సోషల్ మీడియా వేదికగా వ్యవస్థీకృత దుష్ప్రచారానికి పాల్పడే వారిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. సామాజిక మాధ్యమాల ద్వారా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తూ, అశ్లీల పోస్టులు పెడుతూ, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారాలకు ఒడిగట్టే శక్తులపై ఉక్కుపాదం మోపాలని హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.
మంగళగిరిలోని పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి డీజీపీతో కలిసి ఆమె అన్ని జిల్లాల ఎస్పీలు, రేంజ్ డీఐజీలు, ఐజీలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రంలోని శాంతిభద్రతల పరిస్థితిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారాలను అరికట్టడానికి, వ్యవస్థీకృత నేరగాళ్లను పట్టుకోవడానికి హోంమంత్రి కీలక సూచనలు చేశారు. ఫేక్ న్యూస్, అసభ్యకర పోస్టుల వెనుక ఉన్న నెట్‌వర్క్‌లను ఛేదించడానికి నెట్వర్క్ ఆధారిత దర్యాప్తు ముమ్మరం చేయాలన్నారు. అలాగే.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సైబర్ గార్డ్ యూనిట్లు, సోషల్ మీడియా పర్యవేక్షణ విభాగాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
రిపీటెడ్ అఫెన్సెస్ కు పాల్పడే వారిపై, సమాజంలో అభద్రతా భావాన్ని సృష్టించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. అలాగే అదే సమయంలో అంటే.. వ్యవస్థీకృత దుష్ప్రచారం చేసే వారిపై చర్యలు తీసుకునే క్రమంలో.. రాజ్యాంగం కల్పించిన భావవ్యక్తీకరణ స్వేచ్ఛకు, ప్రజాస్వామ్య చర్చలకు, చట్టబద్ధమైన విమర్శలకు ఎలాంటి భంగం కలగకుండా పోలీసులు వ్యవహరించాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలో సోషల్ మీడియా దుష్ప్రచారానికి సంబంధించి గత రెండేళ్లలో 1,665 కేసులు నమోదయ్యాయని, హానికరమైన, అలాగే అసత్య ప్రచారాలకు సంబంధించిన 12 వేల వెబ్‌లింక్‌లను సహయోగ్ ద్వారా ఇప్పటికే తొలగించినట్లు పోలీసు అధికారులు ఈ సందర్భంగా హోంమంత్రికి వివరించారు.రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీసేలా, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా సోషల్ మీడియాను వాడుకుంటే ఊపేక్షించేది లేదని, అవసరమైతే అసత్య ప్రచారాలను నియంత్రించడానికి ప్రభుత్వం త్వరలోనే ప్రత్యేక చట్టాన్ని కూడా తీసుకురావడానికి ఆలోచిస్తోందని మంత్రి చెప్పారు.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/iron-fist-against-social-media-misinformation-36-225282.html
దర్యాప్తులో సంబంధిత కాలంలో ఆయనకు వివిధ వనరుల ద్వారా సుమారు 1.60 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందనీ, అదే కాలంలో 71.58 లక్షల రూపాయల మేర ఖర్చులు జరిగినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ లెక్కల ప్రకారం ఆయన వద్ద చట్టబద్ధంగా ఉండాల్సింది 88.42 లక్షల రూపాయలు మాత్రమేనని ఏసీబీ ఎఫ్ఐఆర్ లో పేర్కొంది.
విద్యా రంగం పట్ల ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని గర్హించారు. దీర్ఘ కాలంగా అపరిష్కృతంగా ఉన్న విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు గుప్పించారు. కాగా ఈ సందర్భంగా పలు డిమాండ్లను విద్యార్థి సంఘాల నాయకులు ప్రభుత్వం ముందు ఉంచారు.
జింబాబ్వే పర్యటన కోసం ప్రకటించిన భారత టీ20 జట్టు ఎంపిక వివాదాస్పదంగా మారింది. ఐపీఎల్లో 501 పరుగులు చేసిన ఆర్సీబీ స్టార్ రజత్ పాటిదార్‌ను పక్కనపెట్టి, ఒక్క వికెట్ తీయని మయాంక్ యాదవ్‌కు చోటు ఇవ్వడంపై సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్‌లో కాగ్నిజెంట్ ఐటీ సెజ్ ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్. మధురవాడ, రుషికొండ, ఎండాడ ప్రాంతాల్లో భారీగా పెరుగుతున్న ఇళ్ల అద్దెలు మరియు కొత్త ఐటీ ఉద్యోగాల పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతి, తిరుపతి ఆర్థిక ప్రాంతాల మాస్టర్ ప్లాన్ కోసం 6 నెలల డెడ్‌లైన్ విధించారు. స్వర్ణ ఆంధ్ర 2047 లక్ష్యాలు, వైజాగ్ బే సిటీ ప్రాజెక్ట్ విశేషాలు మరియు రాయలసీమ హార్టికల్చర్ విప్లవంపై పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయానికి వెళ్లే వారికి ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. హెబ్బాల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు రూ.35 కోట్లతో నిర్మించనున్న సిగ్నల్ రహిత కారిడార్, సదాహళ్లి అండర్‌పాస్ పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.
ఇరాన్ అంతు చూస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఫినిష్ ది జాబ్ అంటూ ఓవల్ ఆఫీస్ నుండి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు, టెహ్రాన్‌లో వ్యక్తమవుతున్న ప్రతీకార జ్వాలల వెనుక ఉన్న అసలు కారణాలు మరియు పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
బజాజ్ ఆటో సంస్థ ప్రకటించిన రూ. 5,633 కోట్ల మెగా బైబ్యాక్ ఆఫర్ నేటితో ముగియనుంది. ఒక్కో షేరును రూ. 12,000 చొప్పున 20% ప్రీమియం ధరతో కొనుగోలు చేస్తున్న కంపెనీ. అర్హత వివరాలు, ముగింపు గడువు మరియు నిపుణుల సూచనలు ఇక్కడ చదవండి.
ఆత్మహత్యకు ప్రేరేపించడంతో పాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద కృష్ణలంక పోలీసులు నాగరాజుపై కేసు నమోదు చేశారు.
ఇన్కమ్ టాక్స్ సెక్షన్ 143(3) కింద స్క్రూటినీ నోటీసు వచ్చిందా? ఆందోళన పడకుండా ఆన్లైన్లో DIN నంబర్ వెరిఫై చేసుకునే విధానం, నోటీసును నిర్లక్ష్యం చేస్తే పడే 50% నుండి 200% భారీ జరిమానాలు మరియు e Proceeding ద్వారా సురక్షితంగా స్పందించే పూర్తి వివరాలు ఈ వెబ్ స్టోరీలో చూడండి.
ప్రముఖ ఇన్వెస్టర్ ఆశిష్ కచోలియా పోర్ట్‌ఫోలియోలోని వి మార్క్ ఇండియా మల్టీబ్యాగర్ స్టాక్ ఒక్కరోజే 81% పతనమైందా ఇన్వెస్టర్లు ఎందుకు ఆందోళన చెందాల్సిన అవసరం లేదో, 5:1 బోనస్ షేర్ల వెనుక ఉన్న అసలు మార్కెట్ లెక్కలను ఈ స్టోరీలో వివరంగా తెలుసుకోండి.
కళ్యాణ్ జ్యువెలర్స్ ఇండియా షేర్లు మంగళవారం ట్రేడింగ్‌లో దాదాపు 8 శాతం పడిపోయాయి. ఆదాయం పెరిగినప్పటికీ, ప్రత్యర్థి టైటాన్ కంపెనీ ఫలితాల ప్రభావం మరియు మార్కెట్ అంచనాల వల్ల ఈ భారీ పతనం సంభవించింది. పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.