Publish Date:Jun 28, 2026
పసికూన ఐర్లాండ్ చేతిలో టీ20 ప్రపంచ ఛాంపియన్ భారత్‌కు పరాభవం ఎదురైంది. బెల్‌ఫాస్ట్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ ఒక్క పరుగు తేడాతో సంచలన విజయం సాధించి రెండు మ్యాచ్ ల టి20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసింది. చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఓటమితో టీమిండియా 16 సిరీస్‌ల విజయాల జైత్రయాత్రకు తెరపడింది.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఆ జట్టులో హ్యారీ టెక్టర్ హాఫ్ సెంచరీతో రాణించగా, బెంజమిన్ 37 పరుగులు చేశాడు. భారత బౌలర్లలో ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు, అర్ష్‌దీప్ సింగ్, శివమ్ దూబే చెరో రెండు వికెట్లు తీశారు.
155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్.. , ఆదిలోనే వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. తిలక్ వర్మ 46 బంతుల్లో 55 ఒంటరి పోరాటం చేసినప్పటికీ, ఇతర బ్యాటర్లు విఫలమయ్యారు. చివరి ఓవర్లలో హర్షిత్ రాణా 10 బంతుల్లో 21 మెరుపులు మెరిపించినా.. భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 153 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఐర్లాండ్ బౌలర్లలో జై మూంద్రా, మాథ్యూ హొల్లార్డ్ చెరో 3 వికెట్లు తీసి తమ జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. మార్క్ అడైర్, పాల్ స్టిర్లింగ్ వంటి కీలక ఆటగాళ్లు లేకుండానే ఐర్లాండ్ ఈ అద్భుత విజయం సాధించడం విశేషం. టీమిండియా టీ20 కెప్టెన్ గా శ్రేయస్ అయ్యర్ తొలి సిరీస్ లోనే ప్రతికూల ఫలితాన్ని ఎదుర్కొన్నాడు.
ఐర్లాండ్ చేతిలో టీ20 సిరీస్‌ను కోల్పోయిన తర్వాత భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ.. పిచ్‌ను అర్థం చేసుకోవడంలో, పరిస్థితులకు తగ్గట్టుగా ఆడటంలో ప్రత్యర్థి జట్టు తమకంటే మెరుగ్గా వ్యవహరించిందని ప్రశంసించాడు. పిచ్ ను అంచనా వేయడలో తాము విఫలమయ్యామని చెప్పిన టీమ్ ఇండియా స్కిప్పర్ శ్రేయస్ అయ్యర్.. ఆ విషయంలో ఐర్లాండ్ మమ్మల్ని పూర్తిగా మించిపోయిందన్నాడు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/irland-vlean-sweep-india-36-224425.html
తుర్కియేలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఈ పరిణామాలపై స్పందించారు. ఇరాన్ దుశ్చర్యకు బుద్ధి చెప్పేలా రూపొందించిన వైమానిక దాడి ప్రణాళికకు ఆయన అక్కడి నుంచే ఆమోదం తెలిపారు. అమెరికా వైమానిక దాడుల ధాటికి దక్షిణ ఇరాన్‌లోని రేవు పట్టణాలు బందర్ అబ్బాస్, సిరిక్, క్వేష్మ్ దీవుల పరిసర ప్రాంతాలు భారీ పేలుళ్లతో దద్దరిల్లాయి. ఇరాన్ ప్రభుత్వ అధికారిక మీడియా సంస్థలు తమ భూభాగంలో సంభవించిన ఈ భారీ పేలుళ్లను ధ్రువీకరించాయి.
మొదటి దశలో ఆలయం చుట్టూ పటిష్టమైన ప్రాకారం, సుదూర ప్రాంతాల నుండి సైతం భక్తులను ఆకర్షించే విధంగా ఏడు అంతస్తుల మహా రాజగోపురం, భక్తుల సౌకర్యార్థం ఆర్జిత సేవా మండపం, అద్దాల మండపంతో పాటు వాహన, రథ మండపాలను నిర్మించనున్నారు.
దర్యాప్తులో సంబంధిత కాలంలో ఆయనకు వివిధ వనరుల ద్వారా సుమారు 1.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అదే కాలంలో 71.58 లక్షల రూపాయల మేర ఖర్చులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ లెక్కల ప్రకారం ఆయన వద్ద చట్టబద్ధంగా ఉండాల్సింది 88.42 లక్షల రూపాయలు మాత్రమేనని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు.
జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్‌లో 501 పరుగులు చేసిన ఆర్సీబీ స్టార్ రజత్ పాటిదార్‌ను పక్కనపెట్టి, ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్‌కు చోటు ఇవ్వడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్‌లో కాగ్నిజెంట్ ఐటీ సెజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు మరియు కొత్త ఐటీ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్‌లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్‌పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్‌లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేశారు.