యూపీలో బీజేపీ గెలుపు.. జగన్-కేసీఆర్‌లో వణుకు! ఎందుకంటే...
Publish Date:Mar 10, 2022
Advertisement
2024 లోక్ సభ ఎన్నికలకు సెమి ఫైనల్’గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీలో జోష్’ను పెంచాయి. ఉత్తరాది రాష్ట్రాలలో కమల దళానికి ఇక తిరుగులేదని ఫలితాలు నిరూపించాయి. డబల్ ఇంజిన్ ఫార్ములా బాగా వర్కవుట్ అయిందని, బీజేపీ నాయకులు సంతోషాన్ని వ్యక్త పరుస్తున్నారు. ఈ సంవత్సరం చివర్లో జరిగే కర్ణాటక, ఛత్తీస్ ఘడ్, మాదే ప్రదేశ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికల్లోనూ ఇదే ఫార్ములా వర్కవుట్’ అవుతుందని కమల నాధులు ధీమాగా ఉన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు ఉత్తరాది రాష్ట్రాల్లో హిందుత్వ, వికాస్ నినాదంతో విజయపరంపర కొనసాగించగలమని బీజేపీలో ధీమా ఏర్పడింది. అయితే దక్షణాది రాష్ట్రాలలో పరిస్థితి ఏమిటి? ఈ ప్రశ్నకు, బీజేపీ నాయకులే సమాధానం ఇచ్చారు. పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ , బీజేపీ నెక్స్ట్ టార్గెట్, దక్షిణాది రాష్ట్రాలే అని కుండ బద్దలు కొట్టారు. అందులోనూ తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ ఉంటుందని స్పష్టం చేశారు. ఒక తెలుగు టీవీ చానల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూ నఖ్వీ, “ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి. మా లక్ష్యం నెరవేరింది. ఇక మా నెక్స్ట్ టార్గెట్ దక్షిణాది రాష్ట్రాలు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణపై స్పెషల్ ఫోకస్ ఉంటుంది” అని చెప్పారు. అదలా ఉంటే, బీజేపీ రాజ్యసభ సభ్యుడు, జీవీఎల్ నరసింహ రావు 2023లో తెలంగాణలో,2024లో ఏపీలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ధీమా వ్యక్తం చేశారు. అంతే కాదు, ఉభయ తెలుగు రాష్ట్రాలలో ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్, తెరాసల నుంచి బీజేపీలోకి వచ్చే వారికి తమ పార్టీ తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని చెప్పారు. నిజానికి, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా డీలాపడిన నేపధ్యంలో, సహజంగానే, ఏపీ విషయం ఎలా ఉన్నా, తెలంగాణలో, కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున వలసలకు అవకాశం ఉందని, ఎన్నికల ఫలితాల విశ్లేషణలో పాల్గొన్న రాజకీయ పరిశీలకులు కూడా, అభిప్రాయ పడుతున్నారు. నిజానికి సోషల్ మీడియాలో అయితే, ఇప్పటికే 20 మంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్’తో మంతనాలు మొదలు పెట్టారని, అలాగే, మహబూబ్’నగర్’కు చెందిన మాజీ మంత్రి సహా తెరాసలో అసమ్మతి నేతలు కూడా కమల దళంతో టచ్’లో ఉన్నారని అంటున్నారు.నిజానికి, ఇప్పటికే రాష్ట్రంలో దూకుడు మీదున్న బీజేపీకి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరింత జోష్’ను పెంచితే., అంతర్గత తగాదాలు , ముఠా కుమ్ములాటలతో సతమత మవుతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని తాజా ఫలితాలు మరింత కుంగ దీస్తాయని అంటున్నారు. రేవంత్ రెడ్డి ఇక ఏంటో కాలం ఒంటరి పోరాటం చేయలేక పోవచ్చని కూడా విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఆదలా ఉంటే, బీజేపీ జాతీయ నాయకత్వం ఉభయ తెలుగు రాష్ట్రాలలో, యూపీ తరహలో , ‘డబల్ ఇంజిన్’ ప్రచారానికి శ్రీకారం చుడుతుందని, అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసిందని,చేస్తోందని తెరాస చేస్తున్న ఆరోపణలకు సమాధానంగా, కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే పార్టీ ప్రభుత్వం ఉంటే, అభివృద్ధి పరుగులు తీస్తుందని యూపీని ఉదాహరణగా చూపేందుకు కమల దళం ప్రచార వ్యూహాన్ని ఖరారు చేసిందని, పార్టీ వర్గాల సమాచారం. అయితే, తెరాస నాయకులూ మాత్రం బీజేపీ ఎక్కడ గెలిచినా తెలంగాణలో మాత్రం, నో .. ఛాన్స్ అంటున్నారు. అయితే, ప్రధానంగా సంక్షేమ పథకాలే తమను గెలిపిస్తాయని తెరాస నాయకులు ధీమా వ్యక్త పరుస్తున్నా, హుజురాబాద్’లో సంక్షేం పనిచేయలేదని, కొందరు గుర్తు చేస్తున్నారు. అయితే, ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు , పార్టీ అంతర్గత వర్గాల సమాచారం మేరకు, తెరాస నాయకత్వాన్ని ఒక విధంగా షేక్ చేశాయని తెలిసింది. బీజేపీ యూపీలో బొటాబొటి మెజారిటీ గెలిచినా ఉత్తారాఖండ్, గోవాలో కమల దళం ఓడి పోతుందని,ఒడి పొవాలనీ తెరాస నాయకత్వం భావించింది. అయితే, యూపీలో బీజేపీకి ఉహించిన దానికంటే భారీ మెజారిటీ రావడం, మొత్తం నాలుగు రాష్ట్రాలలో అధికారం నిలుపుకోవడంతో తెరాస నాయకత్వం ఒక విధంగా ఖంగు తిందని అంటున్నారు. అన్నిటినీ మించి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి డోలాయమానంలో పడడంతో, ముఖాముఖి పోటీలో బీజేపీని ఎదుర్కోవడం అంత ఈజీ కాదని తెరాస నాయకులు అంటున్నారు. తెరాస వ్యతిరేక ఓటు బీజేపీవైపు మొగ్గు చూపినా, బీజేపీ ప్రధాన అస్త్రం హిందుత్వ కార్డు పనిచేసినా మళ్ళీ మూడవ సారి అధికారంలోని రావాలనే తెరాస ముచ్చట తీరక పోవచ్చని, పార్టీ నాయకులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/bjp-driving-its-forces-to-south-39-132870.html





