ఓ వైసీపీ ఎంపీని జగన్ చెంప మీద కొట్టారా? కారణం అదేనా..?
Publish Date:Oct 25, 2021
Advertisement
సీఎం జగన్ ఓ ఎంపీ చెంప పగలగొట్టారట. ఆ ఎంపీ చేసిన అవినీతిపై ఒళ్లు మండి చెంప చెళ్లుమనిపించారట. ఆ ఎంపీనే అనే కాదు.. ఏపీలో తాను కాకుండా ఎవరెంత అవినీతి చేస్తున్నారు? ఏ మంత్రి ఎంత దోచేశాడు? ఏ ఎమ్మెల్యే ఎంతెంత కూడబెట్టాడు? అనే లెక్క.. నియోజకవర్గాల వారీగా, ప్రజాప్రతినిధి వారీగా సీఎం జగన్‌రెడ్డి టేబుల్‌పై పక్కా సమాచారం ఉందట. ఏపీ పాలిటిక్స్‌లో యాక్టివ్‌గా ఉండే ఓ కీలక నేత చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారాయి. వైసీపీ నేతల అవినీతిపై ఇప్పటికే అంతా కోడై కూస్తుంటే.. ఈ కరెప్షన్ గురించి సీఎం జగన్‌రెడ్డి దగ్గర ఫుల్ డిటైల్స్ ఉన్నాయనే విషయం అధికార పార్టీలో కలకలం రేపుతోంది. ఇంతకీ ఈ వ్యాఖ్యలు చేసింది ఎవరంటే.. సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ. ప్రకాశం జిల్లా మార్కాపురంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన ఇలా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే, ఆయన ఎక్కడా విజయసాయిరెడ్డి పేరు ప్రస్తావించకున్నా.. జగన్ చెంపదెబ్బ కొట్టిన ఆ ఎంపీ విజయసాయిరెడ్డినే అయింటారనే ప్రచారం జరుగుతోంది. ఎందుకుంటే, ఏపీలో జగన్ తర్వాత అంతటి అవినీతి తిమింగళం విజయసాయినే అంటున్నారు. ఏపీని జగన్ రెడ్డి దివాళా తీయించారని సీపీఐ రామకృష్ణ ఆరోపించారు. దీనికి ఎవరూ ఏం లెక్కలు చెప్పనవసరం లేదన్నారు. రేపు ఒకటో తేదీ ఉద్యోగుల అకౌంట్ లో జీతం పడితే తెలుస్తుందని అన్నారు. జీతం పడాలంటే ఎవరో ఒకరు అప్పు ఇవ్వాల్సిందేనని ఎద్దేవా చేశారు. కాంట్రాక్టర్లకు రూ.80వేల కోట్లు పెండింగ్ బిల్లులున్నాయని.. వాళ్లకి ఒక్క రూపాయి కూడా ఇవ్వట్లేదని.. ఏపీలో ప్రభుత్వ పనులు చేసిన కాంట్రాక్టర్లు ఉరేసుకొని చచ్చే పరిస్థితి వచ్చిందంటూ సీపీఐ రామకృష్ణ విమర్శించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని మండిపడ్డారు. గతంలో ఎందరో ముఖ్యమంత్రులుగా పనిచేశారని.. ఎన్టీఆర్, చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి.. వీరందరూ పరిపాలన అంటే.. ముఖ్యమంత్రి మంత్రులు ప్రతిపక్షాలు కౌన్సిల్ అనేవి ఉండేవని.. ఇప్పుడు ఏపీలో ఏక్ నిరంజన్ పాలన అని.. తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటూ జగన్‌రెడ్డి ఎవర్నీ దగ్గరికి రానీయడం లేదని సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణ విమర్శించారు.
http://www.teluguone.com/news/content/is-cm-jagan-slams-one-of-the-ycp-mp-39-125181.html





