Publish Date:Apr 11, 2026
అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలకు ముగింపు పలికే లక్ష్యంతో పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో కీలకమైన శాంతి చర్చలు ప్రారంభమయ్యాయి. అయితే, ఈ చర్చల సందర్భంగా చోటుచేసుకున్న ఒక ఉద్విగ్న పరిణామం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. యుద్ధం సృష్టించిన మానవ విషాదాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఇరాన్ ప్రతినిధి బృందం యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారులకు చెందిన రక్తసిక్తమైన స్కూల్ బ్యాగులు, బూట్లు, వారి ఛాయాచిత్రాలను తమ వెంట తీసుకువచ్చింది. ఇరాన్ ప్రతినిథి బృందానికి ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘలీబాఫ్ నేతృత్వం వహించారు. ఆయన తన బృందంతో కలిసి ఇస్లామాబాద్‌కు బయలుదేరిన విమానంలో అత్యంత విషాదకరమైన దృశ్యాలు కనిపించాయి. విమానంలోని ముందు వరుస సీట్లలో ఈ వస్తువులను ఉంచి, యుద్ధం కారణంగా బలియైన పసిప్రాణాలకు నివాళి అర్పించారు.
గత ఫిబ్రవరి 28న దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ పట్టణంలో జరిగిన దాడుల్లో సుమారు 168 మంది పాఠశాల విద్యార్థులు మరణించారు. ఈ దాడులకు అమెరికా, ఇజ్రాయెల్ కూటమే కారణమని ఇరాన్ అంటోంది. ఆ మరణించిన చిన్నారుల జ్ఞాపకార్థం తమ ప్రతినిధి బృందానికి మినాబ్ 168 అని పేరు పెట్టిన ఘలీబాఫ్, ఈ ప్రయాణంలో నా సహచరులు వీరే అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో అందరినీ కలిచివేస్తున్నది. నెటిజనులు కళ్లు చెమర్చాయి అంటూ స్పందిస్తున్నారు.
ఈ చర్చల్లో అమెరికా బృందానికి ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వం వహిస్తున్నారు. 2011 తర్వాత ఒక అమెరికా ఉపాధ్యక్షుడు పాకిస్థాన్ గడ్డపై అడుగుపెట్టడం ఇదే మొదటిసారి. ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగుపరచడంతో పాటు, టెహ్రాన్ ప్రతిపాదించిన 10 సూత్రాల కాల్పుల విరమణ ఒప్పందంపై కూడా ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. యుద్ధ క్షేత్రంలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల వస్తువులను చర్చల వేదిక వరకు తీసుకురావడం ద్వారా, యుద్ధం వల్ల కలిగే నష్టాన్ని అమెరికాకు సూటిగా చెప్పాలన్నది తమ ఉద్దేశమని ఇరాన్ పేర్కొంది.
అదలా ఉంటే.. ఈ భేటీలో కుదిరే ఒప్పందాలు మధ్యప్రాచ్యంలో శాంతి స్థాపనకు ఏ మేరకు దోహదపడతాయన్నదానిపై ప్రపంచ దేశాలన్నీ ఆసక్తిగా ఉన్నాయి. ఇరు దేశాల మధ్య నెలకొన్న వైరాన్ని పక్కన పెట్టి, కాల్పుల విరమణ దిశగా అడుగులు పడాలని అంతర్జాతీయ సమాజం ఆశిస్తోంది. ముఖ్యంగా ఇరాన్ ప్రదర్శించిన ఈ భావోద్వేగ నిరసన, చర్చల దిశను ఎలా మారుస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/iran-emotional-protest-ahead-of-peace-talks-36-217122.html
నారాయణ్‌పూర్ జిల్లాకు ఆనుకుని ఉన్న ఛోటేబేతియా పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్‌గఢ్‌ని మార్చి 31న సాయుధ మావోయిస్టులు లేని రాష్ట్రంగా ప్రకటించారు. సాయుధ మావోలు లేని రాష్ట్రంగా ప్రకటించిన తర్వాత రాష్ట్రంలో జరిగిన తొలి పేలుడు ఇదే కావడం గమనార్హం.
సీఎం చంద్రబాబుకు పవన్ కల్యాణ్, ఆయన భార్య అనా కొణిదెల సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పవన్ ఆరోగ్య పరిస్థితిని చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు.
లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగం వ్యవహారంలో సూత్రధారిగా ఏకసభ్య కమిషన్ తేల్చిన ఈవో ధర్మారెడ్డి వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు.
గత కొద్ది కాలంగా మంత్రి లోకేష్ నేతృత్వంలో విద్యాశాఖ పలు విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొద్దిరోజుల క్రితమే ఏపీ ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థుల బృందం ఢిల్లీ పర్యటనకు వెళ్లి.. అక్కడి సైన్స్ సెంటర్లు, ప్రముఖ విద్యా సంస్థలను సందర్శించి వచ్చిన సంగతి తెలిసిందే. పుస్తకాల్లోని జ్ఞానానికి తోడుగా విద్యార్థులకు వాస్తవిక ప్రపంచంపై అవగాహన కల్పించేందుకు ఆ యాత్ర ఎంతో దోహదపడింది. ఇప్పుడు ఉపాధ్యాయులను కూడా విదేశాలకు పంపడం ద్వారా అటు విద్యార్థులకు, ఇటు ఉపాధ్యాయులకు ఇద్దరికీ సమానమైన ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది.
ల్లభనేని బాబూరావు మృతి పట్ల ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బాబూరావు మృతి పార్టీకి తీరని లోటని తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. బాబూరావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, పార్టీ ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వివాహం అనంత రం ఈ ప్రేమికులు అదే కాలనీలో నివాసం ఉంటున్నారు. కావ్య తల్లిదండ్రులు కూడా అదే కాలనీలో మరో వీధిలో నివాసం ఉంటున్నారు.
గత నెల 28న కావ్య అక్క తన తల్లి ఇంటికి వచ్చింది. దీంతో తల్లి కొల్లా అరుణ తన చిన్న కూతురు కావ్యను కూడా ఇంటికి పిలిచింది. అదే రోజు మధ్యాహ్నం సమయంలో కావ్య తన పుట్టింటికి వెళ్ళింది.
ఏం జరిగిందో ఏమో కానీ కార్తీక్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోగా, మంజుల విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. వీరు ఉదయం నుంచి తలుపులు తెరవ కపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చి. . కిటికీలోంచి చూడగా నవ దంపతులు విగతజీవులుగా కనిపించారు.
చిన్న తనంలోనే తోబుట్టువులు అనారోగ్యంతో చనిపోవడం కోడెలను తీవ్రంగా కలిచివేసింది. ఆ విషాదమే ఆయనలో డాక్టర్ కావాలనే ఆలోచనకు బీజం వేసిందని సన్నిహితులు చెప్తుంటారు. మొదటి సారి మెడికల్ ఎంట్రన్స్‌లో మంచి మార్కులు రాకపోవడంతో.. తరువాత గుంటూరు ఎ.సి కళాశాలలో చేరి మళ్ళీ పీయూసీ చదివి మంచి మార్కులు తెచ్చుకుని కర్నూలు వైద్య కళాశాలలో చేరారు.
శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదివి అత్యధిక మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు ఒక్కొక్కరికి మూడు సెంట్ల భూమి బహుమతిగా ఇవ్వనున్నట్టు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలిపారు.
ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపెట్టారు. ఇన్‌స్టా గ్రామ్‌లో రీల్స్, ఫేక్ ప్రొఫైల్స్ ద్వారా పరిచయాలు పెంచుకుని యువతులను ప్రేమ, పెళ్లి పేరుతో ట్రాప్ చేసి భారీగా డబ్బులు దోచుకున్నట్లు వెల్లడైంది.
ప్రాథమిక సమాచారం ఆధారంగా ఐటి అధికారులు పలువురు నిందితులకు నోటీసులు జారీ చేయనున్నారు. దర్యాప్తులో భాగంగా ఈ అక్రమ డబ్బు మార్గాలను ట్రాక్ చేయడంపై ఐటీ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా బ్యాంకింగ్ వ్యవస్థకు దూరంగా ఉంచేందుకు.. డబ్బును ఒకచోట నుండి మరొక చోటకు తరలించేందుకు హవాలా మార్గాన్ని ఉపయోగించినట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని, రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో జీఎన్ నాయుడు కృషి ఎనలేనిదని సీఎం అన్నారు.
విమాన టికెట్ బుక్ చేసుకుని విదేశీ ప్రయాణానికి సిద్ధమయ్యాడన్న సమాచారం అందడంతో వెంటనే రంగం లోకి దిగిన జూబ్లీహిల్స్ పోలీసులు అతని ప్రయా ణాన్ని అడ్డుకున్నారు. కేసు విచారణ కొనసాగుతున్నం దున దేశం విడిచి వెళ్లేందుకు అనుమతి లేదని స్పష్టంగా తెలిపారు.