పొగమంచు వల్లే హెలికాప్టర్ క్రాష్.. మంటలతోనే పరుగులు!
Publish Date:Dec 9, 2021
Advertisement
తమిళనాడులోని కున్నూర్ సమీపంలో సీడీఎస్ బిపిన్ రావత్ ప్రయాణించిన ఆర్మీ హెలికాప్టర్ కూలిపోయిన చోట బీతావహ వాతావరణం కనిపించింది. మృతుల శరీర భాగాలు, హెలికాప్టక్ శకలాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. కొన్ని శరీర భాగాలు చాలా దూరంలో పడి ఉన్నాయి. శరీరాలు పూర్తిగా కాలిపోయి ఉన్నాయి. హెలికాప్టర్ ప్రమాదస్థలిని వాయుసేన అధికారులు పరిశీలించారు. ఘటనాస్థలి నుంచి బ్లాక్‌బాక్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి 30 అడుగుల దూరంలో దీన్ని గుర్తించారు. ప్రమాద దర్యాప్తులో బ్లాక్‌బాక్స్ కీలకం కానుంది. అందులో నమోదైన సంభాషణల ఆధారంగా ప్రమాదానికి కారణాలు తెలుసుకునే వీలుంది. దీన్ని డీకోడ్ చేసేందుకు ఢిల్లీకి తరలిస్తున్నారు అధికారులు. . హెలికాప్టర్ ప్రమాదానికి సంబంధించి ప్రాధమికంగా కొన్ని నిర్దారణకు వస్తున్నాయి. సీడీఎఎస్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ మరొక్క 5 కిలోమీటర్లు వెళ్తే గమ్యం చేరుకునేదే. అంతలోనే తమిళనాడులోని కున్నూర్ సమీపంలో హెలికాప్టర్ కుప్పకూలింది. సూలూర్ నుంచి బయల్దేరే ముందు ఆ మార్గంలో తక్కువ ఎత్తులో మబ్బులు ఉంటాయని, గాలిలో తేమ ఎక్కువగా, కొద్దిపాటి వర్షం ఉంటుందని వాతావరణ సూచనలో తెలిపారు. కానీ ప్రమాద సమయానికి ఉష్ణోగ్రత సుమారు 15 డిగ్రీలు ఉంటుందని, ఆ ప్రాంతంలోని నంజప్పన్ చతిరం లోయ మొత్తం దట్టమైన పొగమంచు అలముకుందని స్థానికులు చెబుతున్నారు. 2 మీటర్ల ముందు ఏముందో కూడా కనిపించని పరిస్థితి. గంటకు 250 కిలోమీటర్ల వేగంతో వెళ్లే ఎంఐ-17వి5 హెలికాప్టర్.. పొగమంచు లేకపోతే రెండు నిమిషాల్లో వెల్లింగ్టన్లో దిగేది. పొగ మంచు వల్లే హెలికాప్టర్ క్రాష్ అయిందని భావిస్తున్నారు. సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ప్రమాదానికి ముందు దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. ప్రమాదం చివరి క్షణంలో హెలికాప్టర్... దట్టమైన పొగమంచులోకి వెళ్లిపోవడం ఈ దృశ్యాల్లో కనిపిస్తోంది. ఆ తర్వాత హెలికాప్టర్ కుప్పకూలిపోయినట్లు తెలుస్తోంది. ఈ దృశ్యాలను స్థానికులు సెల్ ఫోన్లో రికార్డు చేశారు. హెలికాప్టర్ కూలిన ప్రాంతాన్ని చూసి స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ఓ తేయాకు తోటకు చాలా దగ్గరగా ఈ దుర్ఘటన జరిగింది. తోటలో పనిచేస్తున్న కూలీలు, చుట్టుపక్కలవారు తొలుత ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం తీరు, తర్వాతి పరిణామాలను కొందరు వివరించారు. ‘‘ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. ఏదో పెద్ద ప్రమాదం జరిగినట్లు అనిపించింది. తక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్న ఓ హెలికాప్టర్ చెట్లను ఢీకొడుతూ కూలిపోవడం చూశాం. ఆ వెంటనే పేలుడు సంభవించిందని కూలీలు చెప్పారు. హెలికాప్టర్ శిథిలాల నుంచి లేచిన ఓ వ్యక్తికి మంటలు అంటుకొని ఉన్నాయి.. అయినప్పటికీ ప్రాణాలు కాపాడుకునేందుకు కొంతదూరం పరిగెత్తి ఆయన కుప్పకూలిపోయారని చెప్పార. . మరో ముగ్గురు వ్యక్తులూ కాలిపోతూనే పరిగెత్తేందుకు ప్రయత్నించినప్పటికీ.. పక్కనే పడిపోయారు. ఆ దృశ్యాలు భయానకంగా కనిపించాయి. ప్రమాదం జరిగిన తర్వాత చాలాసేపటికి.. సైన్యానికి చెందిన ఉన్నతాధికారులు హెలికాప్టర్లో ఉన్నట్లు మాకు తెలిసింది’’అని కూలీలు వివరించారు.
http://www.teluguone.com/news/content/is-cds-bipin-rawat-army-helicopter-crash-due-to-fog-39-127993.html