AI నుండి ఆరోగ్య సలహాలు తీసుకుంటున్నారా? పరిశోధనలలో బయటపడిన షాకింగ్ నిజాలు తెలుసా?

Publish Date:Apr 21, 2026

Advertisement

AI..ప్రపంచం అంతా వాడుతున్న కృత్రిమ మేధస్సు ఇది. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఈ కృత్రిమ మేధస్సు వాడకం చాలా పెరిగింది.  ఏ చిన్న సందేహం వచ్చినా ఏఐ ని వాడటం, దాన్ని సలహాలు, సూచలు అడగడం చేస్తున్నారు. ఇక చాలా మంది మరొక అడుగు ముందుకు వేసి జీవితానికి కీలకం అయిన ఉద్యోగాలు,  ఆరోగ్యం,  రిలేషన్షిప్స్ వంటి విషయాలలో సలహాలు కూడా ఈ కృత్రిమ మేధస్సును ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఇది మనిషి లాగా తప్పించుకుని పక్కకు వెళ్ళిపోయేది కాదు.. ఏ ప్రశ్న అడిగినా దానికి తగిన సమాధానం ఇస్తూ ఉంటుంది.  ఈ క్రమంలోనే చాలా మంది ఏఐ ను ఆరోగ్య సమస్యలకు సలహాలు తీసుకుని, స్వంత వైద్యం దిశగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. తాజాగా ఒక బ్రిటీష్ వైద్య పత్రిక ఏఐ ను ఆరోగ్య సలహాలు అడగడం, ఆ సలహాలు పాటించడం వంటి విషయాల గురించి చాలా షాకింగ్ నిజాలు ప్రచురించింది. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ఆరోగ్య సమస్యల కోసం ఏఐ ను సలహా అడగడం ఎంత పెద్ద తప్పూ  అర్థమవుతుంది.

ఆరోగ్య సమస్యలపై తప్పుడు సమాచారం..

ఆరోగ్య సంబంధిత ప్రశ్నలకు ఏఐ ఇచ్చే సమాధానాలలో సుమారు 50 శాతం తప్పుగా ఉంటాయి. ఏఐ చాట్‌బాట్‌లు అందించే సమాచారం చాలా తప్పుగా ఉండవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి.

ఏఐ బలహీనత..

జెమిని, డీప్‌సీక్, మెటా ఏఐ, చాట్‌జీపీటీ , గ్రోక్ వంటి ఏఐ సాధనాలపై విస్తృతమైన పరిశోధనను ఒక శాస్త్రవేత్తల టీమ్ నిర్వహించిందట.  ఈ ఏఐ ప్లాట్పామ్ లలో  ఆరోగ్యానికి సంబంధించిన అనేక ప్రశ్నలు పరిశోధకులు అడిగారట. క్యాన్సర్ , వ్యాక్సిన్‌ల వంటి అంశాలపై ఏఐ ఇచ్చిన సమాధానాలు చాలా వరకు కచ్చితమైనవిగా ఉన్నాయి. అయితే మూల కణాలు , పోషణ వంటి అంశాలలో ఏఐ బలహీనంగా ఉన్నట్లు తేలిందట.

తప్పుడు సమాధానాలు..

ఏఐతో ఉన్న అతిపెద్ద సమస్య.. అది నిస్సంకోచంగా తప్పుడు సమాచారాన్ని అందిస్తుందట. ఇది తరచుగా ఎటువంటి హెచ్చరిక లేదా నిరాకరణను అందించదు. ఫలితంగా, వినియోగదారులు సరైన సమాచారం, తప్పు సమాచారాల  మధ్య తేడాను గుర్తించలేరు. ఏఐ చెప్పే తప్పు సమాధానాలనే నిజం అనుకుని చాలామంది పొరపాట్లు చేస్తారు. అసలు ఏఐ చెప్పే సమాధానాలు నమ్మేలా అనిపించవని,  సమస్యకు సంబంధం లేని సమాచారాన్ని ఇస్తుందని అంటున్నారు.

గమనిక..

పైన పేర్కొన్న విషయాలు సోషల్ మీడియాలో వచ్చిన సమాచారం ఆధారంగా రూపొందించినవి.

                            *రూపశ్రీ.

By
en-us Political News

  
ఆరోగ్యకరమైన శరీరానికి జింక్ చాలా అవసరం. జింక్ కణజాలాలను బాగుచేస్తుందని చెబుతారు. జింక్ ఒక యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తూ, కణాలను దెబ్బతినకుండా కాపాడటానికి సహాయపడుతుంది. చర్మం..
ఇనుప పాత్రలో వంట చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చెబుతారు. ఎందుకంటే ఇనుప పాత్రలో వంట చేయడం వల్ల ఆ ఆహారాన్ని ఐరన్ ఖనిజం చేరుతుంది.  దీని వల్ల శరీరానికి ఐరన్ ఎలాంటి సప్లిమెంట్ ..
ఈ రోజుల్లో పిల్లల నుండి పెద్దల వరకు ప్రతి ఒక్కరు   ఎక్కువ సమయాన్ని మొబైల్, ల్యాప్‌టాప్ లేదా టాబ్లెట్ స్క్రీన్‌ల ముందు గడుపుతున్నారు. దీని ఫలితంగా, కంటి అలసట , చికాకు సర్వసాధారణమైపోయాయి...
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో సరైన నిద్ర లేకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి...
నేటి కాలంలో వయస్సుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య మోకాళ్ళ నొప్పులు. జీవనశైలిలో మార్పులు, శారీరక శ్రమ తగ్గడం మరియు సరైన పోషకాహారం..
వేసవి మొదలవ్వగానే తీవ్రమైన ఎండ , పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మన రోజువారీ  కార్యకలాపాలు , ఆరోగ్యంపై ప్రభావం చూపడం మొదలవుతుంది. ఈ రోజుల్లో బయట కొద్దిసేపు ఉన్నా కూడా శరీరం అలసిపోయేంత వేడిగా ఉంటుంది...
పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి.  ముఖ్యంగా వేసవి కాలంలో నీటిశాతం అధికంగా ఉన్న పండ్లను ఎంత తీసుకుంటే అంత మంచిదని చెబుతూ ఉంటారు. కానీ చాలామంది వేసవి కాలంలో పండ్ల జ్యూసులు..
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల నుండి పెద్దల వరకు అందరినీ వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్య కిడ్నీ వ్యాధులు...
తిండి కలిగితే కండ కలదోయ్ అని అంటుంటారు. అలాగే కొందరు ఎంత కారంగా ఉన్న ఆహారం తింటే.. శరీరం అంత దృఢంగా ఉంటుందని కూడా అంటుంటారు.  ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బాగా కారంగా...
నేటి కాలంలో మారుతున్న జీవనశైలి, ఒత్తిడి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెపోటు (Heart Attack) బారిన పడుతున్నారు. అయితే, గుండెపోటు అకస్మాత్తుగా వచ్చే ప్రమాదమే అయినప్పటికీ, మన శరీరం కొన్ని రోజుల ముందే కొన్ని లక్షణాల ద్వారా మనల్ని హెచ్చరిస్తుంది. ఆ సంకేతాలను సరైన సమయంలో గుర్తిస్తే ప్రాణాపాయం నుండి తప్పించుకోవచ్చు.
భారతీయుల ఆహారంలో పాలు, పాల ఉత్పత్తులకు చాలా ప్రత్యేక స్థానం ఉంటుంది.  పాలు, పెరుగు, వెన్న, నెయ్యి లేకుండా రోజు అస్సలు గడవదు.  ఇక ఇప్పట్లో చాలా మంది పనీర్ కుడా బాగా వినియోగిస్తున్నారు....
మన వంటింట్లో ఉండే వెల్లుల్లి కేవలం రుచికే కాదు, అద్భుతమైన ఔషధ గుణాలకు కూడా మారుపేరు. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు, అధిక బరువు మరియు మధుమేహంతో బాధపడేవారికి వెల్లుల్లి ఒక వరప్రసాదం లాంటిది. ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు ఈ వీడియోలో వెల్లుల్లిని ఎలా వాడాలి మరియు దానివల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి సవివరంగా వివరించారు...
ఆయుర్వేదంలో అయినా ప్రాచీన ఆరోగ్య చిట్కాలలో అయినా రాగి పాత్రలో నీరు త్రాగడం చాలా ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. ఇది శరీరానికి ఖనిజాలు , విటమిన్లను అందించి, జీర్ణక్రియను మెరుగుపరిచి, రోగనిరోధక శక్తిని పెంచుతుందని నమ్ముతారు. కానీ ఇది అందరికీ మంచిది కాదనే విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు...
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.