కోహ్లీని తొలగించడమా.. సిగ్గు సిగ్గు! బీసీసీఐని టార్గెట్ చేసిన ఫ్యాన్స్.. 

Publish Date:Dec 8, 2021

Advertisement

భారత క్రికెట్  వన్డే జట్టు కెప్టెన్సీ నుంచి విరాట్ కోహ్లీని తొలగించడంపై దుమారం రేగుతోంది. బీసీసీఐ, దాని చీఫ్ గంగూలీని ట్రోల్ చేస్తూ అభిమానులు ట్విట్టర్‌లో విరుచుకుపడుతున్నారు. బీసీసీఐపై  గౌరవం పోయిందని, ఇప్పుడు ఇసుమంత గౌరవం కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది సిగ్గుపడాల్సిన విషయమని నిప్పులు చెరుగుతున్నారు.ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు బీసీసీఐ, జై షా, గంగూలీలు సిగ్గుపడాలంటూ మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

‘‘కోహ్లీని ఎందుకు తొలగించారు.. 95 మ్యాచుల్లో 65 విజయాలు అందించినందుకా? ప్రపంచ కప్ ఒక్క దానినే ప్రాతిపదికగా తీసుకుంటారా? అలా అయితే, ధోనీ గంగూలీ సారథ్యంలోని జట్లు ప్రపంచకప్‌లలో ఓడిపోలేదా? క్రీడల్లో కూడా రాజకీయాలు ప్రవేశించాయా?.. ఏది ఏమైనా ఇది మంచి సంకేతం కాదు’’ అంటూ గంగూలీ, బీసీసీఐపై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు కోహ్లీ అభిమానులు. 

టీ20 కెప్టెన్‌గా కోహ్లీ తప్పుకున్నప్పుడే వన్డే కెప్టెన్సీ గురించి ఎందుకు ఆలోచించలేదని బీసీసీఐని ప్రశ్నిస్తున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కెప్టెన్ మార్పుపై మీడియా సమావేశం కూడా ఎందుకు ఏర్పాటు చేయలేదని, అకస్మాత్తుగా ఈ తొలగింపు ఏమిటని దుమ్మెత్తి పోస్తున్నారు. చూస్తుంటే గంగూలీ, జై షా శకం గాడితప్పినట్టుగా ఉందని నిప్పులు చెరుగుతున్నారు.

మరోవైపు  కోహ్లీ తొలగింపును ఐసీసీ సహా మాజీ క్రికెటర్లు స్వాగతించారు.  భారత వన్డే క్రికెట్‌లో ఇది నూతన శకమని ఐసీసీ అభివర్ణించింది. ఇది చాలా మంచి నిర్ణయమని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ అన్నాడు. వైట్‌బాల్ క్రికెట్‌లో ‘మెన్ ఇన్ బ్లూ’ను నడిపించేందుకు నంబర్ 45  సిద్ధమని ఐపీఎల్ ఫ్రాంచైజీ ముంబై ఇండియన్స్ పేర్కొంది. కోహ్లీ, రోహిత్‌లతో కూడిన జట్లను ద్రావిడ్ ఎలా నడిపిస్తాడో వేచి చూడాల్సిందేనని క్రికెట్ కామెంటేటర్ హర్షాభోగ్లే అన్నాడు.  రెండు వేర్వేరు ఫార్మాట్లకు ఇద్దరు కెప్టెన్లను నియమించడం వల్ల డ్రెస్సింగ్ రూములో మార్పులు తప్పవని, రోహిత్, కోహ్లీని సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగడంలో ద్రావిడ్ పెద్దన్న పాత్ర పోషించాల్సి ఉంటుందని క్రీడా విశ్లేషకుడు అయాజ్ మీనన్ అన్నారు.

త్వరలో ప్రారంభం కానున్న దక్షిణాఫ్రికా పర్యటన కోసం భారత జట్టును ప్రకటించిన సెలక్టర్లు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. గత కొంతకాలంగా అంతగా రాణించలేకపోతున్న విరాట్ కోహ్లీ నుంచి వన్డే జట్టు పగ్గాలు లాక్కుని రోహిత్ శర్మకు అందించారు. అయితే టెస్టులకు మాత్రం కోహ్లీనే కొనసాగిస్తున్నారు. అలాగే టెస్టుల్లో రహానే బదులుగా రోహిత్‌కు వైఎస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. కాగా రోహిత్‌కు ఇప్పటికే టీ20 పగ్గాలు కూడా అప్పగించడంతో ఇక కోహ్లీ ఒక్క టెస్టులకు మాత్రమే సారథ్యం వహిస్తాడు.  

By
en-us Political News

  
రాజకీయాల్లో రాణించడానికి చదువు అవసరం లేదు. పంచాయతీ బోర్డు మెంబెర్ మొదలు ప్రధాని పదవి వరకు, ఏ పదవికి విధ్యార్హతలు అక్కరలేదు. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో పోటీ చేయవచ్చును. ప్రజలు గెలిపిస్తే చాలు, ఎమ్మెల్ల్యే, ఎంపీ , మంత్రి, ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి ఏదైనా కావచ్చును. ఏ పదవికీ చదవు సంధ్యలు అవసరం లేదు, డిగ్రీలు అక్కరలేదు.
కేసీఆర్ కట్టడం కూలిందంటే, ఆయన ఫామ్‌హౌస్‌లో వున్న కట్టడం కూలిందనో, హైదరాబాద్ నంది నగర్లో ఆయనకు
తిమ్మిని బమ్మిని చేసి, మాటలతో మాయ చేసే తండ్రి సపోర్టు బాగా వుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఏం మాట్లాడినా నడిచింది.
శిరోముండనం కేసులో విశాఖ కోర్టు తనకు విధించిన శిక్షను నిలుపుదల చేయాలంటూ వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన ఏపీ హైకోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ విచారణను మే 1కి వాయిదా వేసింది. వైసీపీ ఎమ్మెల్సీ, ఆ పార్టీ మండపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి అయిన తోట త్రిమూర్తులుకు విశాఖ కోర్టు శిరోముండనం కేసులో 18 నెలల జైలు శిక్ష, రెండు లక్షల రూపాయల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత, నవ్యాంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ శవంలా మిగిలింది. అడ్డదిడ్డంగా రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏనాటికీ క్షమించరు.
మలేసియా రాజధాని కౌలా లంపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. మలేసియా నావికాదళానికి చెందిన రెండు హెలికాప్టర్లు ఆకాశంలోనే ఢీకొన్నాయి
జగన్ పేరు చెప్పగానే ఎవరికైనా ఎం గుర్తుకు వస్తుంది. ముఖ్యమంత్రి హోదా. తననూ తన అధికారాన్ని, తన ప్రభుత్వ విధానాలనూ వ్యతిరేకించిన వారిపై అక్రమ కేసులు బనాయించడం, అరెస్టు చేయించడం, ఇంకా కోపం తగ్గకపోతే రఘురామరాజుపై జరిగినట్లు థర్డ్ డిగ్రీ ప్రయోగించేలా పోలీసులను ఆదేశించడం.
రోజా.. రాజకీయ నాయకురాలిగా మారిన నటి. ఏపీ పర్యాటకశాఖ మంత్రి. రెండు సార్లు ఎమ్మెల్యే. ఒకసారి ఏపీఐఐసీ చైర్ పర్సన్. రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్. ఆమె తెలుగుదేశంలో ఉన్నా.. వైసీపీలో ఉన్నా.. ప్రత్యర్థులపై విరుచుకుపడడంలో దిట్ట.
ప్రపంచ రాజకీయాల్లో తాజాగా ఎవరూ ఊహించని ఒక సంఘటన జరిగింది... అదే ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీమ్ రైసీ పాకిస్తాన్ దేశాన్ని సందర్శించడం.
పూర్తిగా సానుకూలంగా ఉన్న పరిస్థితులను కూడా అత్యంత సంక్షిష్టంగా మార్చుకుని ఇబ్బందులు పడటం కాంగ్రెస్ కు పరిపాటి. గతంలో రాజకీయ పండితులు ఈ గ్రాండ్ ఓల్డ్ పార్టీ గురించి కాంగ్రెస్ పార్టీని ప్రత్యర్థులు ఓడించలేరు. కానీ ఆ పార్టీయే తనను తాను ఓడించుకుంటుంది అని చెప్పేవారు.
చంద్ర‌బాబు నాయుడు స్కెచ్ వేశారంటే ప్ర‌త్య‌ర్థుల‌కు ముచ్చెమ‌ట‌లు ప‌ట్టాల్సిందే.. సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం క‌లిగిన నారా చంద్రబాబునాయుడు.. పార్టీని న‌మ్ముకున్న వారికి.. క‌ష్ట‌కాలంలో పార్టీకి అండ‌గా నిలిచిన వారికి ఏదో ఒక విధంగా న్యాయం చేస్తారని పేరుంది. తాజాగా మ‌రోసారి ఆ విష‌యం రుజువైంది.
తిరుమలలో శ్రీవారి భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మంగళవారం(ఏప్రిల్ 23) ఉదయం శ్రీవారి దర్శనం కోసం రెండు కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.
ఏపీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొంద‌డానికి ఎలాంటి డ్రామాలు ఆడేందుకైనా వెనుకాడ‌రు. ఈ విష‌యం గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో రుజువైంది. కోడిక‌త్తి డ్రామాతో ప్ర‌జ‌ల్లో సానుభూతిని పొందిన జ‌గ‌న్‌.. బాబాయ్ హ‌త్య‌ను చంద్ర‌బాబుపైనెట్టి ప్ర‌జ‌ల సానుభూతి ఓట్ల‌తో అధికారంలోకి వ‌చ్చారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.