అంతర్గత కుమ్ములాటలపై అధిష్టానం చేతులెత్తేసిందా?

Publish Date:Jul 19, 2023

Advertisement

ఇప్పుడున్న రాజకీయ పార్టీలలో నేతలకు స్వేచ్ఛ ఉండదని రాజకీయ వర్గాల భావన. జాతీయ పార్టీల నుండి ప్రాంతీయ పార్టీల వరకూ అంతటా వ్యక్తుల ద్వారానే పార్టీలు నడుస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలలో అయితే ఇది వ్యక్తి పూజ, భజన వరకూ వెళ్ళింది. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో అయితే ఈ వ్యక్తి పూజ తారాస్థాయికి చేరి కనిపించింది. మొన్నామధ్య సినీ నిర్మాత బండ్ల గణేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పినట్లు వైసీపీ నేతలు తమ అధినేత జగన్మోహన్ రెడ్డిని దైవాంశ సంభూతుడిగా కీర్తించి చెట్టెక్కించేశారు.

జగన్మోహన్ రెడ్డిని మనిషి రూపంలో తిరిగే దేవుడిగా కీర్తించేశారు. ఆయన్ని ఎవరైనా ఒక్క మాట అంటే వాళ్ళని, వాళ్ళ కుటుంబాన్ని బజారుకి లాగి ఇష్టారాజ్యంగా తిట్టిపోసేవారు. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనేలా వైసీపీలో ఒక్కరూ అధిష్టానం పెద్దలు గీసిన గీత దాటకుండా ఉండేవారు. జగన్మోహన్ రెడ్డి ఆజ్ఞ వస్తే తల తీసి చేతిలో పెడతాం అనేలా ఉండేవారు వైసీపీ నేతలు.

కానీ, అదంతా ఒకప్పటి మాట   గతమే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి  కాగడా పెట్టి వెతికినా కనిపించడం లేదు. జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేతలు ఎన్ని అంటున్నా వైసీపీ నేతలు ఒక్కరూ నోరు మెదపడం లేదు. పైగా అంతర్గత కుమ్ములాటలు కూడా పెచ్చుమీరిపోయాయి. అధిష్టానం గీసిన గీతలను ఎప్పుడో దాటేసిన వైసీపీ నేతలు.. ఇప్పుడు మాటల కత్తులు పట్టి సొంత పార్టీ నేతల మీదనే యుద్దానికి దిగుతున్నారు. ఇక్కడా అక్కడా అని లేకుండా శ్రీకాకుళం నుండి అనంతపురం వరకూ.. చిత్తూరు నుండి కర్నూలు వరకూ.. ఈస్ట్ గోదావరి నుండి కృష్ణా వరకూ ఏ జిల్లాకి వెళ్లి చూసినా వైసీపీ నేతల మధ్య అంతర్గత పోరు తారస్థాయికి చేరింది.  హద్దులు దాటితే వేటు తప్పదన్న అధిష్టానం మాటలను బంగాళాఖాతంలో కలిపేసిన నేతలు సొంత పార్టీ నేతలనే ప్రత్యర్ధులుగా మార్చుకున్నారు.

అంతర్గత కుమ్ములాటలో శ్రీకాకుళం ముందుండగా.. ప్రకాశంలో నాయకులు మాకు మేమే అధిష్టానం అనే స్థాయిలో అజమాయిషీ చెలాయిస్తున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోనూ ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. నెల్లూరు పార్టీ తెరచాప లేని నావలా ఊగిసలాడుతున్నది. కృష్ణా, గుంటూరు నేతలు కంటికి కూడా కనిపించకుండా చాప కింద నీరులా రాజకీయం చేసుకుంటున్నారు. రాయలసీమ వైసీపీ సంచిలో నాటు బాంబు ఎప్పుడు పేలుతుందో అనేలా పరిస్థితి మారిపోయింది. విశాఖ నేతలు పార్టీ మీద నమ్మకాన్ని వదిలేసుకున్నట్లు మాట్లాడుతున్నారు. ఇంత జరుగుతున్నా వైసీపీ అధిష్టానం కిక్కురుమనడం లేదు. కుమ్ములాటలు వద్దు.. చర్యలు తప్పవని స్వయంగా జగన్  చెప్పినా మేము సిద్దమే అన్నట్లు నేతలు ఉన్నారే తప్ప ఎలాంటి జంకు కనిపించడం లేదు.

కుమ్ములాడుతున్న నాయకులపై చర్యలు తీసువాల్సిన అధిష్టానం.. కనీసం పన్నెత్తి కూడా వారిని మందలించడం లేదు. రెబల్స్ లాగా మారి రెచ్చిపోతున్నా శాంతం శాంతం అంటున్నదే తప్ప నియంత్రించే దిశగా ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదు.  మంత్రులు-ఎమ్మెల్యేల మధ్య సమన్వయం లేకపోగా నాది నీదీ అంటూ కీచులాడుకుంటున్నా అధిష్టానం సర్దిచెప్పేందుకు కూడా ప్రయత్రించడం లేదు.  ఎంపీలను కలుపుకుపోవాల్సిన ఎమ్మెల్యేలు మేమే రాజులం మేమే మంత్రులం అనేలా ఏకఛత్రాధిపత్యం చెలాయిస్తున్నా పార్టీ అధ్యక్షుడు కూడా చూసీ చూడనట్లే ఉంటున్నారు. ఇంకా చెప్పాలంటే అసలు వారు పార్టీలో ఉంటే చాలు అనేలా సీన్ మారిపోయింది.  ఏమైనా అంటే పొరుగు పార్టీల్లోకి జంప్ చేస్తారనే భయం వైసీపీ అగ్ర నాయకత్వంలో  స్పష్టంగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   వైసీపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి చూస్తే అధిష్టానం చేతులేత్తిసిందనే భావన కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు. 

By
en-us Political News

  
హైదరాబాద్‌‌ నగరంలో మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని చారిత్రాత్మక బాపూఘాట్ వద్ద జాతిపిత మహాత్మా గాంధీకి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నివాళులు అర్పించింది.
కనీస ధర రూ.30కి పెంపునకు సిఫార్సు.!
వెబ్‌సిరీస్‌ ల్లో ఎక్కువగా బ్యాంకులు, బంగారు దుకాణాల్లో దోపిడీలకు సంబంధించిన వీడియోలే చూసేవాడు.. ఆ తర్వాత తనకున్న ఆర్మీ అనుభవాన్ని ఉపయోగించుకోని సికింద్రాబాద్‌ మద్రాస్‌ రెజిమెంట్‌ను ఎంచుకున్నాడు.
ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) వ్యవహారశైలిని నిరసిస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తలపెట్టిన ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.
హైదరాబాద్ నగరవాసుల ప్రయాణ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక నిర్ణయం తీసుకుంది.
కొత్త కారు కొనుక్కోవాలని ఎన్నో రోజులుగా కలలు కంటారు.. ఆ కల నెరవేరిన రోజు ఆ ఆనందమే వేరు! ఎంతో ఇష్టపడి కొత్త బీఎండబ్ల్యూ కారు కొనుగోలు చేసిన ఓ వ్యక్తి..
తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త వాతావరణం నెలకొంది.
మహారాష్ట్రలోని ప్రఖ్యాత హిందూ హృదయసమ్రాట్ బాలాసాహెబ్ థాకరే మహారాష్ట్ర సమృద్ధి మహామార్గ్‌పై జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది.
దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన ఫ్లైదుబాయ్ విమానంలో భారత సంతతి కెప్టెన్‌‌పై జరిగిన కత్తిదాడి అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.
మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను దేశవ్యాప్తంగా అత్యంత భక్తిశ్రద్ధలతో, ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్‌లో డీఎస్సీ 2.0 నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు వేగవంతమైంది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.