యూపీ రిజ‌ల్ట్స్ విశ్లేష‌ణ‌.. బీజేపీ గెలుపా? విపక్షాల ఓటమా?

Publish Date:Mar 10, 2022

Advertisement

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో, ముఖ్యంగా ఉత్తర ప్రదేశ్’లో బీజేపీ సాధించిన విజయం.. బీజేపీ విజయం కాదు, విపక్షాల ఓటమి. నిజానికి, ఇప్పుడు కాదు, 2019 ఎన్నికలకు ముందునుంచే, విపక్షాలు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ, నేల విడిచి సాము చేయడం వల్లనే, విపక్షాలకు వరస ఓటములు ఎదురవుతున్నాయి. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల విశేషణలను జాగ్రత్తగా గమనిస్తే ఇదే విషయం మరోసారి రుజువవుతుంది. 

ఒకసారి వెనక్కి వెళితే, 2019 లోక్ సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన అస్త్రాలలో ఒకటి జీఎస్టీ, (దీన్నే రాహుల్ గాంధీ ‘గబ్బర్ సింగ్ టాక్స్’ అని ప్రచారం చేశారు). ఆలాగే, రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు వ్యవహారంలో, అవినీతి జరిగిందని రాహుల్ గాంధీ ఊరువాడా తిరిగి, ప్రధాని మోడీని ఉద్దేశించి, ‘చౌకీదార్ చోర్ హై’ అంటూ  ప్రచారం చేశారు. ‘గబ్బర్ సింగ్ టాక్స్’, ‘చౌకీదార్ చోర్ హై’ స్లోగన్స్ క్యాచీగా ఉన్నాయి. కానీ, రాహుల్ ఒకటి తలిస్తే ప్రజలు ఇంకొకటి తలిచారు. అందుకే, వీటికి తోడు దేశంలో 20 శాతం వరకు ఉన్న నిరుపేద కుటుంబాలకు కనీసం ఏడాదికి రూ.72 వేలు అందేలా చర్యలు చేపడతామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుని హోదాలో  రాహుల్‌గాంధీ హామీ ఇచ్చినా, కాంగ్రెస్’నే కాదు కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టిన పార్టీలను కుడా ప్రజలు తిరస్కరించారు. 

ఇక ప్రస్తుతంలోకి వస్తే.. ప్రతిపక్ష పార్టీలు ఏడాదికిపైగా సాగిన రైతుల ఆందోళన మీద ఆశలు పెట్టుకున్నాయి. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జాట్ రైతులు విపక్షాలకు ఓటేసి గెలిపిస్తారని భావించారు. కానీ, జాట్’ ఓటు ప్రభావం ఎక్కువగా ఉన్న, ప్రాంతాల్లోనూ బీజేపీ.. ఎస్పీ కంటే ఎక్కువ సీట్లు గెలిచింది. అంతవరకు ఎందుకు, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కుమారడు, ఆందోళన చేస్తున్న రైతులపైకి కారు ఎక్కిచి, నలుగురు రైతుల మరణానికి కారణం అయ్యారని, ఆరోపణలు ఉన్న లఖింపూర్ లోకసభ నియోజక వర్గం పరిధిలోని ఎనిమిది అసెంబ్లీ స్థానాలకు గాను ఏడు స్థానాల్లో  బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించారు. మంత్రి రాజీనామా చేయాలని, ఆయన్ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేశాయి. ఈ అంశాన్ని ఎన్నికల ప్రచార అస్త్రంగానూ ఉపయోగించుకున్నారు, అయినా ఎనిమిదింట ఏడు స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించారు. అలాగే కాంగ్రెస్ నేత ప్రియాంక వాద్రా ప్రధాన ప్రచార అస్తం, ఉన్నావ్ అత్యాచారం కేసు. అయినా ఆ లోక్ సభ నియోజక వర్గం పరిధిలోనూ ఎనిమిదికి ఆరు అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులు విజయం సాధించారు.

అలాగే, కొవిడ్ వేవ్ సమయంలో జరిగిన లోపాలనుమాత్రమే ప్రజలు చూస్తారని విపక్షాలు భావించాయి. కానీ, ప్రజలు సెకండ్ వేవ్ లోపాల కంటే మోడీ ప్రభుత్వం వాక్సినేషన్ విషయంలో సాధించిన అద్భుత విజయాలను చూసి ఓటేశారు. అలాగే, అన్నిటినీమించి, అఖిలేష్ యాదవ్ కేవలం కుల సమీకరణలను మాత్రమే పరిగణలోకి తీసుకున్నారు. కానీ, ఈ ఎన్నికలలో కులం కంటే మతం, ఎక్కువ పాత్ర పోషించింది. ముఖ్యమంత్రి యోగీ ఆదిత్య నాద్ ‘ ఇలా అని అలా వదిలేసిన 80:20 నినాదం మెజారిటీ మతస్తులపై మంత్రంలా పనిచేసింది. 

ఈ ఎన్నికల్లో ముస్లిం మహిళలు సహా , కులమతాలకు అతీతంగా మహిళలు బీజేపీకి జై కొట్టారు, ఉత్తర ప్రదేశ్’లో మహిళా ఓటర్లలో 48శాతం మంది బీజేపీకో ఓటేస్తే.. ఎస్పీకి 32శాతం మంది మాత్రమే ఓటేశారు. అంటే, ఎస్పీ కంటే 16 శాతం ఎక్కువ మంది మహిళలు బీజేపీకి ఓటేశారు. ఉత్తరాఖండ్’లోనూ కాంగ్రెస్ కంటే బీజేపీకి 14 శాతం ఎక్కువ మంది మహిళలు బీజేపీకి ఓటేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉజ్వల యోజన, వ్యక్తిగత మరుగు దొడ్ల నిర్మాణం, ట్రిపుల్ తలాక్, శాంతి భద్రతలు, మహిళా రక్షణ విషయంలో  యోగీ అడిద్యనాథ్ ప్రయోగించిన బుల్దోజర్ మంత్రం వంటి అంశాలు, కులాలతో సంబంధం లేకుండా చాప కిందనీరులా బీజేపీకి అనుకూలంగా మారాయి. అయితే ఈ వాస్తవాలను విపక్షాలు గుర్తించలేక పోయాయి. అంటే, విపక్షాలు, వాస్తవాలను వక్రీకరించి, నేల విడిచి  సాము చేయడం వరస ఓటములకు ప్రధాన కారణంగా భావించవచ్చని విశ్లేషకులు అంటున్నారు.

By
en-us Political News

  
దానం నాగేందర్ అధికారికంగా బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామా చేయకుండానే కాంగ్రెస్‌ గూటికి చేరారని, అంతేకాకుండా కాంగ్రెస్‌ పార్టీ తరఫున సికింద్రాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిగా  పోటీ చేశారని హైకోర్టు దృష్టికి తెచ్చారు. పార్టీ ఫిరాయింపులకు ఇవి  బలమైన సాక్ష్యాధారాలని వారు పేర్కొన్నారు.
మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ ప్రవేశపెట్టిన పథకాలు దేశంలో విప్లవాత్మక మార్పులు తెచ్చాయన్న చంద్రబాబు , భారతదేశాన్ని గ్లోబల్ లీడర్‌గా నిలపడంలో ప్రధాని మోదీ దార్శనికత  కీలకమని చంద్రబాబు అన్నారు.
తాజాగా తృణమూల్ లోని మమతా వర్గం, రితబ్రత వర్గాలకు చెందిన కీలక నాయకులు  ఢిల్లీలో  భారత ఎన్నికల సంఘం (ఈసీఐ) ఫుల్ బెంచ్ ఎదుట హాజరై తమ వాదనలను బలంగా వినిపించారు. ఇరువర్గాలు కూడా ఈసీఐ విచారణ ముగిసిన తర్వాత తమ వాదనలకే అనుకూలంగా తుది తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేయడం రాజకీయ వర్గాల్లో ఈ వ్యవహారంపై మరింత  ఆసక్తిని రేకెత్తించింది. 
ఒకనాడు ప్రత్యర్థుల విమర్శల దాడులను చిటికెలో   చిత్తు చేసే నేర్పు ఉన్న నేతగా నిలిచిన హరీష్ రావు.. ఇప్పుడు ఆత్మరక్షణలో పడినట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ వైసీపీ ఆరోపణలు గుప్పిస్తోంది. అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న పద్ధతులను ప్రశ్నిస్తూ, సోషల్ మీడియా,  మీడియా సమావేశాల ద్వారా విమర్శలు గుప్పిస్తోంది. డీఎస్సీ నియామకాల్లో పారదర్శకత లోపించిందని, అభ్యర్థుల మార్కులు  పరిశీలనా ప్రక్రియలో గందరగోళం నెలకొందని ఆరోపిస్తున్నది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల అసెంబ్లీ వేదికగా మాజీ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యుల భూ ఆక్రమణలంటూ చేసిన సంచలన వ్యాఖ్యలు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్‌పై గులాబీ పార్టీ  మండిపడింది. ప్రభుత్వ వైఫ్యాలను కప్పిపుచ్చుకునేందుకే కాంగ్రెస్ పెద్దలు ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నారని  ఎదురుదాడికి దిగింది.
పట్టభద్రుల ఎన్నికలకు ఓటర్ల జాబితా ప్రక్రియ షెడ్యూల్ విడుదల.. !
చాలా మంది 1973 నాటి భూమి పరిమితి చట్టం రద్దయిందని అనుకుంటున్నారు. కానీ అది అమలులోనే వుంది. ఉమ్మడి కుటుంబానికి మెట్ట భూమి 52 ఎకరాలు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో 54 ఎకరాలు ఉండవచ్చు. తరి భూమి (ఏడాదికి రెండు పంటలు పండేది) 27 ఎకరాలు వుండవచ్చు. అంతకంటే ఎక్కువగా ఉంటే దాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాల్సి వుంటుంది.
వారణాసి వేదికగా నెల రోజుల పాటు జరగనున్న  సేవా సంకల్ప అభియాన్ లో  తొలి రోజు గురువారం ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు పాల్గొన్నారు. అలాగే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా  పాటు పలువురు అగ్రనేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  
మోడీకి  జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన వారిలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, తెలుగుదేశం అధినేత, ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి నారా లోకేష్ తదితరులు  ఉన్నారు.  ప్రధాని నరేంద్ర మోదీజీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన మంచి ఆరోగ్యంతో, దీర్ఘాయుష్షుతో ఉండాలని కోరుకుంటున్నానంటూ రాహుల్ గాంధీ తన సందేశంలో పేర్కొన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు వన్‌సైడ్ విక్టరీ వచ్చేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు.
కేసీఆర్ కుటుంబ సభ్యులు, సన్నిహిత బంధువులపేర్ల మీద అధికారికంగా నమోదై ఉన్న భూముల వివరాలను అసెంబ్లీ వేదికగానే  రేవంత్ రెడ్డి బయటపెట్టారు.  
వైసీపీ నుంచి బయటకు వచ్చి, ఆ పార్టీ ద్వారా వచ్చిన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయ సన్యాసం ప్రకటించిన విజయసాయి, ఇటీవల సొంత పార్టీ అంటూ మళ్లీ క్రియాశీల రాజకీయాలలోకి ప్రవేశించారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.