శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర.. ప్రశాంత్ కిషోర్ పొలిటికల్ డ్రామానా?
Publish Date:Mar 4, 2022
Advertisement
తెలంగాణ రాష్ట్రంలో ఏదో జరుగుతోంది. కానీ అది ఏమిటో ఎవరి అర్థం కావడం లేదు. ఒక్క అధికార టీఆర్ఎస్ పార్టీకి తప్పా. మంత్రి శ్రీనివాసగౌడ్ హత్యకు కుట్ర.. అందులో బీజేపీలోని కీలక నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డిలు పాత్ర.. అంటూ మీడియాలో కథనాలు వెల్లువెత్తాయి. ఈ ఆసక్తికర పరిమాణామాలను తెలంగాణ సమాజం చాలా ఆసక్తిగా గమనిస్తోంది. ముచ్చటగా మూడోసారి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవడం కోసం సీఎం కేసీఆర్.. ప్రశాంత్ కిషోర్‌తో ఒప్పందం చేసుకున్నారు. ఇటీవల కేసీఆర్ ఫామ్ హౌస్‌లో వారిద్దరు భేటీ అయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజులకే మంత్రి శ్రీనివాస గౌడ్ హత్యకు కుట్ర ఎపిసోడ్ తెరపైకి రావడంతో అందరిలోనూ అనుమానం? ఇది ఆయన పనేనా? బీహారీ బాబు పాలిటికల్ గేమేనా? అనే డౌట్. మంత్రి శ్రీనివాస్ గౌడ్, డీకే అరుణ, జితేందర్ రెడ్డిలది.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లానే. అక్కడ కారు జోరు బాగా తగ్గిందని సమాచారం. ఓ వైపు బీజేపీ బలంగా పుంజుకుంటే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా రైజింగ్‌లో ఉంది. అదీకాక ఇటీవల టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. పాలమూరు సభకు భారీగా జనాలు తరలి వచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లాలో కొద్దొ గొప్పో బలం ఉన్న బీజేపీలాంటి పార్టీకి గట్టి దెబ్బ పడితే.. బలం పుంజుకోంటున్న కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో డిపాజిట్ వచ్చే అవకాశం ఉండదనే కాన్సెప్ట్‌తో.. ఈ హత్య తాలుక వ్యూహా రచనకు శ్రీకారం జరిగినట్లు తెలుస్తోంది. ఇక.. ఏ రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీతో ప్రశాంత్ కిషోర్ ఒప్పందం చేసుకుంటే.. ఆ రాష్ట్రంలో కత్తి నుంచి కొడి కత్తి వరకు.. నాటు బాంబు నుంచి సెవనో క్లాక్ బ్లేడ్ ముక్క వరకు.. దేనినీ వదలకుండా తనదైన చాణక్యంలో.. ప్రజలకు సెంట్‌మెంట్ అనే అయింట్‌మెంట్ రాసి.. తద్వారా ఒప్పందం చేసుకున్న రాజకీయ పార్టీలకు అధికార పీఠం అప్పగించి.. తన కాంట్రాక్ట్ పూర్తి అయిందంటూ ఒప్పందం ప్రకారం ఇచ్చిన నగదుతో మరో రాష్ట్రంలో రాజకీయాన్ని ఎరుపెక్కించేందుకు రాజమౌళి సినిమాలో ఈగలాగా తుర్రున ఎగిరిపోతాడు. అలాంటి పీకే డైరెక్షన్‌లోనే ఈ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై మర్డర్ అటెంప్ట్ ఎపిసోడ్ రక్తి కట్టిస్తున్నారని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/is-pk-political-drama-behind-srinivas-goud-episode-39-132577.html





