కాఫీ తాగొద్దు ఆరోగ్యానికి నష్టమని బాధపడుతున్నారా?

Publish Date:Apr 17, 2023

Advertisement

ఉదయాన్నే కాఫీ గొంతులో పడకపోతే ఏమీ తోచదు చాలా మందికి. పని మొదలుపెట్టాలంటే కాపీ గొప్ప ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఒక అంచనా ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ప్రతిరోజూ 2.25 బిలియన్ కప్పుల కాఫీ తాగుతారు. కాఫీ తాగొద్దు ఆరోగ్యానికి మంచిదికాదు అని చాలామంది చెబుతూ ఉంటారు.  అయినప్పటికీ కొన్ని అధ్యయనాలలో, సరైన మోతాదులో కాఫీని తీసుకోవడం వల్ల అనేక తీవ్రమైన వ్యాధులలో ప్రయోజనాలు లభిస్తాయని తెలిసింది. అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో కూడా కాఫీ  ప్రయోజనకరంగా ఉంటుంది.

కాఫీ  ప్రయోజనాలు, అది కలిగించే హాని గురించి అధ్యయనాలు మిశ్రమ ఫలితాలను కనుగొన్నాయి. సరైన మోతాదులో మరియు సరైన సమయంలో కాఫీ తీసుకోవడం ప్రయోజనకరంగా ఉంటుందని అంటున్నారు.  కాఫీ తీసుకోవడం వల్ల కలిగే లాభాలు,  నష్టాల గురించి తెలుసుకుంటే..

కాఫీలో ఏముంటుంది? 

కాఫీలో చాలా పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. రిబోఫ్లావిన్ (విటమిన్ బి2), నియాసిన్ (విటమిన్ బి3), మెగ్నీషియం, పొటాషియం, వివిధ ఫినోలిక్ సమ్మేళనాలు,  యాంటీఆక్సిడెంట్లు కాపీలో ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ పోషకాలు మన శరీరానికి  ప్రయోజనం చేకూరుస్తాయి.

ప్రయోజనాలు ఏమిటంటే..

టైప్ 2 డయాబెటిస్ రిస్క్‌ను తగ్గిస్తుంది..

కాఫీ తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్ రిస్క్ తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. 2014 అధ్యయన నివేదిక ప్రకారం, 48,000 మందికి పైగా పరిశోధించబడ్డారు మరియు నాలుగు సంవత్సరాలలో రోజుకు కనీసం ఒక కప్పు కాఫీ తాగేవారిలో టైప్ 2 మధుమేహం వచ్చే ప్రమాదం 11 శాతం తక్కువగా ఉందని కనుగొన్నారు. అయితే మధుమేహ వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహా మేరకు మాత్రమే కాఫీ తీసుకోవాలి. 

కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది..

కెఫిన్ జీవక్రియ రేటును 3-11 శాతం పెంచుతుందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. అందుకే కాఫీని ఫ్యాట్ బర్నింగ్ సప్లిమెంట్‌గా పరిగణించవచ్చు. ఊబకాయం ఉన్నవారి కొవ్వును తగ్గించడంలో కెఫిన్ సహాయపడుతుంది.

కాలేయ క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉంటుంది..

ఒక అధ్యయనం ప్రకారం, కాఫీ తీసుకోవడం కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోజుకు రెండు నుండి మూడు కప్పుల కాఫీ తాగేవారిలో హెపాటోసెల్యులర్ కార్సినోమా,  క్రానిక్ లివర్ డిసీజ్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని US అధ్యయనం నిర్ధారించింది.

కాఫీ రక్తపోటును నియంత్రిస్తుంది..

కాఫీలో ఉండే కెఫిన్ రక్తపోటుతో సహా గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఒక అధ్యయనంలో, రోజుకు మూడు నుండి ఐదు కప్పుల కాఫీ తాగడం వల్ల గుండె జబ్బుల ప్రమాదాన్ని 15 శాతం వరకు తగ్గించవచ్చని పరిశోధకులు కనుగొన్నారు

నష్టాలేమిటంటే..

జీర్ణమవడంలో  ప్రమాదం

కాఫీ వినియోగం కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది. అదే సమయంలో, శరీరానికి హానికరమైన స్టోమా యాసిడ్ ఉత్పత్తికి కెఫిన్ కూడా కారణం కావచ్చు. దీని కారణంగా జీర్ణవ్యవస్థపై ప్రతికూల ప్రభావం ఉంటుంది. కాఫీ ఎక్కువగా తీసుకోవడం లేదా కాఫీతో ఉదయం ప్రారంభించడం వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలు వస్తాయి.

డీహైడ్రేషన్ సమస్య తలెత్తుతుంది..

 ఉదయం కాఫీతో రోజు ప్రారంభించడం హానికరం. రాత్రిపూట చాలా సేపు కడుపు ఖాళీగా ఉంటుంది.  నీటి కొరతను భర్తీ చేయడానికి ఉదయం నీరు త్రాగాలి. కానీ ఉదయాన్నే కాఫీ తాగితే శరీరంలో నీటి కొరత ఏర్పడి డీహైడ్రేషన్ సమస్య రావచ్చు. కాఫీలో ఉండే కెఫిన్ మూత్రవిసర్జనను పెంచుతుంది, ఇది డీహైడ్రేషన్ ప్రమాదాన్ని కూడా పెంచుతుంది.

వేసవిలో వద్దు..

కాఫీ వల్ల ఎన్ని లాభనష్టాలు ఉన్నా వేసవిలో మాత్రం దానికి దూరంగా ఉండటం మంచిది. కాఫీలో కెఫిన్ శరీరాన్ని డీహైడ్రేట్ చేస్తుంది. ఈ వేసవిలో ఎంతో హైడ్రేట్ గా ఉండటం అవసరం. కాబట్టి వేసవిలో కాఫీని వీలైనవరకు అవాయిడ్ చేస్తే బెస్ట్.

                                 ◆నిశ్శబ్ద.

By
en-us Political News

  
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం..
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం..
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది...
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు..
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు...
తిండి కలిగితే కండ కలదోయ్ అని అంటుంటారు. అలాగే కొందరు ఎంత కారంగా ఉన్న ఆహారం తింటే.. శరీరం అంత దృఢంగా ఉంటుందని కూడా అంటుంటారు.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బాగా కారంగా...
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (Heart Attack) బారిన పడుతున్నారు. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదమే అయినప్పటికీ, మన శరీరం కొన్ని రోజుల ముందే కొన్ని లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను సరైన సమయంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.
భారతీయుల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది.  పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లేకుండా రోజు అస్సలు గడవదు.  ఇక ఇప్పట్లో చాలా మంది పనీర్ కుడా బాగా వినియోగిస్తున్నారు....
మన వంటింట్లో ఉండే వెల్లుల్లి కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా మారుపేరు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వెల్లుల్లిని ఎలా వాడాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా వివరించారు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.