బిపిన్ రావత్ పై కుట్ర జరిగిందా? హెలికాప్టర్ ప్రమాదంపై అన్ని అనుమానాలే..!  

Publish Date:Dec 11, 2021

Advertisement

భారత తొలి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయి నాలుగు రోజులైంది. అయినా హెలికాప్టర్ ప్రమాదంపై ఇంకా ఎలాంటి ఖచ్చితమైన సమాచారం రావడం లేదు. ఆర్మీ వర్గాలు ఎలాంటి వివరాలు చెప్పడం లేదు.  అత్యంత భద్రత, సురక్షితమైనదిగా చెబుతున్న MI-17v5 హెలికాప్టర్ క్రాష్ కావడం నిపుణులను ఆశ్చర్యపరుస్తోంది. అదే సమయంలో హెలికాప్టర్ ప్రమాదంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంపై శుక్రావరం ప్రకటన చేసిన భారత వైమానిక దళం.. ఎటువంటి స్పష్టమైన సమాచారం లేని ఊహాగానాలకు దూరంగా ఉండాలని సూచించింది. తాము దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేస్తామని ట్విటర్ వేదికగా వెల్లడించింది.  

సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ ప్రయాణించింది రష్య‌న్ మేడ్‌ అత్యంత సుర‌క్షిత‌మైన‌ హెలికాప్ట‌ర్‌. ప్ర‌ధాని మోడీ సైతం ప‌ర్య‌ట‌న‌ల‌కు ఎంఐ హెలికాప్ట‌రే వాడుతారు. ఈ హెలికాప్టర్‌కు ప్రత్యేకమైన రక్షణ కవచాలు అమర్చి ఉంటాయి. ఇన్ఫ్రారెడ్‌ సప్రెసర్లు, జామర్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇంధన ట్యాంక్‌ నుంచి ఎటువంటి ప్రమాదం జరగకుండా ఏర్పాట్లు ఉన్నాయి. సెల్ఫ్‌సీల్డ్‌ ట్యాంక్‌ పేలి మంటలు వ్యాపించకుండా పాలీయూరేథీన్‌ అనే సింథటిక్‌ ఫోమ్‌ రక్షణగా ఉంటుంది. అయినా కునూరు ఘ‌ట‌న‌లో హెలికాప్ట‌ర్ నుంచి మంట‌లు చెల‌రేగాయ‌ని అంటున్నారు. దీంతో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ప్రయాణించిన హెలికాప్టర్ కు జరిగిన ప్రమాదం మిస్టరీగా మారుతోంది. దట్టమైన పొగమంచే ప్రమాదానికి కారణమని ముందుగా అందరు అనుకున్నా ఇపుడు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.

హెలికాప్టర్ క్రాష్ అయిన  నీలగిరి కొండలు అడవులున్న లోయలున్న ప్రాంతాల్లో ప్రమాదానికి ముందు రోజు భారీ వర్షాలు కురిశాయట. మంగళవారం  కురిసిన భారీ వర్షాల వల్ల కొండలు లోయంతా దట్టమైన పొగమంచుతో కప్పేసిందట. ప్రమాదం జరిగిన బుధవారం ఉదయం కూడా వర్షం కురిసిందట. అంతటి పొగమంచున్నపుడు హెలికాప్టర్లో ప్రయాణించటానికి ఎవరినీ అనుమతించరు. కానీ సీడీసీఎస్ జనరల్ బిపిన్ రావత్ బృందం ఎందుకు వెళ్లిందన్నది అంతుచిక్కడం లేదు. ఎంఐ-17వీ5 సాధారణ హెలికాప్టర్ కాదు. ప్రతికూల వాతావరణంలో కూడా సులభంగా ప్రయాణం చేయగలిగిన సామర్ధ్యం కుంది. బిపిన్ ప్రయాణించిన హెలికాప్టర్ 6 వేల మీటర్ల ఎత్తులో అంటే 18 వేల అడుగుల ఎత్తులో ప్రయాణించగలదు. ఒకవేళ పొగమంచు దట్టంగా అలముకున్నా పొగమంచుకన్నా ఎత్తులో ప్రయాణించే అవకాశం ఈ హెలికాప్టర్ కుంది. మరీ పైలెట్ ఎందుకు తీసుకెళ్లలేదన్నది మిస్టరీగానే ఉంది. 

ఇక సూలూరు-వెల్లింగ్టన్ డిఫెన్స్ కాలేజీ మధ్య డిఫెన్స్ హెలికాప్టర్లు రెగ్యులర్ గా ప్రయాణం చేస్తునే ఉంటాయి.  పైలెట్లకు హెలికాప్టర్ నడపటం వాతావరణం కొత్త కూడా కాదు. సూలూరు ప్రాంతంలోని కొండలు లోయలు అడవుల పై పైలెట్లకు పూర్తిస్ధాయి అవగాహన ఉందని ఉన్నతాధికారులు చెబుతున్నారు. పొగమంచును అధిగమించే అవకాశాలు అనుభవజ్ఞలైన పైలెట్లు భౌగోళిక పరిస్ధితులపై పూర్తి సమాచారం ఉన్న పైలెటే హెలికాప్టర్ ను నడిపినా ప్రమాదం జరగటమే ఆశ్చర్యంగా ఉంది. ఈ హెలికాప్టర్ కు రెండు ఇంజన్లు చెడిపోయినా సేఫ్ గా భూమిపైన ల్యాండింగ్ చేసే సౌకర్యం కూడా ఉండదట. హెలికాప్టర్ ప్రయాణించాల్సిన సమయం కూడా కేవలం 25 నిముషాలు మాత్రమే. మరి ఇంత తక్కువ సమయం ప్రయాణంలో ఎలాంటి ప్రతికూల పరిస్ధితులను కూడా తట్టుకునే హెలికాప్టర్ కు ప్రమాదం జరిగి కుప్పకూలిపోవడం ఎవరికీ అర్ధం కావటంలేదు. మరలాంటపుడు ప్రమాదానికి కారణాలు ఏమిటనేది సస్పెన్సుగా మారిపోయింది. వాతావరణ ప్రభావం వల్ల ప్రమాదం జరిగుండదని. మరి దర్యాప్తులోనే అన్నీ విషయాలు బయటపడాల్సి ఉందని నిపుణులు చెబుతున్నారు. 

By
en-us Political News

  
తమ కుటుంబ వివాహ వేడుకకు తండ్రిసమానులైన ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఆహ్వానించడంలో తప్పేముందని ప్రశ్నించిన షర్మిల.. దీనికి అనవసరమైన, అభ్యంతరకరమైన అర్థాలు ఆపాదించి ప్రచారం చేయడం జగన్ దిగజారుడుతనానికి నీచ మసస్థత్వానికి నిదర్శనమన్నారు.
తెలంగాణ కాంగ్రెస్ రాజకీయ వర్గాల్లో గత కొంతకాలంగా నెలకొన్న ఉత్కంఠకు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) అధికారికంగా తెరదించింది.
ఈ నేపథ్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ తరపున తొలిసారిగా విజయసాయి పార్టీపై స్పందించారు. అయితే, ఆయన తన స్పందనను చాలా సాధారణంగా, క్లుప్తంగా ముగించడమే కాకుండా విజయసాయి రెడ్డిని   తేలికగా తీసుకున్నట్లు కనిపించింది.
వైసీపీకి సుదీర్ఘకాలం పాటు అత్యంత సన్నిహితుడిగా, కీలక నేతగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడం రాష్ట్ర రాజకీయ వర్గాల్లోచర్చకు తెరతీసింది.
పేద,  మధ్యతరగతి ప్రజల ఆదాయాన్ని పెంచేలా చర్యలు తీసుకోవడం వంటి హామీలను ప్రకటించారు. రాజకీయాల్లో పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన అందించడమే తమ పార్టీ విధానమని విజయసాయిరెడ్డి చెప్పారు, 
విజయ్ ప్రభంజనంతో ఎంతోమంది సామాన్య అభ్యర్థులు సైతం ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు. అయితే.. ప్రజలు అందించిన ఈ భారీ విజయాన్ని కొందరు ప్రజాప్రతినిధులు సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కడప జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
ప్రతి ఒక్కరికీ నిర్దిష్ట పాత్రలు ఉండేలా చంద్రబాబు    రూపొందించిన వ్యవస్థ వల్ల  కుటుంబంలో అంతర్గత విభేదాలు రాకుండా, ఎవరికీ తక్కువ అనే భావన కలగకుండా ఉందనీ, కుటుంబంలో అందరం సమానమేననీ చెప్పారు.
నిన్నటి వరకూ జగన్ కు పెట్టని కోటలా నిలిచిన పులివెందులలో ఇప్పుడు తెలుగుదేశం జెండా ఘనంగా ఎగురుతోంది.  సుదీర్ఘకాలంగా వైసీపీకి తిరుగులేని కంచుకోటగా ఉన్ పులివెందుల పరిధిలో తెలుగుదేశం పార్టీ తన ఉనికిని బలంగా చాటుకుంటోంది.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీరుపై ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
తుఫాను కారణంగా చీరాల మన్సిపాల్టీలో ఓట్ల లెక్కింపు శుక్రవారం (నవంబర్ 5) జరుగుతోంది. ఇప్పటి వరకు ఎక్కడా కనీసం డిపాజిట్ కూడా దక్కని కాంగ్రెస్ ఖాతాలో  తొలి విజయం నమోదైంది. కాంగ్రెస్ పార్టీ చీరాల మునిసిపోల్స్ లో గట్టి పోటీ ఇచ్చింది. 25వ వార్డులో విజయం సాధించింది.  25వ వార్డు నుంచి బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థి వెంకట్రావు విజయం సాధించారు. 
పోలింగ్ సరళి, వెలువడిన ఫలితాలు వైసీపీ శిబిరంలో ఆందోళన కలిగిస్తుంటే వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ మాత్రం మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ, అధికార తెలుగుదేశం కూటమి అరాచకాలు, అధికార దుర్వినియోగం తమ ఓటమికి కారణాలుగా చూపడానికి ప్రయత్నిస్తున్నారు.  ఎన్నికల ఫలితాల వెల్లడి తర్వాత వైఎస్ జగన్ నిర్వహించిన ఈ మీడియా సమావేశంలో జగన్ చెప్పిందే చెప్పారు. 
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.