మిల సిద్ధమవుతున్నారని తెలుస్తోంది.నదీంతో  వైఎస్ వివేకా హత్య కేసును సీబీఐ చేధిస్తే వైసీపీ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుందుూ, జగన్ అక్రమాస్తుల కేసు కన్నా ఇదే పెద్ద సమస్య అయ్యే అవకాశ ఉందంటున్నారు.

మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై సీబీఐ కేసులు తేలుతాయో లేదో కానీ ఈడీ కేసులు మాత్రం త్వరలోనే తేలిపోతాయన్న అభిప్రాయం కొంత కాలంగా ఉంది. ఈడీ కేసుల్లో తాను మళ్లీ జైలుకు వెళ్లాల్సి వస్తే.. తన తర్వాత సీఎం చాయిస్‌గా భారతీరెడ్డిని జగన్ రెడీ చేస్తున్నారని అంటున్నారు. పాలనా వ్యవహారాల్లో ఇప్పటికే ఆమె జోక్యం చేసుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. అయితే షర్మిలకు మాత్రం ఇది ఇష్టం లేదట. అందుకే ఆమె భారతీరెడ్డిది కాదని సీఎం జగన్ తల్లి విజయలక్ష్మికి తెరపైకి తెచ్చారని చెబుతున్నారు. జగన్ తర్వాత ఎట్టి పరిస్థితుల్లో భారతీరెడ్డికి చాన్స్ ఇవ్వకూడదని తల్లి విజయలక్ష్మికే అవకాశం ఇవ్వాలని షర్మిల పట్టుబడుతున్నట్లుగా చెబుతున్నారు. ఇందులో భాగంగానే వివేకా హత్య కేసులో భారతీ రెడ్డిని ఇరికించేలా షర్మిల ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అదే జరిగితే ఏపీలో సంచనలం జరగడంతో పాటు వైఎస్ కుటుంబంలోనూ కీలక పరిణామాలు జరగడం ఖాయంగా కనిపిస్తోంది. మొత్తంగా 2022లో జగన్ రెడ్డికి చిక్కులు తప్పవనే అభిప్రాయం వైసీపీ వర్గాల్లోనే వ్యక్తమవుతోంది. 

By
en-us Political News

  
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
కాంగ్రెస్, కమ్మూనిస్టుల మద్దతుతో ఎన్నికల బరిలోకి దిగిన ఏబీవీకి ఘోర పరాజయం ఎదురైన సంగతి తెలిసిందే. కమ్యూనిస్టులకు అంతో ఇంతో పట్టున్న ప్రాంతాలలో కూడా ఆయనకు ఓట్లు రాలలేదు. ఇక కాంగ్రెస్ మద్దతు ఆయనకు ఎందుకూ కొరగాకుండా పోయింది. 
ఈ వేడుకలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కేటీఆర్,   విజయ్ ఒకే దగ్గర చేరి సరదాగా ముచ్చటించుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.  
 నామినేషన్ల ఉపసంహరణ గడువు  ముగిసే నాటికి  రాష్ట్ర వ్యాప్తంగా  77 జడ్పీటీసీలు, 2051 ఎంపీటీసీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.  ఇక మిగిలిన స్థానాలకు పోటీ పడుతున్న 21 వేల 012 మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు.
వైసీపీపై అధికార కూటమి ఒత్తిడి, అక్రమాలు ఉన్నప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారని పరోక్షంగా వ్యాఖ్యానించి, ప్రజా క్షేత్రంలో వైసీపీ బలహీనంగా ఉందని చెప్పకనే చెప్పారు.  గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరు కారణంగానే నేడు వైసీపీకి ఈ గతి పట్టిందంటూ అంబటి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
పాడిందే పాటరా అన్న సామెత చందంగా ఉంది జగన్ తీరు. ఆంధ్రప్రదేశ్‌లో   మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర నిరాశను మిగిల్చాయి. గతంలో 2024 సార్వత్రిక ఎన్నికల ఓటమి తర్వాత ఏ విధంగానైతే ఈవీఎంలు, ఎన్నికల సంఘాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తప్పుపట్టారో, ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల ఫలితాల విషయంలోనూ అదే పాతరాగాన్ని అందుకున్నారు.
2024 ఎన్నికలలో విశాఖ జనం జగన్ విశాఖ రాజధాని ప్రతిపాదనను తిరస్కరించారు. ఇప్పుడు జగన్ మావిగన్ ప్రతిపాదనను మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు జనం ఓటుతో తోసి రాజన్నారు. 
 2021 లో జగన్ మోహన్ రెడ్డి కుప్పంలో నాటిన విత్తనం మహావృక్షమై దాని వేర్లు పులివెందుల వరకు పాకుతాయని జగన్   ఊహించి ఉండరు. 2021 జగన్ కుప్పం మునిసిపాలిటీ ని తెలుగుదేశంకు దక్కకుండా చేసి, చంద్రబాబు ముఖం ఇప్పుడు చూడాలి అన్న పరుష వ్యాఖ్యలే పులివెందులతో  పులివెందులపై తెలుగుదేశం గట్టిగా నిర్ణయం తీసుకోవడానికి కారణమైంది. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.