సమాజ నిర్మాణంలో మహిళల పాత్రే కీలకం : సీఎం చంద్రబాబు

Publish Date:Mar 8, 2026

Advertisement

 

అమరావతిలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి మాట్లాడుతు తెలుగు మహిళలు ఏ పని తలపెట్టిన లక్ష్యాన్ని సాధించే వరకు వదిపెట్టరని చంద్రబాబు కొనియాడారు. రాష్ట్ర అభివృద్ధిలో మహిళలు సమాజం నిర్మాణంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ఆయన కొనియాడారు. మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోవాలని వారికి ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తుందని హామీ ఇచ్చారు. 

మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నేత ఎన్టీఆర్‌ అని ముఖ్యమంత్రి అన్నారు. మహిళలు బాగా చదువుకోవాలని ప్రత్యేక విశ్వవిద్యాలయం తెచ్చారని తెలిపారు. మహిళా పారిశ్రామికవేత్తలు ఇప్పటికే లక్ష దాటారు. తీసుకున్న రుణాలను సమయానికి బ్యాంకులకు చెల్లిస్తున్నారు. 

అప్పులు ఇప్పించే బాధ్యత తనదని సద్వినియోగం చేసుకోవాల్సింది మీరేనని ముఖ్యమంత్రి అన్నారు. మీరు తయారు చేసి వస్తువులు మీరే వాడుకోవాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాదిలో  మరో 5లక్షల మహిళలను పారిశ్రామికవేత్తలుగా తయారుచేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రతి ఇంట్లో స్వయం బ్రాండ్ ఉత్పత్తులే వాడాలి అని చంద్రబాబు తెలిపారు.

డ్వాక్రా, మెప్మాలో ప్రస్తుతం 1.1 కోట్ల మంది సభ్యులు ఉన్నారని తెలిపారు. మహిళలు తయారు చేసే ఉత్పత్తులు దేశవ్యాప్తంగా విస్తరించాలని ఆకాంక్షించారు. తమ ఇంట్లో కూడా ఇద్దరు మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దామని, తన భార్య, కోడలు సమర్థంగా వ్యాపారం నిర్వహిస్తున్నారని చెప్పారు. ప్రతి ఇంట్లోనూ ఒక మహిళా వ్యాపారవేత్త ఉండాలని సూచించారు.

ఆడబిడ్డల రక్షణ విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. దుర్మార్గులను అరికట్టాల్సిన బాధ్యత సమాజంపైనే ఉందన్నారు. మహిళల జోలికి వస్తే అదే వారికి చివరి రోజు అవుతుందని హెచ్చరించారు. ఆరోగ్యం విషయంలో మహిళలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, ఇంట్లో ఎవరికీ వ్యాధులు రాకుండా చూసుకునే బాధ్యత కూడా మహిళలదేనని పేర్కొన్నారు.

సమాజంలో వస్తున్న మార్పుల వల్ల జనాభా తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. జనాభా తగ్గితే అనేక సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందన్నారు. పెద్ద కుటుంబం ఉంటే రక్షణ, భద్రత, ఆనందం కలుగుతాయని చెప్పారు. ప్రభుత్వ పథకాలు పెద్ద కుటుంబాలకు కూడా అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం 58 శాతం మంది ఒక్క బిడ్డకే పరిమితం అవుతున్నారని పేర్కొన్నారు.


 

By
en-us Political News

  
విద్యా రంగంలో అత్యున్నత ప్రమాణాలను కనబరిచినందుకు గాను ఆయనకు డాక్టర్ మన్మోహన్ సింగ్ గోల్డ్ మెడల్, ప్రొఫెసర్ డీఎల్ నారాయణ మెమోరియల్ పీహెచ్‌డీ గోల్డ్ మెడల్ లభించాయి.
జార్ఖండ్ ముక్తి మోర్చా నేతలు పరిమళ్ నత్వానీ నామినేషన్ పై తీవ్ర స్థాయిలో అభ్యంతరాలు వ్యక్తం చేశారు. నత్వానీ తన ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తుల వివరాలు, కుటుంబ సభ్యుల సమాచారం, అలాగే వివిధ కంపెనీల్లో కలిగి ఆయన డైరెక్టర్‌షిప్‌ల వంటి కీ విషయాలను సరిగ్గా వెల్లడించలేదనీ కాంగ్రెస్ ఆరోపించింది.
సంక్షేమ పథకాలతో అనర్హులు ఎలా లబ్ధి పొందుతున్నారన్నది వివరిస్తూ.. గృహలక్ష్మి పథకం కింద కొన్నిచోట్ల చనిపోయిన లబ్ధిదారుల పేరుతో ఇప్పటికీ డబ్బులు డ్రా అవుతున్నట్లు ప్రభుత్వ దృష్టికి వచ్చిందన్నారు. మరణించిన వారి బ్యాంక్ ఖాతాలకు వేరే మొబైల్ నంబర్లను లింక్ చేసి, భారీగా మోసాలకు పాల్పడుతున్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందనీ. ఇలాంటి వ్యవస్థాగత లోపాలను, మోసాలను అరికట్టి నిజమైన పేదలకు న్యాయం చేయడానికే ఈ వెరిఫికేషన్ అని వివరించారు.
ఆ పండ్లను తల్లి ఇందుమతితో పాటు నలుగురు కుమార్తెలు తిన్నారు.ఆదివారం సాయం త్రం నుంచి ఐదుగురికీ వాంతులు, విరేచనాలు ప్రారంభమవడంతో కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.
ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 18 కేసులు నమోదవగా, బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ముఖ్యంగా ఐటీ రంగంలో పనిచేసే యువతులే అతని మోసానికి ఎక్కువగా బలైనట్లు విచారణలో తేలింది.
భారతదేశంలో అత్యధిక కాలం నిరంతరాయంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిగా రికార్డు సృష్టించిన నరేంద్ర మోదీకి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానిగా 12 ఏళ్ల సుదీర్ఘ, అప్రతిహత ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని సరికొత్త చరిత్ర లిఖించినందుకు మోదీ నాయకత్వాన్ని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు.
సమావేశం ప్రారంభానికి ముందే పవన్ కల్యాణ్ ప్రధాని మోడీకి శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతదేశ రాజకీయ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రధానిగా సేవలందిస్తూ సరికొత్త రికార్డు నెలకొల్పినందుకు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారు.
బీహార్‌కు చెందిన అనిల్ కుమార్, మీనా దేవి దంపతులు జీవనోపాధి నిమిత్తం హైదరాబాద్ వచ్చి బొల్లారంలోని బీహార్ కాలనీలో నివాసం ఉంటున్నారు. అనిల్ కుమార్ లేబర్ కాంట్రాక్టర్ పని చేస్తూ సంపాదిస్తున్నాడు. అయితే గత కొంతకాలంగా అనిల్ కుమార్, మీనాదేవి మధ్య గొడవలు జరుగుతున్నాయి.
ఏపీ రాజధాని ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం అత్యంత ఆధునిక నివాస సముదాయాల నిర్మాణానికి ఏకంగా 1,234.91 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌ను కేటాయిస్తూ కేంద్రం చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేకమైన విషయం ఏమిటంటే, ఈ ప్రాజెక్టుకు అయ్యే మొత్తం వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వమే భరించనుంది.
రాష్ట్రంలో మహిళల భద్రతను నిరంతరం పర్యవేక్షించేందుకు తమిళనాడు వ్యాప్తంగా హైటెక్ డ్రోన్ నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు విజయ్ ప్రకటించారు. తమిళనాడు చరిత్రలోనే ఇటువంటి ఒక అధునాతన సాంకేతిక నిఘా వ్యవస్థను మహిళా రక్షణ కోసం ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి.
వర్షం పడే సమయంలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇక ఏపీలో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయనీ, పలు చోట్ల పాటు పిడుగులు పడే అవకాశం ఉందని పేర్కొంది.
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఆస్ట్రేలియాతో మహా సమరానికి ముందు సౌతాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్డ్ తమ జట్టును హెచ్చరించింది. న్యూజిలాండ్ చేతిలో ఓటమి తర్వాత వ్యూహాలు మార్చాలని డిమాండ్ చేసింది. పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.
అశేష జనానికి ఆపన్నహస్తం అందిస్తూ, హిందూపురం ప్రజలకు అండగా నిలుస్తూ మీరు సాగిస్తున్న జీవనయానం నిరంతరంగా కొనసాగాలని ఆకాంక్షిస్తున్నానని చంద్రబాబు పేర్కొన్నారు.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.