మనల్ని మనం ఇతరులతో పోల్చుకోవడం మంచిదేనా?

Publish Date:Oct 7, 2025

Advertisement

మనమందరం మన జీవితంలో ఏదో ఒక సమయంలో ఇతరులతో పోల్చుకుంటాము. కొన్నిసార్లు మనం ఇతరులను చూసి ఆశ్చర్యపోతుంటాము.  "అతనికి  నా కంటే మంచి ఉద్యోగం  ఎందుకు వచ్చింది?" "అతని దగ్గర పెద్ద కారు ఉంది,  నా దగ్గర లేదు ఎందుకు?" "అతను నా కంటే గొప్పగా ఎందుకున్నాడు?" ఈ ప్రశ్నలు మన మనస్సులను పదే పదే  సంఘర్షణలోకి నెట్టుతూ ఉంటాయి. ఎంత ఆపాలని అనుకున్నా ఆగవు. కానీ చాలామంది ఒకటి మరిచిపోతారు "నిన్నటి కంటే నేను మెరుగ్గా ఉన్నానా?" అని తమను తాము ఎప్పుడూ ప్రశ్నించుకోరు.

వ్యక్తి జీవితంలో గుర్తింపు అనేది ఇతరులతో పోల్చుకుంటే వచ్చేది కాదు.. జీవితంలో ఏదో ఒకటి నేర్చుకుంటూ,  ఏదో ఒకటి చేస్తూ ఉండటం ద్వారా  ఎదుగుతూ ఉంటే అప్పుడు గుర్తింపు వస్తుంది.  అందుకే ఇతరులతో పోల్చుకోవడం చాలా హానికరం అంటున్నారు వ్యక్తిత్వ విశ్లేషణ నిపుణులు.

ఇతరులతో పోల్చుకోవడం ఎందుకు హానికరం?

సాధారణంగా మన చుట్టూ జరిగే విషయాలను గమనించడం ద్వారా నేర్చుకోవడం మానవ స్వభావం. ఈ ప్రక్రియలో ఇతరులతో పోల్చుకోవడం కూడా జరుగుతుంది. ఇలా పోల్చుకోవడం ప్రారంభించినప్పుడు  తరచుగా నేర్చుకోవడంలో  విఫలమవుతాము. ఈ అలవాటు తెలియకుండానే  పెరుగుతుంది.  ఈ అలవాటు వ్యక్తులను  బలహీనపరుస్తుంది. దీని వల్ల  తమను తాము తక్కువ చేసుకుని చూసుకోవడం అనే పెద్ద తప్పు చేస్తుంటాం.

ఇతరులతో పోల్చుకుంటే జరిగేది ఇదే..

సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గుతుంది..

మనం పదే పదే ఇతరులతో పోల్చుకున్నప్పుడు, మన  ప్రయత్నాలు,  విజయాలు చిన్నవిగా అనిపిస్తుంటాయి.  ఎప్పుడూ ఇతరులకంటే తక్కువ అనుకుంటూ ఉంటే పెద్ద విజయాల వైపు ఆలోచన కూడా క్రమంగా తగ్గుతుంది.చేతులారా ఎదుగుదలను నరికేసుకున్నట్టే అవుతుంది.

మెదడుపై భారం పెరుగుతుంది..

సోషల్ మీడియాలో చాలామంది సక్సెస్ ఫుల్ లైఫ్ ను చూపిస్తూ ఉంటారు. తమ గెలుపును మాత్రమే చూపిస్తారు.  అయితే ఇలా కేవలం గెలుపును మాత్రమే చూసేవారికి గెలుపు వెనుక,  సంతోషం వెనుక కష్టం, బాధ,  ఇబ్బందులు ఇలా అన్నీ ఉంటాయి.   పోల్చుకున్నప్పుడు తమకు ఎప్పుడూ కష్టాలు, ఇబ్బందులు తప్ప సంతోషం అనేది లేదు అనే అభిప్రాయం ఏర్పడి మెదడుపై భారం పడుతుంది.

ఎదుగుదల తగ్గుతుంది..

 ఇతరుల జీవితాలపై మాత్రమే దృష్టి పెట్టినప్పుడు, మన స్వంత బలాలు,  కలలను మరచిపోతాము. మన ఆలోచన, సామర్థ్యం  తప్పుదారి పడుతుంది.  దీని వలన మనం చేయవలసిన పనులు సరైన ఎఫర్ట్ పెట్టి  చేయము.

కాబట్టి పోల్చుకునే అలవాటు మనిషిని పోటీ తత్వంలోకి తీసుకెళ్తుంది అనే మాటను పక్కన పెడితే మనిషిలో కాన్పిడెంట్ తగ్గించి జీవితంలో ఎదుగుదలను నెమ్మదిచేసే అవకాశమే ఎక్కువ. అందుకే పోల్చుకోవడం మంచిది కాదు.

                                     *రూపశ్రీ.

By
en-us Political News

  
చుట్టూ ఉన్నవాళ్లు అందరూ మంచివాళ్లు ఉండరు. మనుషుల్లో మంచి, చెడు రెండూ ఉంటాయి. కానీ కొందరిలో స్వార్థం..
నేటి వేగవంతమైన జీవితంలో మనుషులకు అన్ని భౌతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్నప్పటికీ, రెండు విషయాలలో మాత్రం  వెనుకబడిపోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. మొదటిది గాఢమైన, నిజమైన సంబంధాలను నిలబెట్టుకోవడం కాగా, రెండవది మనశ్శాంతి లేకపోవడం
ప్రతి ఒక్కరూ దీర్ఘాయువును కోరుకుంటారు. ప్రతి ఒక్కరూ వృద్ధాప్యాన్ని యవ్వనంలో ఉన్నంత ఆరోగ్యంగా, అద్భుతంగా గడపాలని, 100 ఏళ్ల వరకు బ్రతకాలని,  ఆ వయసులో కూడా ఎలాంటి వ్యాధులు లేకుండా ఉండాలని కోరుకుంటారు.
ప్రపంచంలో ప్రతి ప్రాణికి ఆరోగ్యం ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మనిషికి ఏ మాత్రం అనారోగ్యంగా అనిపించినా మొదట వైద్యుడిని కలుస్తాడు.  వైద్యులు ఆరోగ్య జాగ్రత్తలు,  అనారోగ్యం తగ్గడానికి మందులు...
ఏ రిలేషన్ కు అయినా  మంచి కమ్యూనికేషనే  పునాది. అది స్నేహమైనా, కుటుంబమైనా, లేదా ఆఫీసు  వాతావరణమైనా, చక్కగా కమ్యూనికేట్ చేయడం అనేది..
ప్రేమ అనేది బార్యాభర్తలు, ప్రేమికుల మధ్య ఉండే మధురమైన అనుభూతి. నిజానికి  అన్ని బంధాలలో ప్రేమ ఉన్నా.. ప్రేమికులు, భార్యాభర్తల...
ఏ బంధం అయినా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇద్దరు వ్యక్తుల మధ్య పరిస్థితులు,  సందర్బాలు చాలా మారుతూ ఉంటాయి. కొన్ని సార్లు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఎదురవుతాయి,  మరికొన్ని సార్లు చాలా ఎమోషనల్ గా అటాచ్ అయిపోయి ఉంటారు...
ఆడపిల్లను కన్న ప్రతి తల్లిదండ్రి  పెద్దయ్యే వరకు అపురూపంగా ఒక యువరాణిలాగా పెంచుకుంటారు. కానీ వయసుకు వచ్చాక తప్పనిసరిగా పెళ్లి చేసి ఇంకొక ఇంటికి కోడలిగా పంపాల్సిందే.. అయితే భారతదేశంలో..
కూరల రుచిని పెంచడం నుండి సలాడ్‌ల వరకు టమోటాలను అన్నింటికీ ఉపయోగిస్తారు. చాలామంది కూరగాయల కంటే టయోటాలే ఎక్కువ కొనుగోలు చేస్తుంటాయి. అయితే  వేసవి కాలంలో టమోటాలను ఒకేచోట నిల్వ చేయడం ..
ప్రేమలో ఒక్కసారి మోసపోయినా.. మోసపోయిన వ్యక్తి కుంగిపోతాడు. ఆ మోసం వల్ల కలిగే బాధ నుండి కోలుకోవడానికి చాలా కాలం పడుతుంది. ప్రేలో మోసపోయినా, ఇతరుల చేతుల్లో మోసపోయినా ఒకసారి జరిగితే దాన్ని పొరపాటుగా..
ప్రేమలు, వివాహ బంధాలు ఎందుకు విఫలమవుతున్నాయి? నమ్మకం, అవగాహన, స్వేచ్ఛ ప్రాముఖ్యత ఏమిటి? బ్రేకప్‌ల కారణాలు మరియు పరిష్కారాలపై సి. కళ్యాణ్ చెప్పిన ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి...
ప్రేమ,  సహజీవనం, పెళ్లి.. ఏదైనా కావచ్చు.. అమ్మాయిలు అబ్బాయిలతో రిలేషన్ లో ఉండటం నేటి కాలంలో జరుగుతోంది.  రిలేషన్ లో ఉన్నప్పుడు అమ్మాయిలు తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తారు..
భార్యాభర్తల సంబంధాలలో ప్రేమ, నమ్మకం , సాన్నిహిత్యం చాలా అవసరం. కౌగిలించుకోవడం, చేతులు పట్టుకోవడం లేదా కేవలం ఆప్యాయతను వ్యక్తపరచడం వంటివి ఏ వివాహ బంధాన్నైనా బలపరుస్తాయి.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.