పేర్ని నానిది ఫస్ట్రేషనేనా?

Publish Date:Jul 12, 2022

Advertisement

జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తాజా మాజీ  మంత్రి పేర్ని నానీ  వ్యాఖ్యలు, వాటికి కౌంటర్‌గా పవన్ కల్యాణ్ సోదరుడు నాగబాబు,  ట్వీట్  కౌంటర్ ప్రస్తుతం సామాజిక మాధ్యమంలో వైరల్ అవుతున్నాయి.  వైసీపీలోని కొందరు మరీ ముఖ్యంగా  పేర్ని నాని  వంటి వారు నోటి విరోచనాలతో బాధపడుతున్నారని నాగబాబు ఘాటుగా రిటార్డ్ ఇచ్చారు. పేర్నికి ఇప్పుడు కావలసింది తేలికగా జీర్ణమయ్యే ఆహారం మాత్రమేననీ, బందరులో   వైద్యుడు ఉంటే.. ఆయన నోటి విరోచనాలకు మందు ఇవ్వాలని కోరుతున్నాననీ నాగబాబు ఇచ్చిన కౌంటర్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అవుతోంది.  

అదే సమయంలో జనసేనానిపై పేర్ని నాటి వ్యాఖ్యలపై కూడా  నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్లీనరీలో ఇష్టారీతిన మాట్లాడి జగన్ వద్ద మార్కులు కొట్టేయడానికి చేసిన ప్రయత్నం ఫ్లాప్ అయ్యిందని పేర్ని నానిని నెటిజన్లు ఎద్దేవా చేస్తున్నారు. ఎంత తాపత్రేయపడినా నానికి మార్కులు పడలేదనీ, మరో తాజా మాజీ మంత్రి అనీల్ కుమార్ జగన్ వద్ద గుడ్ విల్ సంపాదించేశాడన్న దుగ్ధతోనే, ఫ్రస్ట్రేషన్ తోనే   ప్లీనరీ ముగిసిన 24 గంటల తర్వాత మళ్లీ మీడియా ముందుకు వచ్చి మరీ పవన్ కల్యాణ్ మీద ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.  

 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో నవరత్నాలంటూ ఇచ్చిన హామీలు నకిలీవని ఇప్పుడు తేలిపోవడం నిజం కాదా అని ప్రశ్నిస్తున్నారు. మీడియా సమావేశంలో పేర్ని నాని జనం జగన్ ను నమ్మారు, నమ్మారంటూ పదేపదే చెప్పడాన్ని కూడా ప్రశ్నించి ఎద్దేవా చేస్తున్నారు.

నిజంగా జగన్ ను జనం నమ్మి ఉంటే  ప్రశాంత్ కిశోర్ వ్యూహాల అవసరమేమిటని ప్రశ్నించారు.  ఇటీవల బందరులో స్థానిక ఎంపీ బాలశౌరి పర్యటనను అడ్డుకొనేందుక నీ రైట్ హ్యాండ్ స్థానిక కార్పొరేటర్‌, నీ కుమారుడి జాన్ జిగ్రీ దోస్త్‌ను ఎగదోసి... ఆ తర్వాత జగన్, సజ్జల చేత అక్షింతలు వేయించుకొన్న పేర్ని నాని,   తాడేపల్లి ప్యాలెస్ కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి వద్ద ఘొల్లు మని ఏడ్చింది నిజంకాదా అని నిలదీస్తున్నారు.  వచ్చే ఎన్నికల్లో బందరులో తన గెలుపు సాధ్యం కాదని ముందే తెలుసుకున్ననాని, ఓటమి బలిపీఠంపై కుమారుడు  పేర్ని కిట్టును నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు 

By
en-us Political News

  
ఒక దశలో తన రిటైర్మెంట్ తరువాత టీడీపీలో చేరేందుకు కూడా తాను సిద్ధపడ్డాననీ, అవసరమైతే  ఎన్నికల బరిలో దిగడానికి కూడా రెడీ అయ్యాయనీ చెప్పిన ఏబీ వెంకటేశ్వరరావు, అ
బీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, ప్రముఖ దళిత నేత, మాజీ ఎంపీ విద్యాసాగర్ సోన్‌కర్, అలాగే అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రెండుసార్లు బాధ్యతలు నిర్వర్తించిన రాధాకాంత్ ఓఝా వంటి వారికి చోటు లభించింది.
జిల్లాలో పార్టీ పరిస్థితి వేగంగా దిగజారిపోతోంది. మజ్జి పార్టీని వీడటంతో జాగ్రత్త పడాల్సిన పార్టీ హైకమాండ్, అలాగే బొత్స సత్యనారాయణ చేతులెత్తేసినట్లు కనిపిస్తోంది. అంతే కాకుండా కూర్చున్న కొమ్మనే నరుక్కున్న చందంగా అసంతృప్తులను బుజ్జగించాల్సింది పోయి వారిపై సస్పెన్షన్ వేటు వేయడంతో జిల్లాలో పార్టీని జీరో నుంచి బిల్డ్ చేద్దామనుకుంటున్నారా? లేక జిల్లా పార్టీని వదిలేశారా అన్న అనుమానాలు పార్టీ శ్రేణుల నుంచే వస్తున్నాయి. 
ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలో ప్రతి క్షణం ఒక కొత్త మలుపు తిరుగుతోంది.
పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వ్యక్తం అవుతున్న అభిప్రాయం ఏమిటంటే.. మీడియా సమావేశాలలో జగన్ మాట్లాడే విధానం కంటే విజయసాయి రెడ్డి మాట్లాడే విధానం చాలా చాలా బెటర్ అని. 
అయితే ఆయన  తాజాగా   నిర్వహించిన కార్యకర్తల సమావేశం మాత్రం భిన్నంగా జరిగింది. ఆ సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు,  వ్యక్తం చేసిన అసహనం వైసీపీవర్గాలలో  కలకలం రేపింది. 
జనసేన, బీజేపీ నాయకులు ప్రభుత్వ కార్యక్రమాల్లో పెద్దగా భాగస్వాములు కావడం లేదు.  ప్రతి నెలా పెన్షన్ల పంపిణీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు చురుకుగా పాల్గొంటుంటే.. జనసేన, బీజేపీ నాయకుల భాగస్వామ్యం నామమాత్రంగా ఉంటోందనీ, ఇది కూటమి పార్టీల మధ్య సమన్వయ లోపం ఉందా అన్న అనుమానాలను కలిగిస్తోందనీ సర్వేలో వెల్లడైన జనాభిప్రాయం. 
ఈ ప్రధాన పార్టీల వ్యూహాలకు తోడుగా మరికొన్ని రాజకీయ  పార్టీలో కూడా తమ ఉనికిని బలంగా చాటేందుకు ఖైరతాబాద్ ఉప ఎన్నిక బరిలోకి దిగడానికి సిద్ధమౌతున్నాయి. కల్వకుంట్ల కవిత నేతకూడా రంగంలోకి దిగుతుండటంతో పోటీ ఊహించని మలుపు తిరుగుతోంది.  
గత కొన్నేళ్లుగా  చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో ఒకే వేదికను పంచుకుంటూ వచ్చారు.  ముఖ్యమైన ప్రజా వేడుకల్లో వీరిద్దరూ కలసి పాల్గొనడం ఆనవాయితీగా మారింది. అయితే గత కొద్ది నెలలుగా ఇరువురూ ఒకే వేదికపై కనిపించడం లేదు. 
 విదేశీ పర్యటన ముగించుకుని ఇప్పటికే రాష్ట్రానికి తిరిగి వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు,  తన విధుల్లోకి నిమగ్నమయ్యారు. నేరుగా నెల్లూరు జిల్లాకు చేరుకుని  పల్లె పండుగ కార్యక్రమంలో ఆయన ఉత్సాహంగా పాల్గొన్నారు.
రామాయణం ప్రకారం లంకకు బయలుదేరే ముందు శ్రీరాముడు స్వయంగా మహాదేవుడిని పూజించాడని, ఈ చారిత్రక, పౌరాణిక విషయాలపై  అవగాహన లేని రేవంత్ వంటి వారు ఇటువంటి కువిమర్శలు చేస్తున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.
ప్రాథమిక దశలో ఈ మరణాన్ని సాధారణ గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నాలు జరగడం, ఆ తర్వాత హత్యగా తేలింది.  వైఎస్ హత్య వెనుక కొన్ని పెద్ద తలకాయల  ప్రయోజనాలు దాగున్నాయని వైఎస్ వివేకా కుమార్తె బహిరంగంగానే ఆరోపించారు.
బీఆర్ఎస్   బయటకు వచ్చిన తర్వాత కల్వకుంట్ల కవిత   తెలంగాణ రక్షణ పేన పేరుతో  కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. భౌగోళిక తెలంగాణ సిద్ధించినప్పటికీ ప్రజలు ఆశించిన ఆశయాలు నెరవేరలేదని.. సామాజిక తెలంగాణ సాధన ద్వారా మాత్రమే ప్రత్యేక రాష్ట్ర సాకారానికి సార్థకత లభిస్తుందని కవిత పదేపదే చెబుతున్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.