అయోథ్య రామమందిరం ఒక్కటే కాదు.. బద్రీనాథ్ ఆలయంలోనూ కానుకల గోల్ మాల్.!
Publish Date:Jul 4, 2026
Advertisement
విరాళాలు కానుకల స్కామ్ ఒక్క అయోధ్య రామమందిరంలోనే కాదు.. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయంలోనూ జరిగిందని తేలడం ఇప్పుడు సంచలనం సృష్టిస్తోంది. అయోధ్య రామమందిరంలో విరాళాల స్కామ్ పై విచారణ సాగుతుండగా సరిగ్గా అలాంటే స్కామే భద్రీనాథ్ ఆలయంలోనూ జరిగిందన్న ఆరోపణలు రావడం కలకలం సృష్టిస్తోంది. బద్రీనాథ్ ధామ్‌లో భక్తులు సమర్పించిన కానుకల నిర్వహణలో భారీగా అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కోట్లాది మంది హిందువుల సెంటిమెంట్‌తో ముడిపడి ఉన్న ఈ అంశం తీవ్ర వివాదానికి దారితీయడంతో.. బద్రీనాథ్, కేదార్‌నాథ్ టెంపుల్ కమిటీ (బీకేటీసీ) ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించింది. ఈ ఆరోపణలపై బీకేటీసీ అధ్యక్షుడు హేమంత్ ద్వివేది.. తాము ఈ అక్రమాల ప్రచారాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తున్నామనీ, ఆలయ పవిత్రతకు భంగం కలిగించే ఎలాంటి చర్యలనూ సమించేది లేదనీ పేర్కొన్నారు నిజానిజాలను నిరూపించేందుకు ప్రత్యేక విచారణ కమిటీని వేసినట్లు చెప్పిన ఆయన ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలయ ఉద్యోగులకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. ప్రత్యేక కమిటీ జరిపే అంతర్గత విచారణలో ఎవరైనా ఉద్యోగి తప్పు చేసినట్లు నిరూపితమైతే, వారిపై చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హేమంత్ ద్వివేది చెప్పారు. ఇదే సమయంలో ఆలయ కమిటీ పై వస్తున్న ప్రచారాలనుఆయన ఖండించారు. కానుకల గోల్ మాల్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఉద్యోగి తనకు పీఏగా వ్యవహరిస్తున్నారంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన హేమంత్ తనకు వ్యక్తిగత కార్యదర్శి లేరని, ఆ సదరు వ్యక్తి ఆలయ కమిటీలో పనిచేసే ఒక సాధారణ ఉద్యోగి మాత్రమేనని స్పష్టం చేశారు. పైగా సదరు ఉద్యోగి గత మూడు కమిటీల అధ్యక్షుల హయాంలోనూ అదే స్థానంలో విధులను నిర్వహించాడని గుర్తుచేశారు. రామ మందిరం వివాదం మరువక ముందే బద్రీనాథ్‌లో ఇలాంటి కానుకల నిర్వహణ లోపాలు తెరపైకి రావడం దేశవ్యాప్తంగా ఉన్న భక్తులలో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. Badrinath Temple controversy, BKTC probe, Donation mismanagement allegations, Hemant Dwivedi statement, Teluguone
http://www.teluguone.com/news/content/irregularities-regarding-offerings-at-badrinath-temple-36-225038.html





